ఈ రోజు ఈ ప్రియమైన అసుర పుట్టినరోజు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపు.
జి. లక్ష్మీ నరసయ్య
సొంతంగా ఆలోచించి సత్యాన్ని విశ్లేషించగల అతి తక్కువ మంది తెలుగు మేధావుల్లో సురేంద్ర రాజు ఒకరు. సవాళ్లకు బోకుండా సత్య వాక్కుల్ని చిమ్ముతూ పోతాడు.
చరిత్ర మీదా, తత్వ శాస్త్రం మీదా, సాహిత్యం మీదా అసాధారణ పట్టు ఉన్న థింకర్.
విలేఖరిగా, సాహిత్య విమర్శకుడిగా ఉన్నత ప్రమాణాలను నెలకొల్పిన వాడు, కొత్త కొత్త ఆవిష్కరణలు చేసినవాడు.
హోమియో వైద్యుడిగా అందరికీ అందుబాటులో ఉండే సేవాతత్పరుడు.
ఎంతో రాసి ఇంతవరకూ తనకంటూ తనదంటూ ఒక్క పుస్తకాన్ని వేసుకొని వాడు.
తాను అధికార ఆస్థాన పీఠాలన్నింటికీ అప్రకటిత ప్రతిపక్షం.
బహుజన ఉద్యమాలకు, బహుజన సృజన కారులకూ నిత్య భరోసా. తరగని మేధో వనరు.
‘అసుర’గా పేరు గాంచిన ఈ అల్ప సంతోషి అధికార ఆస్థాన పీఠాలన్నింటికీ అప్రకటిత ప్రతిపక్షం.
ఈ తరం అసురను ఎమ్యులేట్ చేయాలి.
తన రచనల్నీ, ఉపన్యాసాల్నీ, కవిత్వాన్నీ పట్టుబట్టి పుస్తకాలు గా వేయాలి.తన జ్ఞానాన్ని పిండి భవిష్యత్తు టానిక్కులు గా రూపొందించుకోవాలి.
ఈ రోజు ఈ ప్రియమైన అన్న పుట్టినరోజు. ఈ సందర్భంగా అన్నకు శుభాకాంక్షలు తెలుపుదాం.
జి. లక్ష్మీ నరసయ్య ప్రసిద్ద సాహిత్య విమర్శకులు. ఇక సురేంద్ర రాజు గురించి చదివారు కదా. తన వస్తు శైలిలు, నిశితమైన వారి దృక్కోణం గురించి తెలియడానికి తెలుపు ప్రచురించిన వారి వ్యాసాలు కొన్ని చదువు….
మహాశ్వేతా దేవి : చాల పెద్దమ్మ!
ఒక ఆత్మ హత్య /ఒక హత్య/ ఒక సామూహిక ఖననం
One Hundred Years of Solitude – జామ పండు వాసన
సతత హరిత- కల్పన