Editorial

Wednesday, January 22, 2025
press noteప్రధాని క్షమాపణలు చెప్పాలి : ఫోరం ఫర్ తెలంగాణ' రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్

ప్రధాని క్షమాపణలు చెప్పాలి : ఫోరం ఫర్ తెలంగాణ’ రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్

ప్రధాని చేసిన వ్యాఖ్యలు అవివేకం, అనాలోచితం, అసంబద్ధం…తక్షణమే ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకుని తెలంగాణా సమాజానికి ప్రధాని క్షమాపణలు చెప్పాలని ఫోరం ఫర్ తెలంగాణా రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది.

దశాబ్దాల తెలంగాణ ఆకాంక్షలను, సుదీర్ఘ ఉద్యమ స్ఫూర్తిని కించపరుస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను ఫోరం ఫర్ తెలంగాణ రౌండ్ టేబుల్ సమావేశం ముక్తకంఠంతో ఖండించింది.

హైదరాబాద్ లకిడికపూల్ అశోక హోటల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని చేసిన వ్యాఖ్యలు అవివేకం, అనాలోచితం, అసంబద్ధం అని, వాటిని తక్షణమే ఉపసంహరించుకుంటూ తెలంగాణా సమాజానికి మోడీ క్షమాపణలు చెప్పాలని సమావేశం డిమాండ్ చేసింది.

ఫోరం ఫర్ తెలంగాణ ఉద్యమంలో స్వచ్చందంగా కృషి చేసిన పాత్రికేయుల బృందం. అనేక త్యాగాలతో ఏర్పాటైన రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు కవులు, కళాకారులు, మేధావులు, ఉద్యమకారులతో కలిసి పనిచేస్తుంది.

ఫోరం ఫర్ తెలంగాణ ఉద్యమంలో స్వచ్చందంగా కృషి చేసిన పాత్రికేయుల బృందం. అనేక త్యాగాలతో ఏర్పాటైన రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు కవులు, కళాకారులు, మేధావులు, ఉద్యమకారులతో కలిసి పనిచేస్తుంది. సకల జనుల ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ కార్యక్రమాలు తీసుకుంటుంది. నేటి ఈ తొలి సమావేశం అత్యంత కీలకమైన ప్రధాని వ్యాఖ్యలను సమిష్టిగా ఖండించేందుకు, వారి వ్యాఖ్యల వెనకాలి లోగుట్టును ప్రజలకు తేటతెల్లం చేయడానికి ఏర్పాటు చేసింది.

నేటి సమావేశానికి నాటి జాక్ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, జానపద పరిరక్షకులు ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు, న్యూడెమోక్రసీ కార్యదర్శి గోవర్ధన్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, టిఎన్జీవో ప్రధాన కార్యదర్శి ప్రతాప్, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్, కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత పసునూరి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

సీనియర్ సంపాదకులు కొండు బట్ల రామచంద్ర మూర్తి, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె శ్రీనివాస్, మాడభూషి శ్రీధర్ తెలంగాణ హిస్టరీ సొసైటీ నాయకులు సంగిశెట్టి శ్రీనివాస్ తదితరులు ఫోరమ్ ఫర్ ర్ తెలంగాణ రౌండ్ టేబుల్ సమావేశానికి సంఘీభావం తెలిపారు

ప్రధాని వ్యాఖ్యలు కొత్త రాష్ట్రంపై సరికొత్త కుట్రలకు తెరలేపే విధంగా ఉన్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ఏర్పాటును పరిరక్షించుకుంటూ, ఇటువంటి విచ్చిన్నకర వ్యాఖ్యలను, అనాలోచిత చర్యలను నిరసిస్తూ మరిన్ని సమావేశాలు నిర్వహించాలని ఫోరం నిర్ణయించింది.

ప్రధాని వ్యాఖ్యలు కొత్త రాష్ట్రంపై సరికొత్త కుట్రలకు తెరలేపే విధంగా ఉన్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ఏర్పాటును పరిరక్షించుకుంటూ, ఇటువంటి విచ్చిన్నకర వ్యాఖ్యలను, చర్యలను నిరసిస్తూ మరిన్ని సమావేశాలు నిర్వహించాలని ఫోరం నిర్ణయించింది.

ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి జి. బుచ్చన్న అధ్యక్షత వహించగా తెలుపు టీవీ ఎడిటర్-ఫోరం బాధ్యులు కందుకూరి రమేష్ బాబు వందన సమర్పణ చేశారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article