Editorial

Wednesday, January 22, 2025
బిజినెస్‌Forbes Richest People : ఏడుగురు భారత అపర కుబేరుల్లో ఐదుగురు వైశ్యులే! - మెరుగుమాల

Forbes Richest People : ఏడుగురు భారత అపర కుబేరుల్లో ఐదుగురు వైశ్యులే! – మెరుగుమాల

ఫోర్బ్స్‌ రియల్‌–టైమ్‌ టాప్‌ 100 బిలియనీర్లలో చేరిన ఏడుగురు భారత మాత బిడ్డల్లో ఐదుగురు వైశ్యులే కావడంలో విశేషమేమీ లేదు. ఇండియాలో ఇప్పటికీ వాణిజ్య, వ్యాపార రంగాల్లో బనియాలదే ఆధిపత్యం.

మెరుగుమాల నాంచారయ్య

2022 మే రెండు నాటికి ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్‌ మీడియా సంస్థ ఫోర్బ్స్‌ ప్రకటించిన రియల్‌–టైమ్‌ బిలియనీర్ల జాబితాలో భారత వ్యాపారులు ఏడుగురికి చోటు దక్కింది. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల ఫోర్బ్స్‌ 100 మంది జాబితా–2020లో నలుగురే ఉన్న భారతీయ వ్యాపార దిగ్గజాల సంఖ్య ఏడుకు పెరగడం గొప్ప విషయమే.

విశ్వవ్యాప్తంగా కొవిడ్‌–19 మహమ్మారి వ్యాపార కార్యకలాపాలను మందగతిన నడిచేలా చేసినాగాని– పదేళ్ల క్రితం దేశంలో పెద్దగా ఎవరికీ తెలియని పోర్టులు, ఎయిర్‌ పోర్టులు, కొత్త రకం ఇంథనాల వ్యాపారి గౌతమ్‌ అదాణీ–తాజా ఫోర్బ్స్‌ లిస్టులోని మొదటి పది మందిలో ఐదో స్థానంలో కనిపించడం నిజంగా పెద్ద వార్తే. అలాగే, చాలా మాసాలు ఆసియాలో, ఇండియాలో నంబర్‌ వన్‌ సంపన్నుడిగా వెలిగిన ముఖేశ్‌ అంబానీ ఏడో స్థానంలో ఉండడం కూడా గుజరాత్‌ ‘వ్యాపార పటిమ’కు అద్దం పడుతోంది.

ఇండియాలో ఇప్పటికీ వాణిజ్య, వ్యాపార రంగాల్లో బనియాలదే ఆధిపత్యం. వ్యవసాయం, ఇతర చేతి వృత్తుల రంగాల నుంచి వచ్చి బిజినెస్‌ లో రాణిస్తున్నవారి సంఖ్య 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో చెప్పుకోదగిన స్థాయిలో పెరగలేదు.

ప్రపంచ ‘రియల్‌ టైమ్‌’ అపర కుబేరుల నూరు మంది జాబితాలో తెలుగు వ్యాపారులెవరూ లేరు. దక్షిణాదికి చెందిన ఐటీ దిగ్గజం, ఎచ్‌ సీ ఎల్‌ గ్రూప్‌ అధినేత శివ్‌ నాడార్‌ ఒక్కరే ఈ వంద మంది అగ్రశ్రేణి సంపన్నుల్లో (54వ స్థానం) ఉన్నారు. కల్లుగీత కుల వృత్తిగా ఉన్న తమిళ నాడార్‌ (శానార్‌) కుటుంబంలో పుట్టిన శివ్‌ నాడార్‌ నేపథ్యం మాత్రం గొప్పది. ఆయన ధనిక ఫ్యామిలీకి చెందినవారు. ఆయన పూర్వీకులు భూములున్న పాలెగాళ్లు. నూరేళ్ల క్రితం అంటరానివారుగా తమిళ సమాజంలో ఎన్నో అవమానాలు అనుభవించిన నాడార్లలో అతి కొద్ది మంది పాలెగాళ్లు ఉన్నారట. ఫోర్బ్స్‌ రియల్‌–టైమ్‌ టాప్‌ 100 బిలియనీర్లలో చేరిన ఏడుగురు భారత మాత బిడ్డల్లో ఐదుగురు వైశ్యులే కావడంలో విశేషమేమీ లేదు. ఇండియాలో ఇప్పటికీ వాణిజ్య, వ్యాపార రంగాల్లో బనియాలదే ఆధిపత్యం. వ్యవసాయం, ఇతర చేతి వృత్తుల రంగాల నుంచి వచ్చి బిజినెస్‌ లో రాణిస్తున్నవారి సంఖ్య 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో చెప్పుకోదగిన స్థాయిలో పెరగలేదు. అందుకే, ఈ ఏడుగురిలో ఐదుగురు–గౌతమ్‌ అదాణీ (5), ముఖేశ్‌ అంబానీ (7), రాధాకిషన్‌ దమానీ (డీ–మార్ట్‌ అధిపతి–86 స్థానం), సావిత్రీ జిందల్‌ కుటుంబం (89), లక్ష్మీ నివాస్‌ మిత్తల్‌ (100) వైశ్యులే. అదాణీ ఒక్కరే మైనారిటీ జైన వైశ్యుడు. మిగిలిన నలుగురూ హిందూ బనియాలు. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే–వైశ్యుల్లో సూపర్‌ ఫైన్‌ క్వాలిటీగా కొందరు పరిగణించే అగ్రవాల్‌ సమాజానికి చెందిన వారు ఈ ఐదుగురిలో ముగ్గురు–దమానీ, జిందల్, మిత్తల్‌–ఉన్నారు.

మా చిన్నతనంలో కమ్యూనిస్టు పార్టీలు తరచు చెప్పే తాతాలు–బిర్లాలలోని టాటాల మతస్తుడైన (పార్సీ లేదా జొరాష్ట్రియన్‌) సైరస్‌ పూనావాలా ఈ భారత బిలియనీర్లలో ఒకరు కావడంలో విశేషం ఏమీ లేదు.

కొవిడ్‌–19 విజృంభించిన కాలంలో అదాణీ ఆస్తుల విలువ ఎన్నో రెట్టు పెంచుకోగలిగితే, ఈ మహమ్మారి నివారణ టీకా మందు ఉత్పత్తి చేసిన సైరస్‌ పూనావాలా మరీ అతి చిన్న మైనారిటీ మతానికి (పార్సీ) చెందనవాడు. ప్రపంచాన్ని కుదిపేసిన కరోనావైరస్‌ పుణ్యమా అని ఈ పూనావాలా (కొవిషీల్డ్‌ ఫేమ్‌) ఒక్కసారిగా తన సంపదను భారీగా పెంచుకోగలిగాడు.

ఈ వ్యాక్సిన్ల రంగంలోని ఏకైక తెలుగు వ్యాపారి ఎల్ల కృష్ణమూర్తి (కోవాక్సిన్‌) సంపద విలువ ఎన్ని రెట్లు పెరిగిందో తెలియదు. తెలుగు పాఠకుల కోసం తెలుగు రైతు కుటుంబంలో పుట్టిన రెండో వ్యక్తి పెట్టిన ‘ఈనాడు’ ఈ విషయం ఎప్పుడు వెల్లడిస్తుందో మరి. భారత్‌ బయోటిక్‌ అధినేత కృష్ణ ఎల్ల పేరు రియల్‌ టైమ్‌ టాప్‌–100 బిలియనీర్ల జాబితాలో చేరిన రోజు తెలుగోళ్లకు పండగే మరి. కృష్ణమూర్తి గారు పుట్టడానికి తొమ్మిదేళ్ల ముందు 1960లో తమిళనాడులో చేరిన తిరుత్తణి ప్రాంతంలో ఆయన సొంతూరు నెమలి ఉంది.

సీనియర్ పాత్రికేయులు మెరుగుమాల నాంచారయ్య నిశితమైన విశ్లేషకులుగా పాఠకులకు పరిచితులే. మనదేశ వాస్తవికత అయిన కులాన్ని, దాని విస్తృతిని వారు లోతుగా అధ్యయనం చేయడమే కాక అనేక శ్రేణుల్లో, పలు రంగాల్లో దాని అనివార్య ప్రభావాన్ని తన కథనాల ద్వారా వివరించడం వారి ప్రత్యేకత. ఇప్పటిదాకా ‘తెలుపు’ ప్రచురించిన ‘మెరుగుమాల’ ఇది…

‘కమ్మ శ్రేయోభిలాషి’ ఈ ‘తెలంగాణ పద్మనాయక వెలమ’
రేణుకా చౌదరికి ఏమైంది?
మండల్‌ మంటలు లేచే వరకూ అంబేడ్కర్‌ ఘనత తెలియని స్థితి!
ఆకార్‌ ను ఆపేసిన వైనం – మోదీ విరుద్ధ పోకడ

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article