చిక్కుల్లో పడ్డ ఎంకి పాట వింటారా?
విట్టుబాబు రాసిన ఈ గీతం ఒక ఆహ్లాదమైన జానపదం.
శీర్షిక ఏమిటీ అని మీరడిగితే చిక్కుల్లో పడ్డ ఎంకి పాట అనొచ్చు. ఇతివృత్తం ఏమిటా అంటే సున్నితమైన శృంగారానికి చిరునామా అనాలి.
“సిక్కోల్లో తగిలాడు, సిక్కుల్లో వెట్టాడు” అంటూ పెన్నా సౌమ్య గానం చేసిన ఈ పాట గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత అందం. అవును మరి. సిత్తరాంగి సిన్నోడి పాట ఇది. కుర్రదాని బుగ్గలు ఎరుపెక్కించే పాట కూడా ఇది. విని పరవశించవలసిందే. స్త్రీపురుషులేవరైనా తిరిగి నవయవ్వనులు కావలసిందే.
బాగుంది.