“ఏ ఊరు, ఏ దేశం పిల్లా నీది?” అని అతడంటే అంటే “కోవూరు, కొత్తపట్నం అయ్యా మాది” అంటూ ఆమె సరదాగా జవాబిస్తుంది.
ప్రశ్నా జవాబులతో ఒకరినొకరు ఉడికిస్తూ పాడుకునే ఈ యుగళగీతం సరస సంభాషణ మరుస్తున్న ఆధునికులకు ఒక ఉల్లాసం. ఒక ఉత్సాహం. మేలుకొలుపు.
యాంత్రిక జీవితంలో పడి, ఆటా పాటా మరిచి ఉలుకూ పలుకూ లేకుండా గడిపే దంపతులకు మరొక్క మారు తమ జానపద చిత్తాన్ని యాది చేసే ఆహ్లాద గీతం కూడా.
కవయిత్రి, బతుకమ్మ పాటల పరిశోధకురాలు శ్రీమతి బండారు సుజాతా శేఖర్ తెలుపు కోసం ప్రత్యేకంగా పాడి పంపించారు. వారికి ధన్యవాదాలు.