వరంగల్ శ్రీనివాస్. ఆ పేరెత్తితే సుదీర్ఘ కావ్యం ‘నూరేండ్ల నా ఊరు’ గుర్తొస్తుంది. కళ తప్పిన మన గ్రామాలన్నీ యాదికొస్తాయి. ‘ఓ యమ్మ నా పల్లె సీమా’ అని అయన పాడుతుంటే గొడగోడ దు:ఖం తన్నుకు వస్తుంది. అట్లే, తెలంగాణా ధూమ్ ధాం యాదికి వస్తుంది.
‘బొంతపురుగునైనా ముద్దాడుతా’ అని అప్పట్లో ఉద్యమనేత కేసీఆర్ అన్నది గుర్తుందా? ఇలా మన అధినేతకు భాషనూ, భావాన్ని, ఈటెను అందించిన తెలంగాణ కవి గాయకుల్లో తాను ముఖ్యులు.
కొన్ని వేల జానపద గీతాలు సేకరించిన వరంగల్ శ్రీనివాస్ మరికొన్ని వందల పాటల అపురూప సృజన జల. తన పాటలు, తన మాటల కంటే ముందు తెలుపు కోసం సరదాగా ఒక పాట పంపించమంటే దీన్ని రికార్డు చేసి పంపారు. త్వరలో వారిపై మంచి వ్యాసం చదువుతారు మీరు.