Editorial

Wednesday, January 22, 2025
శాసనంనేటి ఐదు శాసనాల వివరాలు - డా. దామరాజు సూర్య కుమార్

నేటి ఐదు శాసనాల వివరాలు – డా. దామరాజు సూర్య కుమార్

 

Epigraph

నేడు తారీఖు జూన్ 4

చింతపల్లి, గోపవరం, సంబటూరు, పొన్నతోట మరియు అమీనాబాద్ శాసనం వివరాలు నేటి శాసనంలో చదవండి.

1 క్రీ.శ 1304 జూన్ 4 నాటి చింతపల్లి (గుంటూరు జిల్లా) శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని పాలనలో పోచనాయనింగారు సూర్య గ్రహణ కాలంలో చింతపల్లి ముక్తేశ్వర దేవరకు పెద గార్లపాటి తోవకు పడమటి వైపు భూములనిచ్చినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా.X నెం. 493].

2.క్రీ.శ జూన్ 4 నాటి గోపవరం (కడప జిల్లా) శాసనంలో మహామండలేశ్వర జగతాపి కంచిరాజు రంగయ్య దేవమహారాజులు రామేశ్వర పొద్దుటూరులో వాగుమడుగు రామిరెడ్డి ప్రతిష్ట చేసిన హనుమంతుని నైవేద్యానికి భూములనిచ్చినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా. XVI నెం 105].

3.క్రీ.శ 1551 జూన్ 4 నాటి సంబటూరు [కడప జిల్లా] శాసనంలో తాళ్ళ పొద్దుటూరి చెన్నరాయని ఆలయ నిర్వాహకులకు శ్రీభాష్యం అగ్రహారీకులకు భూములు, ఇండ్ల స్థలాలు,తోటల విషయంలో వచ్చిన కలహాల్ని విచారించి వివాదాన్ని పరిష్కరించిన వివరాలున్నాయి. [కడప జిల్లా శాసనాలు II నెం 220].\

4. క్రీ.శ 1574 యిదే తారీఖున యివ్వబడిన పొన్నతోట (కడప జిల్లా) శాసనంలో దశబంధ ప్రస్తావన వున్నది. శాసనం శిధిలమైనందున యితర వివరాలు తెలియ రావడం లేదు. [కడప జిల్లా శాసనాలు II నెం. 220].

5. అట్లే అదేరోజున యివ్వబడిన అమీనాబాద్ (గుంటూరు జిల్లా)శాసనంలో ముళంగూరి దుర్గాదేవి అంగరంగ భోగాలకు గ్రామ ఆదాయంలో సగభాగాన్ని బొక్కసం నాగప్పనాయనింగారు యిచ్చినట్లుగా చెప్పబడ్డది [ద.భా.దే.శా. XVI నెం 285].

శీర్షిక నిర్వాహకుల పరిచయం

డా. దామరాజు సూర్య కుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article