నేడు తారీఖు జూన్ 29
క్రీ.శ 1517 జూన్ 29 నాటి మిడుతూరు (అనంతపురం జిల్లా) శాసనంలో శ్రీకృష్ణ దేవరాయల పాలనలో సాళువగోవిందయ్య ప్రథమేకాదశి పుణ్యతిథి నాడు మిడుతూరు గ్రామాన్ని బురుడాల విఘ్నేశ్వరునికి సమర్పించినట్లు చెప్పబడ్డది. [ద.భా.దే.శా.XVI నెం. 61].
అట్లే క్రీ.శ 1564 జూన్ 29 నాటి కొండవీడు (గుంటూరు జిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో కొండవీటి సీమలోని నందివెలుగు ప్రతినామమైన తిరుమలరాజపురపు అగ్రహారంలో కొండవీడు గోపీనాథదేవరకు చెందిన భూములను క్రితంలో రామరాజు తిరుమలయ్య ఆనతిని కృష్ణా పండితులకిచ్చిరి. దానిని అప్పాపండితులు అద్దంకి సీమలోని లేళ్ళపల్లి అగ్రహారంలోని భూములకు మారుగా యిచ్చునట్లు, అప్పాపండితుని స్థానంలో కృష్ణాపండితుని గోపీనాథ దేవర ఆలయ పూజారి (విపరి)గా నియమించినట్లు చెప్పబడ్డది. [ద.భా.దే.శా.IV నెం.698].
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.