నేడు సెప్టెంబర్ 14 వ తేదీ
క్రీ.శ 1253 సెప్టెంబర్ 14 నాటి త్రిపురాంతక శాసనంలో కాకతీయ గణపతిదేవుని గురువు గోళకీమఠ విశ్వేశ్వర శివదేశికులు శ్రీ త్రిపురాంతక దేవరకు అనేక భూములనిచ్చినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా X నెం 340].
అట్లే క్రీ.శ 1645 సెప్టెంబర్ 14 నాటి కొడిగేపల్లి (అనంతపురం జిల్లా) శాసనంలో శ్రీరంగరాజయ్య (III) రాజ్యం చేస్తుండగా ఓభళరాయ కోనేటి నాయనింగారు దిన్నెమీది కొడిగెపల్లికి ప్రతినామమైన పాలవెంకటాపురం గ్రామంలో పాల వెంకటేశ్వరస్వామి ఆలయ జీర్ణోధ్ధరణ చేసి ఉత్సవ మూర్తుల ప్రతిష్టాకాలమందు వివిధ కైంకర్యాలకు దానాలిచ్చినట్లు (వివరాలు నశించిపోయినవి) చెప్పబడ్డది. [ద.భా.దే.శా XVI నెం 332].
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా