నేడు జులై 14 వ తేదీ
తిథి ఆషాఢమాస శుద్ధ చవితి.
నేటి తేదీపైన తిథిపైన తెలుగు శాసనం లభించలేదు కానీ…
శక 1167 విశ్వావసు సంవత్సర ఆషాఢమాస శుక్ల పక్షంలో యివ్వబడిన సంతరావూరు (గుంటూరు జిల్లా) శాసనంలో కాకతీయ గణపతిదేవుని పాలనలో రామనాధదేవర అంగరంగ భోగాలకు కరణం మారయ రావూరి దగ్గుంబాటి పొలమున చేనును యిచ్చినట్లుగా చెప్పబడ్డది.[ద.భా.దే.శా X నెం 303].
అట్లే శక 1242 (1320 క్రీ.శ) రౌద్రి సంవత్సర ఆషాఢమాసంలో యివ్వబడిన అల్లూరు (ప్రకాశం జిల్లా) శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని కాలంలో బమ్మయనాయనింగారు అరలూరు ఇష్టకామేశ్వర దేవరకు వ్రిత్తి 400 గుంటలు అర్చన వ్రిత్తిగా 100 గుంటలు భూమినిచ్చినట్లుగా చెప్పబడ్డది. [నెల్లూరు జిల్లా శాసనాలు II ong 9].
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.