జనవరి 7వ తారీఖు
క్రీ.శ.1315 యిదే తారీఖున కాకతీయ ప్రతాపరుద్రుడు పాలన చేస్తున్నపుడు వారి అధికారులైన విళెము రుద్రదేవండు, అనుమకొండ అంనులెంక మణూరుదూబ సోమనాధ దేవర అంగరంగ భోగాలకు మణూరులో భూములు దానం చేసినట్లు మెదక్ జిల్లా మణూరు శాసనంలో చెప్పబడ్డది. దానం చెయ్యబడ్డ భూముల సరిహద్దులు వివరంగా చెప్పబడ్డాయి. ( కాకతీయ శాసనాలు.. నెం319)
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.