నేడు జూన్ 28
క్రీ.శ 1321 జూన్ 28 నాటి కుంకలగుంట (గుంటూరుజిల్లా) శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రునికి పుణ్యంగా మోటుపల్లి భాస్కరదేవుని మంత్రి మలయంకాగారు కుంకలగుంట మూలస్థానం కేదారదేవర అముదుపడికి భూములు, ధనము, గానుగను యిచ్చినట్లుగా చెప్పబడ్డది.[ద.భా.దే.శా.VI 592].
అట్లే క్రీ.శ 1539 జూన్28 నాటి కోసువారిపల్లె (చిత్తూరు జిల్లా) శాసనంలో అచ్యుతదేవరాయల పాలనలో కోసువారిపల్లె తిరువెంగళనాధుని దీపారాధన, నైవేద్య పూర్వకమైన పూజకు, అమృతపళ్ళకు శ్రీమన్మహానాయంకరాచార్య కంభం తింమనాయనింగారు గొడుగుబ్బ అనే గ్రామానికి గల సుంక సువర్ణాదాయాలను, నీరారంభ కాడారంభాలను త్రికరణ శుధ్ధిగా త్రివాచకంగా, ఏక భోగంగా యిచ్చినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా.XVI నెం 116
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.