నేడు తారీఖు జూలై 4.
క్రీ.శ 1544 జూలై 4 వ తారీఖు నాటి కొప్పోలు (కడప జిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో నారపరాజుగారి ఆనతిని విక్రమల్లమరాజు కృష్ణ రాయపురమని ప్రతినామమున్న కొప్పోలు అగ్రహారం, యితర గ్రామాలలో (పేర్లు నశించిపోయినవి) యిదివరలో సర్వమాన్యం చేసిన గ్రామకట్నం, సుంకస్థావరాలను తరువాత సుంకరులు ప్రభుత్వానికి తెలియకుండా వసూలుచేశారు, కనుక తిరిగి సర్వమాన్యము చేసినట్లుగా చెప్పబడ్డది. [కడప జిల్లా శాసనాలు II నెం 165].
అట్లే క్రీ.శ 1556 జూలై 4 నాటి గజరాంపల్లి (కడప జిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో రాయసం రామునికి చినవీరయ్య, జంజవీరయ్య, మున్నగువారు (పేర్లు నశించినవి)ఏకమై దానమేదో చేసినట్లు చెప్పబడ్డది. శాసన శిల శిధిలమైనందున యితర వివరాలు తెలియ రావడం లేదు. [ద.భా.దే.శా. XVI నెం 214].
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.