Editorial

Monday, December 23, 2024
శాసనంకంజీవరం, ఎర్రగుడి శాసనాలు

కంజీవరం, ఎర్రగుడి శాసనాలు

Epigraphఈ రోజు తేదీ జూన్ 8

క్రీ.శ 1249 జూన్ 8 నాటి కంజీవరం (తమిళనాడు) శాసనంలో కాకతీయుల వంశవృక్షము, గణపతిదేవుని ఘనవిజయాలు వర్ణించబడ్డాయి. సింఘణ వంటి రాజులను, కళింగ లాట గౌడ రాజులను ఓడించాడని చెప్పబడ్డది. గణపతిదేవుని సచివుడైనా సామంతభోజుడు ప్రాంతీయపాలకుడుగా కలత్తూరు గ్రామాన్ని ఏకామ్రనాథుని పూజాదికాలకు యిచ్చినట్లుగా చెప్పబడ్డది. [ఇండియన్ యాంటిక్వేరి XXI pp202 ff].

అట్లే 1541 జూన్ 8 న యివ్వబడిన ఎర్రగుడి (అనంతపూర్ జిల్లా)శాసనంలో అచ్యుతదేవరాయల పాలనలో బయ్యప్పనాయని అయ్యవారు బూడిదగుమ్మ సీమలోని యర్రగుడిలోని దేవాదాయ బ్రహ్మాదాయ వారికి యివ్వబడిన భూములు కొండమరుసయ్య కాలములో నడిచిన విధంగానే సర్వమాన్యంగా నడుచునట్లు కట్టడి చేసినట్లు చెప్పబడ్డది [ద.భా.దే.శా. XVI నెం. 124].

శీర్షిక నిర్వాహకుల పరిచయం

డా. దామరాజు సూర్య కుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article