నేడు సెప్టెంబర్ 9 వ తేదీ
క్రీ.శ 1293 సెప్టెంబర్ 9 వ తేదీనాటి గోరువంకలపల్లి రాగిరేకులలో కాకతీయ ప్రతాపరుద్రుని పాలనలో చెఱకు (ఇక్షు వంశం)రెడ్డి వంశస్థుడైన రాజరుద్రసేనాని గయాశ్రాద్దం నిర్వహించిన బ్రాహ్మణులకు గోరువంకలపల్లి గ్రామాన్ని ధారాపూర్వకంగా యిచ్చినట్లుగా చెప్పబడ్డది. [ఏ.పి.జి.ఎ.యస్ 6,pp 98ff].
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా