Editorial

Monday, December 23, 2024
శాసనందేవుని కడప, పెదచెరుకూరు శాసనాలు

దేవుని కడప, పెదచెరుకూరు శాసనాలు

 

Epigraph

నేడు జూన్ 14 వ తారీఖు

క్రీ.శ 1551 జూన్ 14 సదాశివరాయల నాటి దేవుని కడప శాసనంలో మహామండలేశ్వర నందేల అవుభళ దేవమహారాజు సూరప అవుభళేశ్వరంగారికి తిరుమల త్రోవలో కడప పొలిమేరను కోతులకుంట లోయలో చలివేంద్రము పెట్టించేందుకు, చలివేంద్రానికి నీళ్ళు తెచ్చే చవుడబోయని బొప్పినకు, మద్దల తిప్పనకు సర్వమాన్యంగా భూములనిచ్చినట్లుగా చెప్పబడ్డది. [కడప జిల్లా శాసనాలు II నెం 221].

అట్లే క్రీ.శ జూన్ 14 నాటి పెదచెరుకూరు (గుంటూరుజిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో మహామండలేశ్వర సిద్దిరాజు అవుబళరాజు పౌత్రుడు, తిమ్మరాజు కుమారుడైన వెంకటరాజయ్య దేవమహారాజుగారు చెరుకూరుగ్రామమందు అంగడి వీరభద్రునికి, విశ్వనాథునికి దానములిచ్చినట్లు చెప్పబడ్డది. శాసనం భూమిలో కూరుకుపోయినందున యితర వివరాలు తెలియ రావడంలేదు.[ద.భా.దే.శా.VI నెం 203].

శీర్షిక నిర్వాహకుల పరిచయం

డా. దామరాజు సూర్య కుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article