నేడు తేదీ జూన్ 20
తిథి జేష్ఠ శుద్ధ దశమి. నేటి తారీఖుపై నాకు ఎలాంటి తెలుగు శాసనం లభించలేదు కానీ..శక సంవత్సరం 1190 (క్రీ.శ 1268) విభవనామ సంవత్సర జేష్ఠ శుద్ధ దశమి నాటి బూరుగుగడ్డ (నల్లగొండ జిల్లా) శాసనంలో కాకతీయ రుద్రమ దేవి పాలనలో ప్రధాని దేవకీపుత్రదాసు బూరుగుగడ్డలో ఉభయపిరాట్ల సహిత చెన్నగోపీనాథుని ప్రతిష్ట చేసి అంగరంగ భోగాలకు భూములనిచ్చినట్లుగాను, ప్రధాని సత్రము బొల్లమరాజు “మాచివురము” గ్రామాన్ని నిర్మించి చెన్న గోపీనాథునికిచ్చినట్లుగా చెప్పబడ్డది. [హెచ్.ఎ.యస్. 13 నెం 18]
అట్లే శక సంవత్సరం 1232 (క్రీ.శ 1310)సాధారణ సంవత్సర జేష్ఠ శుద్ధ దశమి నాటి కొచ్చెర్లకోట (ప్రకాశంజిల్లా) శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని పాలనలో దేవరి నాయకుడు కొచ్చెర్లకోట,మాచర్ల లలో గౌరీశ్వర సోమేశ్వర మహదేవరలకు త్రికూటములు నిర్మించి,అనేక భూములనిచ్చినట్లు,దాలం వరదన్న తమ్మళ్ళ పెద్దిలను పూజారులుగా నియమించినట్లు చెప్పబడ్డది. [నెల్లూరు జిల్లా శాసనాలు I Darsi 35]
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్య కుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.