నేడు జులై 17 వ తారీఖు
క్రీ.శ 1573 జులై 17 నాటి చిత్రచేడు (అనంతపురం జిల్లా) శాసనంలో శ్రీ రంగరాయల పాలనలో గంగాజెటిగారు తమ అమర మాగాణీ అయిన గుత్తిసీమలోని చిత్రచెడి మలకతాళ దేవబ్రాహ్మణ మాన్యాలు నిరాదరణగా వుండగా రఘునాథదేవుని సన్నిథిలో తమతండ్రి నింమాజెట్టికి పుణ్యంగా ఉత్తానద్వాదశి పుణ్యకాలాన తిరిగి సర్వమాన్యంగా దేవబ్రాహ్మణులకు ఎలాంటి ఆటంకం లేకుండా, కొటారులకు చేరకుండా యిచ్చినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా XVI నెం 284]
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.