నేడు ఆగస్ట్ 29 వ తేదీ
క్రీ.శ. 1535 ఆగస్ట్ 29 నాటి పులివెందుల (కడప జిల్లా) శాసనంలో అచ్యుతదేవరాయల పాలనలో తింమరాజు సలకయ్య దేవమహారాజుల కార్యకర్తలైన తులువ యల్లప్పనాయనింగారు పులివెందిల సీమలోనున్న సెట్టి పట్ణస్వామి రెడ్డి కరణాలు అష్టాదశ ప్రజలు మున్నగువారిపై ఎలాంటి కొత్త పన్ను విధించరని, పూర్వపు పన్నునే కొనసాగిస్తారని, పన్నులుకట్టలేక వూరు విడిచిపోయినవారు తిరిగి రావచ్చని అపరాధం పన్ను పన్నెండు రూకలే చెల్లించవలెనని చెప్పబడ్డది. [ద.భా.దే.శా XVI నెం 110].
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.