నేడు తారీఖు జులై 20
క్రీ.శ 1583 జులై 20 వ తేదీ నాటి పొదిలె (ప్రకాశం జిల్లా) శాసనంలో వెలుగోటి కుమార చిన తింమ్మానాయనింగారు తమ తల్లిదండ్రులకు పుణ్యంగా పొదిలె స్థళం దేవబ్రాహ్మణులకు, అగ్రహారాలకు, పొదిలె సీమలోని గ్రామాల దేవబ్రాహ్మణ భటవిర్తి మాన్యాలకు బేడిగ శుంకమునుండి మినహాయింపు యిచ్చినట్లు, వారిమాన్యాలపై యెప్పటివలెనే వ్యవసాయం చేసుకోవచ్చని చెప్పబడ్డది. [నెల్లూరు జిల్లా శాసనాలు III podili 34]
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.