నేడు జులై 23 వ తేదీ
క్రీ.శ 1621 జులై 23 నాటి పెళ్ళూరు (ఆత్మకూరు తాలూకా, నెల్లూరు జిల్లా) శాసనంలో వీరవెంకటపతి రాయలు పాలిస్తుండగా వెలిగోటి కొమారతిమ్మానాయనింగారికి యిచ్చిన రాజ్యంలో నెల్లూరు సీమలోని పెళ్ళూరు గ్రామాన్ని వెంకటపతినాయనింగారు చింతగుంప్పల్లి బసప్పనాయనింగారికి అమరానికి యిచ్చారు గావున వెలిపొలాన పండిన పంటలో మూడుపాళ్ళు రైతుకు ఒకపాలు పాలకులకు (నగరికి), చెరువులకింద పండిన పంటలో రెండు పాళ్ళు రైతులకు ఒకపాలు నగరికి యిచ్చునట్లుగా చెప్పబడ్డది.[నెల్లూరు జిల్లా శాసనాలు I Atmakur 48].
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.