Editorial

Monday, December 23, 2024
శాసనంఆళ్వారుల,శ్రీవైష్ణవుల ఆరగింపుకు శాసనం

ఆళ్వారుల,శ్రీవైష్ణవుల ఆరగింపుకు శాసనం

Epigraphనేడు తారీఖు జులై 1

1.క్రీ.శ 1299 జులై 1 నాటి ఈదుమూడి (ప్రకాశంజిల్లా) శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని ప్రధాని పుతావరి కామబొప్పనింగారు తమ తండ్రి దేవగారికిన్ని, తల్లి వున్నవలక్ష్మికిన్ని పుణ్యంగా కందమూడి రామాజోస్యులకు దానమిచ్చినట్లు చెప్పబడ్డది. శాసన శిల శిధిలమైనందున యితర దాన వివరాలు తెలియరావడం లేదు. [నెల్లూరు జిల్లా శాసనాలు II ong 49].

అట్లే క్రీ.శ 1322 జులై 1 నాటి మోటుపల్లి శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని కాలంలో ధర్మరామిసెట్టి ప్రతిష్ట చేసిన శ్రీగోపీనాథునికి గొల్ల చూరయ పెట్టిన దీపము ఒక్కటికి 20 గొర్రెలకు ప్రతి సంవత్సరము ఒక మాడ చొప్పున పెట్టునట్లుగా చెప్పబడ్డది.[ద.భా.దే.శా. X నెం 532].

అట్లే క్రీ.శ 1555 జులై 1 నాటి పోరుమామిళ్ళ (కడప జిల్లా)శాసనంలో సదాశివరాయల కాలంలో పోరుమామిళ్ళ ప్రతినామమైన గోపీనాథపట్నంలో 12 మంది ఆళ్వారుల,శ్రీవైష్ణవుల ఆరగింపుకు శ్రీమన్మహామండలేశ్వర వరదరాజయ్య దేవ మహారాజులు నారాయణజియ్యకు వరి మడులు, తోటలు సమర్పించినట్లుగా చెప్పబడ్డది. [కడప జిల్లా శాసనాలు II నెం 243].

శీర్షిక నిర్వాహకుల పరిచయం

shasanam surya prakashడా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article