నేడు తారీఖు జూన్ 6
క్రీ.శ 1533 జూన్ 6 వ తారీఖు నాటి అచ్యుత దేవరాయలనాటి చిన్నదాసరిపల్లె (కడప జిల్లా) శాసనంలో రాజుగారి కార్యకర్తలైన బారుసయ్యగారు తాళ్ళపాక తిమ్మరుసయ్య ఆనతిని గండికోట సీమలోని వొంగును (నూ)తుల అహోబలేశ్వరులకు వొంగునుతుల దుర్గదణాయాలు మగ్గస్తావరాల సుంకాలను ధారవోసినట్లుగా చెప్పబడ్డది.[కడప జిల్లా శాసనాలు II నెం.116].
అట్లే 1556 జూన్ 6 నాటి పెనుగొండ శాసనంలో మహామండలేశ్వర రామరాజు కోనప్పయ్య దేవ మహారాజులయ్యవారు పెనుగొండ లక్షీనరశింహ దేవుని నందాదీపానికి స్థలసుంకము 4 రూకలు 4 తారాలు (?) యిచ్చినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా.VII నెం 573].
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్య కుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.