నేడు ఆగస్ట్ 31 వ తారీఖు
క్రీ.శ 1543 ఆగస్ట్ 31 నాటి అనిమెల (కడప జిల్లా)శాసనంలో సదాశివరాయల పాలనలో శ్రీమన్మహామండలేశ్వర గురవయ దేవచోడ మహారాజులు అనిమెల సంగమేశ్వర దేవుని అంగరంగ వైభవాలకు, నిత్య నైమిత్తికాలకు తమ దేవేరులైన ఔభళమ్మ అఇతమ్మల సమేతంగా పెదసింగరాజు, పినసింగరాజు, తమ్మరాజు, రుద్రరాజు, బస్వరాజు, పెదచిటిరాజు, చినచిటిరాజు, పొట్టి సంగరాజు, పాపసంగరాజు మున్నగు తొమ్మిదిమంది పుతృలసమేతంగా ఘండికోట సీమలోని అనిమెల గ్రామాన్ని, పెదకంటి సీమలోని పాలెం గ్రామాన్ని, కుడవునల సీమలోని వేంపల్లి, నందిమంగళం గ్రామాన్ని మొత్తం నాలుగు గ్రామాలను రెండు తామ్రశాసనాల ద్వారా యిచ్చినట్లు, వీటిని సదాశివరాయల నుండి పొందినట్లు చెప్పబడ్డది.[కడప జిల్లా శాసనాలు II నెం 158].
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా