నేడు జూలై 22 వ తేదీ
క్రీ.శ.1319 జూలై 22 నాటి ఆలుగడప (నల్లగొండ జిల్లా) శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని సర్వాధికారి హెంమాడి దేవనాయనింగారు ఆలుగడప అష్టాదశ ప్రజలున్ను రాచచేలు వెలిపొలము, నీరునేలల పహిండి సుంకము మున్నగు అన్నిసుంకాలలో మాడకు మాడబడిని పాతిక లెక్కన ఆ ఊరి తూర్పునగల త్రిపురాంతక దేవర రంగ భోగానికిచ్చినట్టు, అట్లే పరశురామదేవమహారాజులు 5 మాడలిచ్చినట్లుగాను చెప్పబడ్డది.
శాసన శిల మరొక వైపుగల మరొక శాసనంలో శ్రీమత్ప్రౌఢ ప్రతాపచక్రవర్తి పరశురామ దేవమహారాజులు (? )ప్రోలేశ్వర దేవరకు భూములను సర్వమాన్యముగా యిచ్చినట్లు చెప్పబడ్డది. [నల్లగొండ జిల్లా శాసనాలు I నెం 101].
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.