తారీఖు మే 25
క్రీ.శ 1267 మే 25 తేదీ నాటి పానగల్లు (నల్లగొండ జిల్లా)శాసనంలో కాకతీయ రుద్రమదేవి పాలనలో పానగల్లు పాలకుడైన యాదవ సారంగపాణి దేవ మహారాజు ఛాయా సోమనాథ దేవర అంగరంగ భోగాలకు తంమ్మ సముద్రము (?)వెనక ఆరు మర్తురుల భూమిని, ఒదయాదిత్య సముద్రము వెనక ఆరు మర్తురుల నీరునేలను ధారాపూర్వకంగా యిచ్చినట్లు చెప్పబడ్డది.[హెచ్.ఎ.యస్.13 నెం.34]