నేడు ఆగస్ట్ 17 వ తారీఖు
క్రీ.శ 1072 ఆగస్ట్ 17 నాటి సంగుపల్లి (గజ్వేల్ తాలూకా, ఉమ్మడి మెదక్ జిల్లా) శాసనంలో చాళుక్య భువనైకమల్ల పాలనాకాలంలో గజవెల్లి (గజ్వేల్) అగ్రహార తటాకాన్ని, గొరగవ్రప్పి అనే లఘు తటాక మరమ్మత్తులను ప్రముఖులు చేయించినట్లు చెప్పబడ్డది. [మెదక్ జిల్లా శాసనాలు నెం. 51].
అట్లే క్రీ.శ 1557 ఆగస్ట్ 17 నాటి వంగీపురం (గుంటూరు జిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో శ్రీమన్మహామండలేశ్వర రామరాజు యరతిరుమల రాజయ్య దేవమహారాజులుంగారు తమకు నాయంకరముగా యిచ్చిన కొండవీటి శీమలోని వంగీపురం గ్రామంలో శ్రీవల్లభరాయని ముఖమండపము, శ్రీశైల తూర్పుద్వారాన్ని మహామండలేశ్వర అప్రతిమల్ల కురుచేటి మూర్తిరాజయ్యదేవచోడ మహారాజులు నిర్మించినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా XVI నెం 223].
అట్లే క్రీ.శ 1592 ఆగస్ట్ 17 నాటి శ్రీ ముష్ణం (తమిళనాడు) శాసనంలో వెంకటపతిరాయల పాలనలో శ్రీముష్ణం ఆదివరాహ పెరుమాళ్ళకు శ్రీభండారం వారి తరఫున కొండమనాయనింగారు అవసరం కోనప్పకిచ్చిన పల్లికొండా పట్నంలోని కురుచిపత్తులోని చిలంబూరుగ్రామాన్ని యిచ్చినట్లుగా చెప్పబడ్డది.
శీర్షిక నిర్వాహకుల పరిచయం
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.