నేడు ఆగస్ట్ 6 వ తేదీ
క్రీ.శ 1501 ఆగస్ట్ 6 నాటి మేడిదిన్నె (కడప జిల్లా) శాసనంలో బసవనాయకంగారు, నరసనాయకంగారు తమ తల్లిదండ్రులకు పుణ్యంగా మేడుగదిన్నె గ్రామాన హనుమంతుని కోయిల (కోవెల) ఖిలమైవుండగా, అందు సున్నపుపని చేసి, దేవరలను పునఃప్రతిష్ట చేసి,ఆ తర్వాత ఆలయ నిర్వహణకు పందూము చేను పెట్టినట్లుగా చెప్పబడ్డది. [కడప జిల్లా శాసనాలు II.నెం 60].
అట్లే క్రీ.శ 1563 ఆగస్ట్ 6 నాటి చిన్న అహోబిల (కర్నూలు జిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో మహామండలేశ్వర కోనేటి ఓబుళరాజయ్యగారు శ్రీ అహోబలేశ్వరుల ఆరగింపులకు అముదుపడికి వివిధ గ్రామక్షేత్రాలపై వచ్చే 308 వరహాలను యిచ్చినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా.XVI నెం 260].
శీర్షిక నిర్వాహకుల పరిచయం
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.