Editorial

Wednesday, January 22, 2025
సాహిత్యంసమ్మెట ఉమాదేవి పుస్తకం : పల్లెఒడి పల్లెబడి - ఏనుగు నరసింహారెడ్డి

సమ్మెట ఉమాదేవి పుస్తకం : పల్లెఒడి పల్లెబడి – ఏనుగు నరసింహారెడ్డి

సమ్మెట ఉమాదేవి గారి పుస్తకానికి ఏనుగు నరసింహారెడ్డి గారు చక్కటి ముందు మాట రాశారు. ఆ ముందుమాట పిల్లల పట్ల ఉపాధ్యాయురాలైన రచయిత్రికి ఉన్న అనుబంధాన్నీ అత్మీయతనే కాదు, పుస్తకంలో పేర్కొన్న అంశాల విశిష్టతని, తల్లి ఒడి వంటి బడిలో పిల్లల మూర్తిమత్వం, వారి నేపథ్యం తండాల్లో నిష్కల్మష ఆదివాసీ హృదయం, వేదనా అన్నిటినీ చక్కగా వివరిస్తుంది. అంతేకాదు, వారు అన్నట్టు, “ఈ గ్రంధం చదివితే, పిల్లల అంతరంగిక లోకాన్ని ఇంత శ్రద్ధగా పట్టించుకున్న ఈ రచయిత్రిమీద మనకు అపారమైన గౌరవం కలుగుతుంది”

చిన్ని నడకల పడవలే పిల్లలు
చిట్టి మాటల వరదలే పిల్లలు
ఇళ్ళు ఒక ద్వీపం వాళ్ళు ఒక దీపం
రంగు రంగుల మల్లెలే పిల్లలు

మహాత్ముడికి మూడు కలలుండేవి. ఒకటి : భారతదేశానికి స్వాతంత్ర్యం, రెండు: గ్రామ స్వరాజ్యం, మూడు : సంపూర్ణ మద్య నిషేధం. ఇప్పుడు మహాత్ముడు లేడు. ఆయన కలలు మాత్రం మనకు గుర్తున్నాయి. దేశ స్వాతంత్య్రం గురించి, సంపూర్ణ మద్య నిషేధం గురించి మాట్లాడుకోవడానికి సాహసమే కావాలి. ఇక ఆయన రెండవ స్వప్నం గ్రామ స్వరాజ్యం గురించి మాట్లాడక తప్పదు ఇప్పుడు. డెబ్భై అయిదేళ్ళయినా అది సిద్ధించిందా అనేది చాలా పెద్ద ప్రశ్న. అసలు గ్రామం అనే యూనిట్ మీద మనకున్న నిర్వచనమే ఒక పెద్ద అగాధాన్ని సృష్టిస్తుంది. వెయ్యో, అయిదు వందలో ఇండ్లుండి; నాలుగు వేలో, రెండు వేలో జనాభా ఉండి; సబ్బండ వర్ణాల సమాహారం, పెద్దరికంతో కూడిన ఒక కూటమి ఉంటే తప్ప మనకు ఊరు కాదు.

బడిగంట పిల్లలకే కాదు, ఊరి వాళ్ళందరికీ ఏదో బోధిస్తుందట. ‘గుడి గంటలు కాదు, మనకు బడి గంటలు మ్రోగాలి’ అన్న సావిత్రీబాయి పూలే మాటల సారాన్ని ఆరంభ వాక్యాలుగా తీసుకొని ఉమాదేవి గారు ‘మా పిల్లల ముచ్చట్లు’ రాసారు.

సమ్మెట ఉమాదేవి గారు అసలు సిసలైన ఊళ్ళు ఎలా ఉన్నాయో టార్చిలైటు పట్టి చూపిస్తే గాని మనకు అర్థం కాదు. మరి అవన్నీ తాండాలు, గూడేలు కదా అని అనుకోవచ్చు మనం. పొద్దున్నే కల్మషం లేని హృదయాలతో, కాలుష్యం లేని ఆవరణంతో సూర్యున్ని ఆహ్వానించే తాండాలు; నలుగురు చెప్పింది నమ్మి నడిచే దారులలో, పంచాయితీలు, మండలాలు పట్టని సహజ లక్ష్యాలతో ప్రకృతిలో జీవించే గూడేలు ఊర్లు మాత్రమే కాదు, మైదానాలకు శ్రమను కనిపించకుండా ధారవోసే పుణ్యస్థలాలు. సామాజిక విస్తరణ పథకాలొచ్చీ, స్వచ్చంద సంస్థల వితరణలొచ్చీ ఈ ఊరుగాని ఊర్లను మార్చిందెంత? కమిటీలు, పంచాయితీలు, బ్లాకులు, మండలాలు, పరిషత్తులు చేసిన వికాసమెంత, ఏ ప్రాంతాలకు ఎంతెంత?

నిన్నా మొన్నటి వరకు (ఇప్పుడు మాత్రం లేదని కాదు) రిజర్వేషన్ల ఫలాలను కూడా అగ్ర వర్ణాలు హైజాక్ చేసాయి. వెరసి తాండాలు తాండాలుగా, గూడేలు గూడేలుగా, ఐటిడియేలు ఐటిడియేలుగా ఉండిపోయాయి. ‘మా పిల్లల ముచ్చట్లు’లో ఉమాదేవి గారు ఇదంతా చెప్పారు.

వికాసం జరిగిందనడానికి పెరిగిన పర్ క్యాపిటా ఇంకం ఉంటుంది, స్థానిక వృద్ధికోసం సంస్థలుంటాయి, ఎన్నికలుంటాయి, పదవులుంటాయి, పంపకాలూ ఉంటాయి. ఎవరెవరి మధ్య ఎంతెంత ఉంటాయన్నది తెలిస్తే నివ్వెరపోవలసిన విషయాలే ఎక్కువ. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ విజయవంతం కావడం కోసం స్వాతంత్ర్యపు తొలిరోజుల్లో వేసిన బలవంతరాయ్ మెహతా చేసిన సిఫారసుల ప్రకారం ఏర్పాటైన గ్రామ పంచాయితీలకు, బ్లాకులకు పెత్తందార్లే ఎన్నుకోబడ్డారు. అజ్ఞానం తాండవించిన రోజుల్లో పరిఢవిల్లిన రోజుల్లో కొనసాగిన పెత్తందారీ వ్యవస్థ స్థానిక సంస్థల్లో సర్దుకుంది. కొన్ని చిన్న చిన్న గ్రామాల సముదాయంగా ఒక పంచాయితీ ఏర్పడితే కులపరంగా, ఆర్థికంగా ఉన్నవారే సర్పంచులయ్యారు. తొలినాడు ఎంపికైన సర్పంచుల్లో సింహభాగం మంది ఇరవై ఏండ్లు పైగానే పాలించారు. ఇక అట్టడుగు వర్గం వాడి దగ్గరకు వికాసం ఎలా, ఎందుకు చేరుతుంది? సమితి ప్రెసిడెంట్లు ఎమ్మెల్యేలకు సమానమైన ధనిక వర్గం. అందువల్ల కొద్దోగొప్పో అదృష్టం కొద్దీ అభివృద్ధి జరిగినా అది వికాస జీవుల ప్రాంతాలకు పరిమితమయింది. నిన్నా మొన్నటి వరకు (ఇప్పుడు మాత్రం లేదని కాదు) రిజర్వేషన్ల ఫలాలను కూడా అగ్ర వర్ణాలు హైజాక్ చేసాయి. వెరసి తాండాలు తాండాలుగా, గూడేలు గూడేలుగా, ఐటిడియేలు ఐటిడియేలుగా ఉండిపోయాయి. ‘మా పిల్లల ముచ్చట్లు’లో ఉమాదేవి గారు ఇదంతా చెప్పారు. ఆమె రాసిన ఒక టీచర్ అనుభవాలులో మనకు కనిపించేది ఇదే. అది వాచ్యంగా కనిపించదు. వేరే విషయం రాసినట్లుగా, ఆహ్లాదం చిత్రించినట్లుగా అనిపిస్తుంది. అక్కడే రచయిత్రి విజయం దాగుంది. రచయిత ఒకటి రాస్తే మనకు అనేకం కనిపించడం గొప్ప రచనకు ఉండే లక్షణం.

‘మా పిల్లల ముచ్చట్లు- ఒక టీచర్ అనుభవాలు. రచన – సమ్మెట ఉమాదేవి. ప్రచురణ – శాంతా వసంతా ట్రస్ట్, హైదరాబాద్. పేజీల సంఖ్య 258. వేల -అమూల్యం. పుస్తకం కోసం సంప్రదించండి. రచయిత్రి, కేరాఫ్ శ్రీ బి.డి.కృష్ణ, ఇంటి నంబర్. 3-2-353. సెకండ్ ఫ్లోర్, స్వామి వివేకానంద స్ట్రీట్, ఆర్. పి. రోడ్, సికింద్రాబాద్ – 500003. మొబైల్ : 9849406722

‘బడి గంటలు మ్రోగాయి విన్నారా
వాటి భావాలను మీరు తెలుసుకున్నారా’
అని ఒక అజ్ఞాత కవి పిల్లల్ని ప్రశ్నించాడు. జీవన యానపు తొలి అడుగు బడినుండే కాబట్టి ‘జీవన యానానికి సంకేతంగా రైలుపట్టా ముక్కను గంటగా పెడతారట. బడిగంట పిల్లలకే కాదు, ఊరి వాళ్ళందరికీ ఏదో బోధిస్తుందట. ‘గుడి గంటలు కాదు, మనకు బడి గంటలు మ్రోగాలి’ అన్న సావిత్రీబాయి పూలే మాటల సారాన్ని ఆరంభ వాక్యాలుగా తీసుకొని ఉమాదేవి గారు ‘మా పిల్లల ముచ్చట్లు’ రాసారు. ఇవి ఉమాదేవి గారు రాయనైతే రాసారు కాని సున్నితమైన మనసూ, సామాజిక చలనశీలత ఉన్న ప్రతి టీచర్ వ్యక్తం చేయాల్సిన అభిప్రాయాలే.

జమ్మిపూలు, రేలపూలు కథా సంపుటాల ద్వారా లబ్దప్రతిష్టులైన రచయిత్రి ఉమాదేవి గారు. ఉమాదేవి కథానికలు ఆమె ఆర్ద్ర హృదయానికి ఒక సరళ వ్యక్తీకరణ. తన కథల్లో అనివార్యంగా ఒక స్త్రీతత్త్వం, ఆదివాసీ జీవితం తొంగిచూస్తుంది. ప్రత్యేకించి గిరిజన బాలికల మానసిక చిత్రీకరణ ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి involved రచయిత్రి రాసిన అనుభవాల గ్రంథం ఎంత హృద్యంగా, సరళంగా ఉండొచ్చో అంతగా విరిసిన పూవులా ఉంది ‘మా పిల్లల ముచ్చట్లు’.

తను రిటైరయ్యాక ఈ పిల్లలలోకం, ఈ చల్లని కలుషితం కాని ప్రకృతి తనకు దూరమవుతాయేమోననే కనిపించని ఆతృత ఒకటి ఈ రచయిత్రిలో ఉందనిపిస్తుంది. అందుకే కొన్ని వందల సందర్భాల ఫోటోలను ఒడిసిపట్టి ఈ పుస్తకంలో నిక్షిప్తం చేసారు.

బడిగంట నుండి ఉద్యోగ విరమణ అనంతరయానం అనే 218 అధ్యాయాలుగా నడిచిన రచయిత్రి అనుభవాలు ఆద్యంతం ఆసక్తిదాయకంగా, చాలా సంక్షిప్తితో ఉంటాయి. ఒక పేజీ మొదలుపెట్టిన వెంటనే అయిపోయి ఆశ్చర్యం గొలుపుతుంది. మనం మొదలుపెడితే అదే చదివిస్తుంది. అందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి వస్తువు, రెండోది భాష. ‘ఒక పసి కుసుమం’ అనే 10వ భాగంలో ఆంకర్ అవతారమెత్తిన టీచర్
‘నువ్వు ఎక్కడ ఉంటావమ్మా..?’ అని అడుగుతుంది. దానికి వైష్ణవి
‘మా ఇంట్లో..’ అంటుంది
‘ఏమి చదువుతున్నావు..?
‘బొక్కులు’

పిల్లల భాషను, అలవాట్లను, ఆలోచనలను ఈ రచయిత్రి ఎంతగా ప్రేమించారో మనం అడుగడుగునా గమనించవచ్చు.

ఒక తండ్రిలేని పాపను స్వచ్చంద సంస్థ కోసం పరిచయం చేయడం ఈ భాగంలోని వస్తువు. ఇదంతా 17 లైన్ల అధ్యాయం. అక్షరాలూ కూడబలుక్కొని చదివే పిల్లలు కూడా చదవగలిగినంత సరళ, వ్యవహార, మాండలిక భాష. తమ్ముడు పుడుతున్నప్పుడు తల్లి శారీరక మానసిక స్థితికి ద్రవించిన వ్యధ ‘ఐశ్వర్య అనే ఓ అక్క కథ’. ఇది కొంచెం పెద్దసైజు కథ అయినా ఇట్టే అక్షరాల వెంట పరుగెడతాం. పిల్లల అంతరంగిక లోకాన్ని ఇంత శ్రద్ధగా పట్టించుకున్న ఈ రచయిత్రిమీద మనకు అపారమైన గౌరవం కలుగుతుంది. తాబేలుతో మా చిన్ని తారలు, మనం ఎప్పుడు వెటకారమాడే చెట్లకింది చదువును ఈ రచయిత్రి ప్రేమించిన వైనం, సత్యపూజిత పేరు సత్తె పూజితగానే పలకడం, తాండాలో ఉన్న ఒక సంగీత శ్యామశాస్త్రి, పల్లెకు బస్ వారధ్యం, అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళకు అమ్మలయ్యే అద్భుత తరుణం, పల్లె పిల్లలకు బూట్లు తెచ్చిన ఇక్కట్లు, పిల్లల లోదుస్తుల దైన్యాలు, రిబ్బను పువ్వుల సౌందర్యం పాఠకులను కట్టిపడేస్తాయి. పిల్లల భాషను, అలవాట్లను, ఆలోచనలను ఈ రచయిత్రి ఎంతగా ప్రేమించారో మనం అడుగడుగునా గమనించవచ్చు.

ఈ అధ్యాయాలలోని పిల్లల చర్యలు చాలాచోట్ల కొడవటిగంటి కుటుంబరావు ‘చదువు’ నవలను జ్ఞాపకం చేస్తుంటాయి. నీకు అక్షరాలు ఎంతవరకు వచ్చు అంటే ‘పలకనిండా నిండా వచ్చు’ అని ఒకే అక్షరాన్ని పలకనిండా రాసి చూపించిన పిల్లవాన్ని కొ.కు. ఊరికే చిత్రించలేదని ఉమాదేవి రచన ద్వారా తెలిసివస్తుంది.

‘సార్ నీకు రమ్మన్నడు’, ‘నువ్వు నాకు హాజర్ పెట్టలేదు’, ‘టీచర్.. ఇంకా బెల్ పడలేదు’ లాంటి మనోహరమైన వ్యాకరణ దోషాలు రికార్డు చేసి నవ్వించారు. విద్యాకమిటీలలో ఆధిపత్యాలు, పల్లెల్లో ఎన్నికలు, స్థానిక పర్వదినాలు, పిల్లల ఆటలు పాటలు, కళా ప్రదర్శనలు, చిన్న వయసు పెద్దరికాలు, జీవితపు భారాన్ని బాల్యంనుండే మోస్తున్న ఆదివాసీ పిల్లల వెతలు సమస్తం ఈ పుస్తకం నిండా చిత్రించారు రచయిత్రి. ఈ అధ్యాయాలలోని పిల్లల చర్యలు చాలాచోట్ల కొడవటిగంటి కుటుంబరావు ‘చదువు’ నవలను జ్ఞాపకం చేస్తుంటాయి. నీకు అక్షరాలు ఎంతవరకు వచ్చు అంటే ‘పలకనిండా నిండా వచ్చు’ అని ఒకే అక్షరాన్ని పలకనిండా రాసి చూపించిన పిల్లవాన్ని కొ.కు. ఊరికే చిత్రించలేదని ఉమాదేవి రచన ద్వారా తెలిసివస్తుంది.

సమ్మెట ఉమాదేవి గారు ఈ రచన ద్వారా ఒక రిలీఫ్ పొందారనిపిస్తుంది. ‘ప్రేమించబడలేక పోవడమన్న దైన్యం నుండి బయటపడడానికి’ చివరకు మిగిలేది రాసినట్లు బుచ్చిబాబు చెప్పుకున్నాడు. తను రిటైరయ్యాక ఈ పిల్లలలోకం, ఈ చల్లని కలుషితం కాని ప్రకృతి తనకు దూరమవుతాయేమోననే కనిపించని ఆతృత ఒకటి ఈ రచయిత్రిలో ఉందనిపిస్తుంది. అందుకే కొన్ని వందల సందర్భాల ఫోటోలను ఒడిసిపట్టి ఈ పుస్తకంలో నిక్షిప్తం చేసారు. ఒక్కో ఛాయాచిత్రం ఒకో కథ మనకే చెబుతుంది. అందులో మునిగితేలిన రచయిత్రి ఎన్ని ఊసులైనా జ్ఞాపకాల పేటిక నుండి తీసుకోవచ్చు. పుస్తకం నిడివి, ఛాయాచిత్రాల నిడివి, పసిపిల్లల కనిపించని మాటలు, రచయిత్రి చెప్పే మాటలు, చెప్పని మాటలు పాఠకులను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి, ఈ పుస్తకం సొంతం చదివిన వారిని.

ఒక రైలు, ఒక బస్సు, ఒక ఆటో, ఆపై నడక సాగించి చేసిన ఉద్యోగం ఆమెది. ఎర్రుపాలెంలో ఉన్నా కాచారం, ముత్యాలంపాడు లాంటి మారుమూలల్లో పనిచేయడం రచయిత్రికి వ్యక్తిగతమైన వేదనే. కాని ‘వేదనేది లేకపోతే కవిత వెలగదు తమ్ముడా’ అన్న పలుకు నిజమని తేలింది.

ఎవరైనా దేన్ని ఇష్టపడతారన్నది వాళ్ళ స్వభావాన్ని బట్టి ఉంటుంది. ఆ స్వభావం స్వతహాగా ఎంత వస్తుందో తెలియదు కానీ, పరిస్థితులు, సందర్భాలు ఒక స్వభావం సంతరించుకోవడానికి పనికొస్తాయి. ఖమ్మంలో పుట్టినిల్లు, విజయవాడ మెట్టినిల్లు అయిన ఉమ గారు డిగ్రీ మరుసటిరోజే పెళ్ళికావడం వల్ల వైవాహిక జీవితంలో తొలిరోజుల్ని దాటుకొని వృత్తిలోకి ప్రవేశించారు. కుటుంబ జీవితంలోంచి టీచర్ ఉద్యోగానికి ఎంపిక కావడంవల్ల తక్కువ ర్యాంకు వచ్చి తను మారుమూలలో పోస్టింగ్ పొందారు. ఒక రైలు, ఒక బస్సు, ఒక ఆటో, ఆపై నడక సాగించి చేసిన ఉద్యోగం ఆమెది. ఎర్రుపాలెంలో ఉన్నా కాచారం, ముత్యాలంపాడు లాంటి మారుమూలల్లో పనిచేయడం రచయిత్రికి వ్యక్తిగతమైన వేదనే. కాని ‘వేదనేది లేకపోతే కవిత వెలగదు తమ్ముడా’ అన్న పలుకు నిజమని తేలింది. 21 ఏండ్ల వృత్తి జీవితాన్ని వేదన నుంచి వేడుక చేయడం నేర్చుకున్నారు. ఒకవైపు చూస్తే ఒకలా ఇంకోవైపు మరోలా ఉండే వాక్యాలనేకం ఇంత సరళ గ్రంథంలో కనిపించడానికి కారణమదే.

‘అవిద్యకు కారణం పేదరికం ఒక్కటేకాదు’ అన్నమాట వినగానే మనకో పారడాక్స్ అనిపిస్తుంది. ఈ మాటను రచయిత్రి ఎలా జస్టిఫై చేస్తారు అని ఆశ్చర్యపోతాం. కానీ పట్టగొలుసులు అనేక భాగం చదివితే రచయిత్రి మాట నిజమేనని మనం నమ్మక తప్పదు.

‘అవిద్యకు కారణం పేదరికం ఒక్కటేకాదు’ అన్నమాట వినగానే మనకో పారడాక్స్ అనిపిస్తుంది. ఈ మాటను రచయిత్రి ఎలా జస్టిఫై చేస్తారు అని ఆశ్చర్యపోతాం. కానీ పట్టగొలుసులు అనేక భాగం చదివితే రచయిత్రి మాట నిజమేనని మనం నమ్మక తప్పదు. మాటను ఎటైనా తిప్పగలిగే సవ్యసాచిత్వం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఒకటే కాలంలో అనేక చరిత్రలు నడుస్తుంటాయంటారు రచయిత్రి. నిజమే, తాండాలో గుడ్డిదీపం కింద చదివిన వాడూ, డిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివినవాడూ రాయాలంటే ఒకే సివిల్స్ సర్విస్ పరీక్ష రాయాలి. వాడి అధ్యయన భాషలో పరీక్ష ఉంటుంది. వీడి అధ్యయన భాష ఊసుకానీ, మాతృభాష ఊసుకానీ ఉండదు. శ్రమజీవుల భోజనానికి, సంపన్నుల డైట్ కూ చాలా తేడా ఉంటుంది. అందుకే ‘మేధస్సును బట్టి సిలబస్ ఉండాలి. ఆకలినిబట్టి ఆహారం’ ఉండాలంటారు రచయిత్రి. ఒకే దేశం ఒకే చట్టం అనే వాళ్ళ కాలంలో ఉమాదేవి గారి వైవిధ్యాకాంక్షను బతికించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
పల్లెపిల్లల కలల పట్టుకుచ్చుల్ని కదిపినట్టుంది ఉమాదేవిగారి పుస్తకం.

  • తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా పనిచేసిన శ్రీ ఏనుగు నరసింహారెడ్డి కవి, రచయిత. ‘కొత్త పలక’, ‘మూల మలుపు’, ‘తెలంగాణ రుబాయిలు’ వారి ప్రసిద్ది పొందిన కవితా సంపుటులు. వారు మీర్ లాయక్ అలీ గ్రంధాన్ని ‘హైదరాబాద్ విషాదం’ పేరిట అనువదించారు కూడా. ప్రస్తుతం మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article