రాష్ట్రంలో మద్యం విక్రయాలు పెరిగిన నేపథ్యంలో నిధుల లేమితో సతమతమవుతున్న గ్రామ పంచాయతీలు కనీస నిర్వహణా ఖర్చుల కోసం ఆఖరికి ఖాళీ బీరు సిసాలు అమ్ముకుంటున్న వైనాన్ని దక్కన్ క్రానికల్ వెలుగులోకి తెచ్చింది.
కందుకూరి రమేష్ బాబు
రాష్ట్రావిర్భావం తర్వాత ‘నీళ్ళు నిధులు నియామకాల’ యాజమాన్యం కన్నా సామాన్య జనం కష్టార్జితాన్ని కాజేసే ‘మద్యం సరఫరా’ పెరగడమే ఈ పదేళ్ళ తెలంగాణా విషాద వైఫల్యంగా పేర్కొంటూ రాసిన వ్యాసం చదివే ఉంటారు. (లేదంటే ఇక్కడ క్లిక్ చేయండి. రాష్ట్రంలో మద్యం సరఫరా ఎలా పెరిగడం, దాన్ని ప్రభుత్వ ప్రగతిగా చెప్పుకోవడానికి ఎంతటి సిగ్గుపడే చర్యో చదివాక మీరే గమనిస్తారు. ఇక, ఇప్పుడు ఈ వార్త కూడా చూడండి.
నిధుల కోరత కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామ పంచాయతీలు కొంతలో కొంత డబ్బులు సమకూర్చుకోవడానికి గాను గ్రామాల్లో తమ పారిశుధ్య కార్మికులు సేకరించిన తాగి పారేసిన ఖాళీ సీసాలను అమ్మడం ఒక విధానంగా అమలు చేసుకుంటున్న విషయాన్ని దక్కన్ క్రానికల్ కరస్పాండెంట్ పిల్లలమఱ్ఱి శ్రీనివాస్ గత నెలలోనే వెలుగులోకి తేవడం విశేషం.
ఈ వార్త తెలంగాణా గ్రామీణ సమాజంలో నిధుల లేమితో పంచాయతీల నిర్వహణ ఎలా ఇబ్బందిగా మారిందో చెబుతుంది. అదే సమయంలో ఆ వైఫల్యాన్ని అధిగమించడానికి కొందరు సర్పంచులు ఆచరిస్తున్న అనివార్య మార్గాలనూ విశదీకరిస్తుంది.
శ్రీనివాస్ మారుమూల ఆదివాసీ గూడాలు, గిరిజన తండాలు మొదలు పట్టణాల వరకూ ప్రధానంగా గ్రామీణ తెలంగాణా అన్నది ఎలాంటి మార్పులను సంతరించుకుంటూ ఉన్నదో నిశితంగా పరిశీలించి రిపోర్ట్ చేయడంలో దిట్ట.
తాను గత నెల రాసిన ఈ వార్త తెలంగాణా గ్రామీణ సమాజంలో నిధుల లేమితో పంచాయతీల నిర్వహణ ఎలా ఇబ్బందిగా మారిందో చెబుతుంది. అదే సమయంలో ఆ వైఫల్యాన్ని అధిగమించడానికి కొందరు సర్పంచులు ఆచరిస్తున్న అనివార్య మార్గాలనూ విశదీకరిస్తుంది.
మొదట పంచాయతీ కేంద్రాల ఇబ్బందులను ప్రస్తావిస్తూ చివరకు పెరిగిన మద్యం విక్రయాలు, తద్వారా అనేకంగా పేరుకుపోతున్న ఖాళీ సేసాలు ఎట్లా సర్పంచులకు ఉపకరిస్తున్నాయో కూడా ఈ వార్తలో నివేదించడం విశేషం.
ఒక రకంగా ఈ వార్త రెండు విధాల ఈ పదేళ్ళ తెలంగాణా వైఫల్యాన్ని చెప్పకనే చెబుతుంది.