Editorial

Monday, December 23, 2024
Opinionబేసిక్ కేవలం పారాసిటమాల్ - డాక్టర్ విరించి విరివింటి తెలుపు

బేసిక్ కేవలం పారాసిటమాల్ – డాక్టర్ విరించి విరివింటి తెలుపు

ఇప్పటికీ కరోనా అర్థం కాలేదు. కాని కరోనా విషయంలో జబ్బుతో వచ్చే లక్షణాలకి తగ్గట్టుగా మందులు వాడాలంటే  ఉండే బేసిక్ ట్రీట్మెంట్ పారాసిటమాల్. కేసీఆర్ చెప్పినా జగన్ చెప్పినా ఇది నిజం. మరింత ఎక్కువ తీవ్రత ఉంటే వేరే మందులు కలపబడతాయి. కానీ బేసిక్ కేవలం పారాసిటమాల్.

డాక్టర్ విరించి విరివింటి

కరోనా పారాసిటమాల్ తో తగ్గుతుంది అని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అప్పట్లో చెబితే చాలామంది భలేగా గేలి చేశారు. రోజూ పెరుగుతున్న కేసులూ మరణాలూ చూసి ఇంత జబ్బు పారాసిటమాల్ కి తగ్గుతుందా అని చాలామంది అనుకున్నారు అప్పట్లో. కానీ నిజానికి వాళ్ళిద్దరూ చెప్పింది నూటికి నూరు పాళ్ళు సైంటిఫికల్లీ కరెక్ట్.

ఎందుకంటే కరోనా కావచ్చు లేదా ఏ వైరస్ ఐనా కావచ్చు వాటికి symptomatic treatment మాత్రమే ఉంటుంది.

కరోనా సడెన్ గా వచ్చి మీద పడేసరికి ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల ట్రీట్మెంట్ ప్రొటోకాల్స్ వచ్చాయి. కొందరు ఒక ప్రొటోకాల్ ని నమ్మి ట్రీట్మెంట్ మొదలు పెడితే మరొకరు మరో ప్రోటోకాల్. ఏది పని చేస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి మొదట మందులు మొదలు పెట్టాక ఏది పని చేస్తుందో పని చేయదో కొంత అవగాహన వచ్చాక కొన్నింటిని ట్రీట్మెంట్ ప్రొటోకాల్స్ నుండి తొలగించారు. రెమ్డెస్వీర్ వంటి కొన్నింటిని కొంత క్రైటీరియాలో ఉంటే ఇవ్వవచ్చు అనుకున్నారు. కానీ ఏదీ ఫిక్స్ కాలేదు ఇప్పటికీ. కాదు కూడా.

సైన్సు మ్యాజిక్ కాదు. దానికో పద్ధతి ఉంటుంది. అలా మ్యాజిక్ చేసేలా ఠపీమని అంతా సెట్ ఐపోతే అది సైన్సు కాదు. మ్యాజిక్కే అవుతుంది.

ఎందుకంటే ఎమర్జింగ్ వైరస్ ఏదైనా అంత త్వరగా అర్థం కాదు. కొన్ని రోజుల్లోనో కొన్ని నెలల్లోనో అర్థమైపోదు పూర్తిగా. సంవత్సరాలు గడిచే కొద్దీ అర్థమౌతుంది. సైన్సు మ్యాజిక్ కాదు. దానికో పద్ధతి ఉంటుంది. అలా మ్యాజిక్ చేసేలా ఠపీమని అంతా సెట్ ఐపోతే అది సైన్సు కాదు. మ్యాజిక్కే అవుతుంది. కానీ అతి తక్కువ సమయంలో ఎక్కువ మందికి వస్తూన్నపుడు ఏదో ఒక ఆధారం దొరికినా మనిషికి ఒక నమ్మకం వస్తుంది. అందుకే రకరకాలైన ప్రొటోకాల్స్ ఒక హోప్ ని కలిగిస్తుంటాయి. అన్నీ ఏదో ఒకరకంగా మంచే చేస్తాయి. కానీ ఇదే ఫైనల్ అనేదేదీ ఉండదు.

ఇప్పటికీ కరోనా అర్థం కాలేదు. కాని కరోనా విషయంలో జబ్బుతో వచ్చే లక్షణాలకి తగ్గట్టుగా మందులు వాడాలి అంటే ఉండే బేసిక్ ట్రీట్మెంట్ పారాసిటమాల్. కేసీఆర్ చెప్పినా జగన్ చెప్పినా ఇది నిజం. మరింత ఎక్కువ తీవ్రత ఉంటే వేరే మందులు కలపబడతాయి. కానీ బేసిక్ కేవలం పారాసిటమాల్.

ఐతే రెండో వేవ్ లో కొందరు కొన్ని రకాలైన యాంటీబయాటిక్స్ ని ఇచ్చారు. అసలు ఏ యాంటీ బయటిక్ కూడా వైరల్ ఇన్ఫెక్షన్ కి పని చేయవు. అది డాక్సీసైక్లిన్ ఐనా లేక అజిత్రోమైసిన్ ఐనా మరేదైనా.

డాక్సీసైక్లిన్ కి యాంటీ వైరల్ ప్రాపర్టీలు ఉన్నాయని కొందరనుకున్నారు. అజిథ్రోమైసిన్ కి యాంటీ వైరల్ ప్రాపర్టీలు ఉన్నాయని ఇంకొందరనుకున్నారు. వాటి వాటికి తగ్గ స్టడీస్ ఏవో పబ్లిష్ చేసుకున్నారు. ఐతే వీటికి ఎలాంటి యాంటీవైరల్ ప్రాపర్టీలు లేవని కూడా బోలెడు స్టడీస్ వచ్చాయి. అంటే కొన్ని పాజిటివ్ స్టడీస్ కొన్ని నెగెటివ్ స్టడీస్ అన్నమాట. ఐతే అర్థం చేసుకోవలసింది ఏమిటంటే అవి స్టడీస్ మాత్రమే. సాధారణ డాక్టర్ ఆ స్టడీస్ చూసి ట్రీట్మెంట్ మార్చుకోవాలసిన అవసరం లేదు. అంటే ఒక స్టడీలో అజిత్రోమైసిన్ పని చేస్తుంది అని వస్తే అది చూసి వెంటనే అజిత్రోమైసిన్ రాసేయడం ఉండదు. అలా రాసేవారూ ఉంటారు అది వేరే ముచ్చట. ఒక స్టడీలో డాక్సీసైక్లిన్ పని చేస్తుంది అని వస్తే వెంటనే అజిత్రోమైసిన్ ఆపేసి డాక్సీసైక్లిన్ మొదలు పెడతారా?. ఏమో పెట్టనూ వచ్చు కొందరు. ఐతే స్టడీల ఆధారంగా ట్రీట్మెంట్ వెనువెంటనే మారిపోదు. (గతంలో సైంటిఫిక్ మెథడ్ అర్థం కాక పాపం ఒకాయన మెడికల్ జర్నల్స్ చదివేసి అక్కడ అలా వచ్చింది ఇక్కడ ఇలా వచ్చింది. మీరు డాక్టర్లు ఎందుకు వాడరు అంటూ వాపోయేవాడు. పాపం ఆయనకు తెలియదు అంతే. ఆయన ఆరాటం మంచిదే).ఎందుకంటే పాజిటివ్ స్టడీస్ ఎన్నుంటయో..నెగేటివ్ స్టడీస్ అన్ని ఉంటాయి. మంచి డాక్టర్ ఏం చేస్తాడంటే తన పేషంట్ కి ఎంత అవసరమో అంతే మందులు రాస్తాడు. ఒక్కో పేషంట్ కి ఒక్కోరకంగా రాయవచ్చు అవసరాన్నిబట్టి.

అసలు యాంటీబయాటిక్స్ కరోనాకు ఇచ్చే కారణం వేరే. చాలా స్పష్టంగా ఉన్న విషయం ఏమంటే కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల మనిషి ఇమ్యూన్ సిస్టం పెద్ద కుదుపుకి లోనౌతుంది. దీనివలన అప్పటిదాకా మనిషికి రోగాన్ని కలిగించలేని సింపుల్ బ్యాక్టీరియాలు కూడా రోగాన్ని కలుగజేస్తాయి. ఉదాహరణకు కరోనా వస్తే కొంతమందికి వాంతులు విరేచనాలు అయ్యేవి. ఎందుకంటే అది కరోనా వైరస్ వలన కాకపోవచ్చు.

మరో ముఖ్యమైన విషయం ఏమంటే కరోనాతో పాటు ఈ బ్యాక్టీరియాలు కలిగించే oppertinistic ఇన్ఫెక్షన్లు.. అంటే అప్పటిదాకా మౌనంగా ఉండి వ్యాధి నిరోధక శక్తి తగ్గగానే అవకాశం వచ్చిందని విజృభించే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల వలననే కరోనా మరణాలు జరిగాయని ధృవీకరణ జరిగింది.

కడుపులో సైలెంట్ గా ఉండే కొన్ని బ్యాక్టీరియాలు కరోనా వచ్చాక మనిషి రోగనిరోధక శక్తి తగ్గడంవలన ఇవి బలాన్ని పుంజుకుని వాంతులు విరేచనాలు కలిగిస్తాయి. మరో ముఖ్యమైన విషయం ఏమంటే కరోనాతో పాటు ఈ బ్యాక్టీరియాలు కలిగించే oppertinistic ఇన్ఫెక్షన్లు.. అంటే అప్పటిదాకా మౌనంగా ఉండి వ్యాధి నిరోధక శక్తి తగ్గగానే అవకాశం వచ్చిందని విజృభించే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల వలననే కరోనా మరణాలు జరిగాయని ధృవీకరణ జరిగింది. కాబట్టి కరోనా సమయంలో వచ్చే oppertunistic infections ని తగ్గించేందుకే anti biotics ఇవ్వాల్సి ఉంటుంది తప్ప అజిత్రోమైసిన్ కి గానీ డాక్సీసైక్లిన్ కి గానీ ఎలాంటి యాంటీవైరల్ ప్రాపర్టీలు లేవు. ఉండవు. ఎందుకుండవు అంటే అదే సైన్సు. ఎంత సింపుల్ అంటే బ్యాక్టీరియాలను చంపడం కోసం తయారైన anti biotics వైరస్ లను చంపవు. ఇది అర్థం చేసుకోవడం సింపుల్. ఇది మారదు. ఎందుకంటే ఇది బేసిక్ సైన్సు.

ఐతే మరి డాక్సీసైక్లిన్ బెస్టా అజిత్రోమైసిన్ బెస్టా అని డాక్టర్లను అడిగితే ఒక్కో డాక్టర్ ఒక్కోదాన్ని నమ్ముతాడు తనకున్న అనుభవాన్ని బట్టి. రెండూ కూడా broad sprectrum antibiotics. కాబట్టి రెండు కూడా oppertunistic infections కి బాగానే పని చేస్తాయి. కానీ కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే ఏది బెస్ట్ అంటే చెప్పడం కష్టం. ఒకరకంగా డాక్సీసైక్లిన్ బెస్టని చెప్పవచ్చు.

జలుబు ఉంటేనే సిట్రిజిన్. లేకుంటే ఎందుకు?. జ్వరం ఉంటేనే పారాసిటమాల్. లేకుంటే ఎందుకు ? ఇవేమైనా పిప్పరమెంట్లా?. మందులు. జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది.

ఇదంతా ఎందుకు అంటే తెలంగాణ గవర్నమెంట్ ప్రొటోకాల్ లో అజిత్రోమైసిన్ ని యాడ్ చేసింది. ఎవరైనా ఇది చూసేసి వెంటనే అన్ని మందులు మొదలు పెట్టవలసిన అవసరం లేదు. గవర్నమెంట్ వాళ్ళు ఏదో ఒక యాంటీబయోటిక్ ని యాడ్ చేయక తప్పదు. కానీ కేసీఆర్ చెప్పినట్లు పారాసిటమాల్ చాలు. ఐతే లక్షణాలు తీవ్రంగా లేనపుడు పారాసిటమాల్ కూడా అవసరం ఉండదు. అలాంటప్పుడు అజిత్రోమైసిన్ ఐనా ఎందుకు?. నన్నడిగితే లక్షణాలు వస్తే టెస్టు కూడా అవసరం లేదు. సరే ఎవరికైనా టెస్టు చేస్తే, పాజిటివ్ వస్తే గవర్నమెంట్ ఇచ్చే కిట్ తీసేసుకుని వెంటనే ఠపీమని వేసేసుకోకుండా డాక్టర్ ని అడిగి మందులు వేసుకుంటే మంచిది. అన్ని మందులూ వేసుకోనవసరం లేదు. జలుబు ఉంటేనే సిట్రిజిన్. లేకుంటే ఎందుకు?. జ్వరం ఉంటేనే పారాసిటమాల్. లేకుంటే ఎందుకు ? ఇవేమైనా పిప్పరమెంట్లా?. మందులు. జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది.

శరీరానికి తనకు తాను రక్షించుకునే గుణం ఉంటుంది. దానిని పని చేయనిస్తూ.. మీ లక్షణాలు తీవ్రంగా ఉన్నాయనిపిస్తే అవసరమైనంత మేరకే డాక్టర్ చెబితేనే ఆంటీబయాటిక్ వంటి ఇతర మందులు వేసుకోవడం మంచిది. అన్నింటికంటే ముఖ్యంగా జ్వరం వచ్చినపుడు అది ఏదైనా పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవడం మంచిది. మనం కండలవీరులమైనా కొండలవీరులమైనా వైరస్ కి లెక్కలేదు. దానిముందర అంతబలముందని ఇంతబలముందని ఎగసెక్కాలేస్తే లాగి కొట్టుద్ది. అందుకే బయట తిరగకుండా సప్పుడుదంకా ఒక రూంలో ముసుగుతన్ని పడుకోవాలి ఒక వారం రోజులు. రోజూ మూడపూటలు మంచి ఆహారం తిని మళ్ళీ పడుకోవాలి. అదే తగ్గిపోద్ది.

ఇపుడు ఒమిక్రాన్ తో పాటు అక్కడక్కడా డెల్టా కేసులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి…ఇంతకుముందు లాగే జాగ్రత్తలు అవసరం. స్వంత వైద్యాలు, స్వంత నిర్ణయాలు ప్రమాదకరం. మనమంతా మహా మేధావులమే కావచ్చు. కానీ స్కూటర్ ఆగిపోతే మెకానిక్ దగ్గరికే వెళ్ళాలి. పెట్రోల్ ఐపోతే పెట్రోలే పోయించాలి. మేధావులం మేమని నీళ్ళు పోస్తే స్కూటర్ స్టార్టవుద్దా?.

అక్షరం సైతం చక్కటి హస్తవాసిగా గల వైద్యుడు డాక్టర్ విరించి విరివింటి.
తాను కవీ, రచయితా షార్ట్ ఫిల్మ్ మేకర్. ‘రెండో అధ్యాయానికి ముందుమాట’ తొలి కవితా సంపుటి.

More articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article