Editorial

Wednesday, January 22, 2025
Opinionటీచర్లకు అండగా నిలబడదాం : డాక్టర్ విరించి విరివింటి

టీచర్లకు అండగా నిలబడదాం : డాక్టర్ విరించి విరివింటి

 

టీచర్లు బదిలీలపై ఆందోళన చెందడం మొదలు పెట్టి ఆత్మహత్యల దాకా వెళ్ళడమనేది చాలా భయంకరమైన సోషల్ సిచ్యుయేషన్ ని తెలియజేస్తుంది. టీచర్ సపోర్టింగ్ గ్రూపుల అవసరం ఉంది. ఎవరి సమస్యలు వారికి పెద్దగానే కనిపిస్తాయి. టీచర్ల సమస్యలు టీచర్లకే అర్థమౌతాయి. మీడియాలో one sided judgments ఆపి మేమున్నామయ్యా మీకు తొందరపడకండి అని చెప్పేవాళ్ళంగా తయారవుదాం.

డాక్టర్ విరించి విరివింటి

నేను ఏమి చూస్తున్నాను అంటే ఈ కరోనా మొదలైనప్పటినుండి ప్రజలలో విపరీతమైన ఒత్తిడి పెరగడాన్ని. చిన్న సమస్యలకి కూడా విపరీతంగా భయపడిపోవడం చాలామంది లో కామన్ గా కనిపిసస్తున్న అంశం.

ముఖ్యంగా ఈ కరోనా పాండెమిక్ వ్యక్తుల ఆర్థిక మూలాలను చాలా బలంగా కూలదోసింది. ఇది సరిపోదన్నట్టు కరోనా ఒక వేవ్ తర్వాత మరొకటిగా విరుచుకుపడుతున్నప్పుడల్లా అలాంటి వార్తలు విన్నప్పుడల్లా అసలు యే పరిష్కారం దొరకని భవిష్యత్తు ఏమైనా రాబోతోందా అనే జనరల్ సబ్ కాన్షియస్ ఫీల్ ఒకటి మొదలవుతుంది. ఇటువంటి పరిస్థితులను దాటడానికి మనకు సపోర్టింగ్ సిస్టంలు కావాలి. కరోనా కాలం నుండి నేను ఎంతమందికతో వ్యక్తిగతంగానో ఫోన్లద్వారానో మాట్లాడటం జరుగడం వలన నేను చూసిన వాస్తవమిది. కొంతమందితో గంటలతరబడి మాట్లాడవలసీ వచ్చింది. భవిష్యత్తు పై వాళ్ళల్లో ఎంతటి భయమని!!!. “సార్ మాకు పిల్లలు ఉన్నారు. వాళ్ళు అన్యాయం ఐపోకూడదు” అని.

ఇపుడు టీచర్ల వంతు వచ్చింది. ప్రైవేటు ప్రభుత్వ టీచర్లెందరో ఆత్మహత్యల బాట పడుతున్నారు. ఇపుడు చేయవలసిందల్లా ఎవరికి ఏ సమస్య వచ్చినా మిగితావారం మేమున్నామని చెప్పగలగడం. ఏమీ కాదని భరోసా ఇవ్వగలగడం.

ఇదేదో గొప్ప కౌన్సెలింగ్ చేయవలసిన విషయమో లేక పర్సనాలిటీ డవలప్ చేసేందుకు “లెగండి పరిగెత్తండి” అని చెప్పడమో కాదు. “ఏమీ కాదు మేమంతా ఉన్నాం” అని చెప్పగలగడం. ఒకసారి మాట్లాడగానే ఠపీమని మారిపోయి మనిషి గెంతులేయడం అనేది ఉండదు. అందుకే వ్యక్తిలోని భయాలను ప్రెజుడిసెస్ ని స్టిగ్మాలను ఆధారం చేసుకుని రకరకాలుగా గంటలతరబడి మాట్లాడవలసిన అవరసం పడవచ్చు. రోజూ మాట్లాడవలసిన అవసరం పడవచ్చు. కానీ చుట్టు పక్కల ఉన్న మనం మేమున్నాము అని చెప్పగలగడం అవసరం.

ప్రజలకు ఉండే సపోర్టింగ్ సిస్టంలలో మొదటి స్థానం ప్రభుత్వాలది కూడా ఐవుంటే ఆ దేశం భూతల స్వర్గం ఔతుంది. ప్రజలు మానసికంగా ఆర్థికంగా ఎంతగా చితికిపోయినా ప్రభుత్వాలు మేమున్నాం అని ఏరోజూ చెప్పలేదు. అమెరికా యూరప్ లలో కరోనా సమయంలో ప్రతిమనిషికీ కనీసం చేతికింత అని కొంత డబ్బుని చేతి సహాయానికైనా అందించాయి అక్కడి ప్రభుత్వాలు. మన దేశంలో ఇంత జనాభాలో ఇంత అగమ్యగోచర ఎలక్టోరల్ పాలిటిక్స్ ఏమీ చేయలేకపోయాయో చేయకూడదనుకున్నాయో.

ఇపుడు చేయవలసిందల్లా ఎవరికి ఏ సమస్య వచ్చినా మిగితావారం మేమున్నామని చెప్పగలగడం. ఏమీ కాదని భరోసా ఇవ్వగలగడం. ఇంతమాత్రం చేయగలిగితే ఎందరెందరు సోషల్ యాంక్జైటీలనుండి బయటపడి గట్టెక్కగలుగుతారో…!!!.

ఇపుడు టీచర్ల వంతు వచ్చింది. ప్రైవేటు ప్రభుత్వ టీచర్లెందరో ఆత్మహత్యల బాట పడుతున్నారు. జ్వరం 98.6 నుండి 99 F చేరగానే అఘమేఘాలమీద భయపడుతూ వణికిపోతూ ఫోన్లు చేసినవారు ఎందరో ఉన్నారు. అటువంటిది కరోనా కాలం నుండి చితికిపోయినవారిని అన్ని సౌకర్యాలకు దూరంగా ఉండేవారిని మరింతగా బెంబేలెత్తించే విధంగా మన పరిస్థితి తయారైంది. ఇపుడు చేయవలసిందల్లా ఎవరికి ఏ సమస్య వచ్చినా మిగితావారం మేమున్నామని చెప్పగలగడం. ఏమీ కాదని భరోసా ఇవ్వగలగడం. ఇంతమాత్రం చేయగలిగితే ఎందరెందరు సోషల్ యాంక్జైటీలనుండి బయటపడి గట్టెక్కగలుగుతారో…!!!.

టీచర్లు బదిలీలపై ఆందోళన చెందడం మొదలు పెట్టి ఆత్మహత్యల దాకా వెళ్ళడమనేది చాలా భయంకరమైన సోషల్ సిచ్యుయేషన్ ని తెలియజేస్తుంది. టీచర్ సపోర్టింగ్ గ్రూపుల అవసరం ఉంది. ఎవరి సమస్యలు వారికి పెద్దగానే కనిపిస్తాయి. టీచర్ల సమస్యలు టీచర్లకే అర్థమౌతాయి. లోతులు చూడకుండానే ప్రపంచం ఏమీ అర్థమైపోదు. అలా అర్థమైపోయిందని అనుకునేవాళ్ళకు స్వగతమే అర్థంకాదు. సోషల్ మీడియాలో one sided judgments ఆపి మేమున్నాం…మీరు తొందరపడకండి అని చెప్పేవాళ్ళంగా తయారవుదాం.

డాక్టర్ విరించి విరివింటి సామాజిక సమస్యలపై స్పందించే కవీ, రచయితా షార్ట్ ఫిల్మ్ మేకర్. మీదు మిక్కిలి చక్కటి హస్తవాసి గల వైద్యులు. ‘రెండో అధ్యాయానికి ముందుమాట’ వారి తొలి కవితా సంపుటి.

 

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article