Editorial

Monday, December 23, 2024
కథనాలుఅన్నం కుండల పండుగ : డా.మట్టా సంపత్కుమార్ రెడ్డి 

అన్నం కుండల పండుగ : డా.మట్టా సంపత్కుమార్ రెడ్డి 

తెలంగాణ మాగాణంలో
బోనం ఒక నిత్యాన్నదాన మహోత్సవం !

మెట్టుపల్లి దగ్గరి పెద్దాపురంలో జరిగే
మల్లన్న వసంతోత్సవ బోనాలజాతర బహుశా–
ప్రపంచంలోనే అతిపెద్ద అన్నమహోత్సవం కావచ్చు.

డా.మట్టా సంపత్కుమార్ రెడ్డి 

అన్నయములైనవన్ని జీవంబులు
కూడు లేక జీవ కోటి లేదు
~ పోతులూరి వీరబ్రహ్మం

తెలంగాణ బోనాల సంస్కృతి
పైన చెప్పిన తాత్త్వికతతోనే ముడిపడ్డది.
బోనం అంటే భువనం! బోనం అంటే భోజనం!

విశ్వశక్తికి ఘటం సంకేతమైతే
జీవశక్తికి అందలి అన్నం సంకేతం!
బోనం.. జీవాత్మ – పరమాత్మల ఏకీకృత రూపం.

ఎన్నో శైవ శాక్తేయ సంప్రదాయాల పరంపరలకు
కేంద్రస్థానమైన తెలంగాణ మాగాణంలో..
బోనం ఒక నిత్యాన్నదాన మహోత్సవం !

మెట్టుపల్లి దగ్గరి పెద్దాపురంలో జరిగే
మల్లన్న వసంతోత్సవ బోనాలజాతర బహుశా–
ప్రపంచంలోనే అతిపెద్ద అన్నమహోత్సవం కావచ్చు.

కాముని పున్నమ తర్వాత వచ్చే ఆదివారంపూట
ఇక్కడ మల్లన్న బాసంతం/వసంతోత్సవం జరుగుతది.
మొన్నటి ఆదివారం నాడు జరిగిన బోనాల ఉత్సవంలో
అరువైవేలకు పైచిలుకు బోనాలు దేవునికి అర్పించుకున్నారు.

https://www.facebook.com/sampathkumarreddy.matta/videos/728028858568528

ఇది అచ్చమైన అన్నంకుండల పండుగ!
శుద్ధ శాఖాహార అన్నసంతర్పణ మహోత్సవం.

బోనం అంటే మామూలుగా… ఒక జత. (1+1)
ఒక బెల్లపన్నపు బోనం + ఒక పసుపన్నపు బోనం.
ఊరు ఊరంతా, ఊరిచుట్టు పరిసర ప్రదేశమంతా–
బోనాలను వండివార్చే హంగామాతొ కళకళలాడుతది.
ఒక్కపూటలో యాభైవేల పైన పొయిలు వెలిగిస్తారంటే…
ఆ సంబురాన్ని ఏమని ఎంతని వర్ణించగలము.

అత్యంత నిష్టగ ఒక్కపొద్దుండి, బోనాలు వండి
మలిసంధ్యకు ముందు భక్తులందరూ ఒకేసారి
మల్లన్నదేవునికి బోనాలు సమర్పించుకుంటారు.
లక్షలమంది మధ్య, తొక్కిసలాటకు తావులేకుండా
అత్యంత క్రమశిక్షణతో బోనాల ప్రదక్షిణలు జరుగుతాయి.
ఈ దృశ్యం చూసుటానికి రెండుకండ్లు చాలవంటే చాలవు.

లక్షాధికమైన బోనాలు, ఒకేదగ్గర లక్షలమందికి వితరణలు.
బోనం పరంపర ఎంత ప్రాచీనమో.. అంత ప్రశస్తము గదా..!!

ఇది అచ్చమైన అన్నంకుండల పండుగ!
శుద్ధ శాఖాహార అన్నసంతర్పణ మహోత్సవం.
బెల్లపు పరమాన్నం, పులగం & కాయగూరల భోజనం.
లక్షాధికమైన బోనాలు, ఒకేదగ్గర లక్షలమందికి వితరణలు.
బోనం పరంపర ఎంత ప్రాచీనమో.. అంత ప్రశస్తము గదా..!!

 

More articles

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article