Editorial

Monday, December 23, 2024
కథనాలుదుర్గమ్మ ~ బతుకమ్మల తారతమ్యాలు తెలుపు : డా.డి.శారద

దుర్గమ్మ ~ బతుకమ్మల తారతమ్యాలు తెలుపు : డా.డి.శారద

ఒకవైపు దుర్గమ్మను పూజించే శరన్నవ రాత్రులు, మరోవైపు బతుకమ్మను పూజించే తొమ్మిది రోజుల ఆటలు. ఈ రెండు ఉత్సవాలను పరిశీలిస్తే కొన్ని సారూప్యాలు, వైవిధ్యాలు కనిపిస్తాయి.

డా.డి. శారద

పూజా విధానాలు, ఆచారాలు, విధి విధానాలు వేరైనా పూజలందుకునే అమ్మవారు ఒక్కరే. భావన ఒకటే. రెంటి పూజలోనూ పసుపు గౌరమ్మను ప్రత్యేకంగా పూజిస్తారు. స్త్రీల భాగస్వామ్యానికి రెండు ఉత్సవాలలోనూ ప్రాధాన్యం. అయితే, వాటి మధ్యగల తారతమ్యాలు చూద్దాం.

వ్యాసకర్త డి.శారద కవయిత్రి, ఉపాధ్యాయురాలు. బతుకమ్మను సాంస్కృతిక పునరుజ్జీవన ప్రతీకగా ఎంచి చేసిన పరిశోధనకు గాను వారు డాక్టరేట్ అందుకున్నారు. నివాసం నిజామాబాద్.

– అశ్వీయుజ శుక్లపక్షం పాడ్యమి నుంచి దశమి వరకు దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు జరిగితే పాడ్యమి నుంచి నవమి వరకు బతుకమ్మ ఆటలు సాగుతాయి.

శ్రీచక్షికంలో నిండు కలశాన్ని స్థాపించి దుర్గమ్మ విగ్రహం పెట్టి పూజిస్తారు. నిండు చెంబుల లేదా బిందెల నీళ్ళు బెట్టి తాంబాలంలో శ్రీచక్రం మాదిరిగా అంతస్తులుగా పూలను పేర్చి పద్మం లేదా నక్షత్రం ముగ్గుపై బతుకమ్మను పెడతారు.

నిమ్మకాయల దండ దుర్గమ్మ మెడలో వేస్తే నిమ్మకాయ సద్ది బతుకమ్మకి నైవేద్యం.

నవక్షిగహ వాస్తుపూజ చేసి వాస్తు అనుసారం దుర్గమ్మ ప్రతిష్ఠాపన చేస్తారు. ఇంటి పెద్దర్వాజ కెదురుగా అంటే తూర్పు లేదా ఉత్తర దిశగా బతుకమ్మని పేరుస్తారు.

గుమ్మడికాయలతో దుర్గమ్మకి దిష్టి తీస్తే గుమ్మడాకుల ఆసనం, గుమ్మడిపూల కిరీటం బతుకమ్మకి ప్రీతి.

నిమ్మకాయల దండ దుర్గమ్మ మెడలో వేస్తే నిమ్మకాయ సద్ది బతుకమ్మకి నైవేద్యం.

ఆరాధన విషయానికి వస్తే దుర్గమ్మని రెండు విధాలుగా కొలుస్తారు. ఇంటి వంతన ప్రకారం ఘటాలు కూర్చోబెట్టడం, అంబబాయి జోగు అడగడం, ఎల్లమ్మలు పూదిచ్చుడు లాంటి ఇంటి ఆచారాలు ఉంటాయి. తొమ్మిది రోజులు ఒంటి పూట భోజనం, నియమ నిష్టల పూజలు ఉంటాయి. సామూహికంగా దుర్గమ్మను స్థాపించడం రెండో విధానం. ఒక గల్లివాసులు లేదా గ్రామస్థులు కలిసి నాలుగు రోడ్ల కూడలిలో లేదా దేవాలయాలలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజిస్తారు. బతుకమ్మ విషయానికి వస్తే, ఇంట్లోనే పేర్చి పూజించి, ఇంటి ముందు ఆడి నాల్గు రోడ్ల కూడలిలో పెట్టి సామూహికంగా అందరూ కలిసి ఆడతారు.

దుర్గమ్మ స్థాపన, నిత్య ఆరాధన అంతా కఠోర నియమ నిష్టలతో జరుగుతుంది. మంత్రోచ్ఛారణలతో పూజా విధి విధానం తు.చ. తప్పకుండా నిర్వహిస్తారు. శాంతి హోమాలు జరిపిస్తారు. అయితే, బతుకమ్మను పూజించే శ్లోకాలంటూ ఏమీ లేవు.

దుర్గమ్మ స్థాపన, నిత్య ఆరాధన అంతా కఠోర నియమ నిష్టలతో జరుగుతుంది. చిన్న తప్పిదాన్ని కూడా అమ్మ సహించదని భావించి మంత్రోచ్ఛారణలతో పూజా విధి విధానం తు.చ. తప్పకుండా నిర్వహిస్తారు. శాంతి హోమాలు జరిపిస్తారు. సంస్కృత శ్లోకాలతో మంగళహారతులతో అమ్మను కీర్తిస్తారు. అయితే, బతుకమ్మను పూజించే శ్లోకాలంటూ ఏమీ లేవు. జానపదులు తమ స్వంతంగా ‘కై’ గట్టుకున్న పాటలే బతుకమ్మ ఆటలో పాటలుగా పాడుకుంటారు. తమ జీవితాలలోని కష్టసుఖాలు, తమ జీవితాలకి దగ్గరగా ఉన్న చరిత్రలు, తమ మనోభావాలన్నింటినీ స్వచ్ఛమైన మనసుతో పాటలుగా అల్లుకుంటారు. భాష ఏ ప్రాంతానికి ఆ ప్రాంతపు మాండలికమే.

దుర్గమ్మ నిమజ్జనం, బతుకమ్మను సాగనంపడాన్ని గమనిస్తే, దుర్గమ్మని నవరాత్రుల అనంతరం దశమి నాడు ఉత్తర పూజ చేసి పారే గంగలో నిమజ్జనం చేస్తారు.

భయభక్తుల పూజా విధానమొకటైతే, ఆటపాటల పూజ మరొకటి.

ఘనమైన నైవేద్యాలు దుర్గమ్మకు, పెర్గు బువ్వయినా బతుకమ్మకి నైవేద్యమే.

దుర్గమ్మ ఆరాధన కొన్ని వర్గాలకు చెందింది. అమ్మవారిని తాకడం, అలంకరించడం, పూజా కార్యక్షికమాలు నిర్వహించడం కేవలం బ్రాహ్మణ వర్గాలకి మాత్రమే అర్హత. బతుకమ్మ అన్ని కులాల వారు ఆడతారు. కులాలకు అతీతంగా తమ చేతుల నిండుగా బతుకమ్మని అలంకరిస్తారు. ఏ నియమ నిష్టలు, మడి మంత్రాలు లేవు.

ఒద్దికగా, సహనంగా, కష్టసుఖాల సమభావనతో మెలగాలని బతుకమ్మ నేర్పిస్తుంది. ఆ బతుకులో ధైర్యసాహసాలు అవసరమని, దుష్టతత్వాన్ని నశింపజేస్తేనే మానవత్వం పూజలందుకుంటుందని దుర్గమ్మ నేర్పిస్తుంది.

దుర్గమ్మ నిమజ్జనం, బతుకమ్మను సాగనంపడాన్ని గమనిస్తే, దుర్గమ్మని నవరాత్రుల అనంతరం దశమి నాడు ఉత్తర పూజ చేసి పారే గంగలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మని ఏ రోజు కా రోజు నీటిలో సాగనంపుతారు. లేదా ఎనిమిది రోజులు ఆడిన బతుకమ్మ పూలని ఎంగిలిపూలుగా పెద్ద బతుకమ్మ కడుపులో వేసి పేరుస్తారు. సద్దుల బతుకమ్మ (పెద్ద బతుకమ్మ)ను గంగలో సాగదోలుతారు.

ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే బతుకమ్మ పుట్టినట్టని అంటారు పెద్దలు. పూలన్నీ ఒత్తి ఒత్తి పేరిస్తేనే బతుకమ్మ నిలబడ్తది. అలాగే ఒద్దికగా, సహనంగా, కష్టసుఖాల సమభావనతో మెలగాలని బతుకమ్మ నేర్పిస్తుంది. ఆ బతుకులో ధైర్యసాహసాలు అవసరమని, దుష్టతత్వాన్ని నశింపజేస్తేనే మానవత్వం పూజలందుకుంటుందని దుర్గమ్మ నేర్పిస్తుంది. అందుకే ఈ నవరాత్రులు మనకు మార్గదర్శకాలు.

 

More articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article