తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో
“తెల్లని జాబిలిపై ఎవరో” అంటూ శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన లలిత గీతం శ్రీ పాలగుమ్మి విశ్వనాథం స్వర కల్పన చేయగా శ్రీమతి పెన్నా సౌమ్య గళంలో…
తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో
ఎల్లరికనులకు సత్యం దాచి ఏదో కాటుక పూసేరో
కొండదిగీ కోన దిగీ గుబురు అడవి కొమ్మలను దిగీ
ఉండి ఉండి ఒక ఇన కిరణమ్ము ఉర్వి ప్రభాతమ్ము నింపగా
ఊరక చీకటి యవనికలో ఒక్క క్షణం దాచారో ఎవరో
వారిక తారక దీపికనూ ఆరుపనేరుతురో ఎవరో
ఈ సత్యాన్వేషికి, ఋతభాషికి ఎంత కాలమీ శోధన
ఈ అసత్యంలో దైవానికి ఎంత కాలమీ బంధన?
తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో
ఎల్లరికనులకు సత్యం దాచి ఏదో కాటుక పూసేరో
తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో
ఎల్లరికనులకు సత్యం దాచి ఏదో కాటుక పూసేరో
Listen to the song in You tube