సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సత్సంగ సదనం వ్యవస్థాపకులు శ్రీ సరస్వతి గోవింద రాజులు నిన్న శుక్రవారం రాత్రి నిండు నూరేళ్ళ జీవితానికి సెలవు చెప్పి అనంత లోకాలకు పయణమయ్యారు. వారు సుదీర్ఘ భక్తి సంఘం కార్యాచరణతో పరిపూర్ణ ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపారు. వారం క్రితం అనారోగ్యానికి గురైన వారు మృత్యువు ముగింట కూడా జపమాలను వదిలిపెట్టలేదు. వారి అస్తమయంతో ప్రతి నిత్యం వినిపించే ‘హరే రామ’ నామ సంకీర్తనం మునుపటిలా వినిపించదంటే అది అతిశయోక్తి కాదు. వారి దివ్య స్మృతిలో తెలుపు నివాళి ఇది.
బండారి బాల్ రెడ్డి
శ్రీ రాముని పరమ భక్తులైన శ్రీ సరస్వతి గోవింద రాజులు రెవెన్యూ శాఖ లో సేగేదారు ( క్లర్క్ )గా ప్రభుత్వ ఉద్యోగాన్ని 1974 సంవత్సరం లో త్యజించి కిషన్ దాస్ ఎల్లారెడ్డిపేటలో సత్సంగ సదనం భక్తి సంఘం స్థాపించారు. అక్కడ ప్రతి నిత్యం “హారే రామ హారే రామ రామ రామ హారే హారే” నామ సంకీర్తనం ఇరవై నాలుగు గంటలు వినిపించావలసిందే. వారి అస్తమయంతో ఎల్లారెడ్డిపేట మాత్రమే కాదు, అనేక గ్రామ ప్రజలు తీవ్ర విషాదంలో మునిగారు.
శ్రీ సరస్వతి గోవింద రాజులు ఒక గొప్ప ఆధ్యాత్మిక కార్యకర్త. వారు కరీంనగర్. నిజామాబాద్. పాత జిల్లాలోని 1008 గ్రామాల్లో సత్సంగ సదనం – భక్తి సంఘం శాఖలను స్థాపించి వేలాది మందిని రామ భక్తులను తయారు చేశారు.
ఉత్తర భారతదేశంలోనే 64వ శ్రీ రామ కోటి స్థూపాన్నీ 1960 లో నిర్మించి శ్రీ పెద్ద జియర్ స్వామి చేతుల మీదుగా దాన్ని అవిష్కరింపజేశారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో ఇక్కడ నిర్వహించే వార్షికోత్సవం, భాగవత సప్తహం తెలంగాణలో పెద్ద వేడుక.
భక్త కోటికి విశేష సేవ
వారు కృషి చాలా విస్తీర్ణమైనది. తనది సుదీర్ఘ ప్రస్తానం కూడా. వారు కిషన్ దాస్ ఎల్లారెడ్డిపేట కేంద్రంగానే కాదు, అనేక చోట్ల అధ్యత్మిక సేవకు కృషి చేశారు. మహారాష్ట్ర లోనీ షోలాపూర్ జిల్లా పండరీపురంలో హారేరామ హారేరామ.రామ రామ హారేహారే. ఉత్తరప్రదేశ్ లోనీ వారణాసి కాశీలో ‘హారాసాంభ హార సాంభ’.ఉత్తర ప్రదేశ్ మదుర బృందావనం జిల్లా లో ‘రాధే కృష్ణ’. తమిళనాడు కంచిపూరంలో ‘ఓం నమాశివయాః’. ఉత్తర ప్రదేశ్ సైతాబాద్ జిల్లా ‘హారే రామ’. గుజారాత్ జామ్ నగర్ జిల్లా ‘శ్రీరామ జయరామ’. ఋషి కేశ్ డేహృడాన్ జిల్లా ఉత్తరాంచల్ జిల్లా లో ‘ఓం నమోః భగవతే వాసుదేవాయ’, వేములవాడలో ‘సాంభ సదాశివ’ అనే భగవ నామ స్మరణ జరుగుతుందంటే అది వారి చొరవ ఫలితమే.
శ్రీ సరస్వతి గోవిందరాజుల జీవితచరిత్రను ఎల్లారెడ్డిపేటకు చెందిన విశ్రాంత ప్రదానోపాద్యాయులు పి వెంటయ్య సార్ ఒక గ్రంధంగా వెలువరించారు.
పాత కరీంనగర్ జిల్లా పాత సిరిసిల్ల తాలూకాలోని ఎల్లారెడ్డిపేట గ్రామం (ప్రస్తుతం ఎల్లారెడ్డిపేట మండలం) ఆ రోజుల్లోనే అది మఖ్తా తహసీల్ కేంద్రంగా, మఖ్తా అధీనంలో ఉండేది. ఎల్లారెడ్డిపేట. బొప్పాపురం సర్వేపల్లి. గొల్లపల్లి. కోరుట్లపేట నారాయణపురం. పదిర, సింగారం తదితర గ్రామాలతో ఉండేది. అక్కడ గుమస్తాగా పని చేసి, ఉద్యోగాన్ని త్యజించి భక్త సంఘాన్ని స్థాపించారు. గత వరం రోజులుగా దగ్గు దమ్ముతో వారి ఆరోగ్యం క్షీణించి నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు.
నేడు పదకొండు గంటలకు అంత్యక్రియలు
వారి పంచబౌతిక దేహాన్ని భక్తల ధర్శనం కొరకు సత్సంగ సదనం నుంచి గాంధీ విగ్రహాం గుండా మూడు తొవ్వల వరకు. అక్కడి నుంచి మళ్ళీ అదే మార్గం గుండా సత్సంగ సదనం దాకా భక్తిశ్రద్ధలతో భక్తి పాటలతో వైకుంఠ రథంపై ఊరేగింపు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు.