ముఖ్యమంత్రి కేసిఆర్ పెద్ద మనసు మరోసారి చాటుకున్నారు. పద్మశ్రీ దర్శనం మొగిలయ్యను అయన ఎవరూ ఊహించని విధంగా సన్మానించారు. వారు స్థిరపడటానికి కోటి రూపాయల సహాయాన్ని సగౌరవంగా ప్రకటించారు.
నిన్న మొన్నటిదాకా దర్శనం మొగిలయ్యను యాచకుడిగా చూసిన వారు ఆ కళాకారుడికి దక్కిన పద్మశ్రీయే ఒక వింత అనుకుంటుండగా కెసిఆర్ గారు అతడి అదృష్టానికి ముక్కుమీద వేలువేసుకునే స్థితి కల్పించారు. కష్టకాలం దాటి కలిసి వచ్చిన కాలానికి ఉదాహరణ తెలంగాణా రాష్ట్రమూ అందులో నేటి మన మొగిలయ్యకు దక్కిన సత్కారం అంటే అతిశయోక్తి కాదు. శెభాష్ కెసిఆర్. అభినందనలు మొగిలయ్యా…
ముఖ్యమంత్రి చొరవ, మొగిలయ్యకు దక్కిన పద్మశ్రీ అనేక విధాలా కళాకారులకు ఆత్మబలాన్ని అందించడం ఖాయం.
ఇదీ వార్త
పద్మశ్రీ గ్రహీత మొగులయ్య గారికి తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో సొంత స్థలం తో పాటు నిర్మాణ ఖర్చు ఇతర అవసరాల కోసం కోటి రూపాయలను తెలంగాణ సీఎం కేసీఆర్ గారు ప్రకటించడం విశేషం. ఇందుకు సంబంధించి మొగులయ్య గారితో సమన్వయం చేసుకోవాలని కావలసిన ఏర్పాట్లు చూసుకోవాలని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ఇటీవలే పద్మశ్రీ అవార్డు పొందిన మొగులయ్య గారు ప్రగతిభవన్లో తెలంగాణ సీఎం కేసీఆర్ గారిని కలిసారు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం గర్వపడేలా గొప్ప కళారూపాన్ని రూపాన్ని కాపాడుతున్న మొగులయ్య గారిని అభినందించారు. ఇప్పటికే వారికి తెలంగాణ ప్రభుత్వం గౌరవ వేతనం కూడా ఇస్తున్నదని చెబుతూ వారికి పద్మశ్రీ అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. కళా కళాకారులను ప్రోత్సహించడంలో తెలంగాణ పర్యాటక మంత్రిగారు కీలకపాత్ర పోషించాలని తెలంగాణ సీఎం కెసిఆర్ గారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి గౌరవ శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే గువ్వల బాల్ రాజ్ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
దర్శనం మొగిలయ్యకు మనమే కృతజ్ఞతలు చెప్పుకోవాలి అంటూ నిన్న తెలుపు రాసిన ప్రచురించిన కథనం చదవండి : కిన్నెర మొగిలయ్య మనకు థాంక్స్ చెప్పాలా? తెలుపు సంపాదకీయం