Editorial

Monday, December 23, 2024
Opinion"Konda Polamపై మా నమ్మకం వమ్ము కాలేదు" - జంపాల చౌదరి 

“Konda Polamపై మా నమ్మకం వమ్ము కాలేదు” – జంపాల చౌదరి 

కొండపొలం నవల మొదటిసారి చదివినప్పుడు కలిగిన ఉత్కంఠ, ఉద్వేగం సినిమా చూస్తున్నప్పుడు కూడా కలిగాయి (ఈసారి కథంతా తెలిసినా). నవలను తెరకెక్కించటంలో దర్శకుడు కృతకృత్యుడయ్యాడనడానికి ఇంకా వేరే ఋజువేం కావాలి?

జంపాల చౌదరి 

“…పుస్తకాలు చలనచిత్రాలుగా మారే క్రమంలో చాలా మార్పులు జరగటం సహజం. ఐనా, పుస్తక రచయిత స్వయంగా చిత్రనిర్మాణ క్రమంలో భాగం అయినప్పుడు, ఉత్తమ అభిరుచులతో చిత్రాల్ని రూపొందించిన దర్శకుడు సారథ్యం వహిస్తున్నప్పుడు, ఈ నవలలోని ఆత్మ చిత్రంలో కూడా ప్రతిఫలిస్తుందని మా నమ్మకం…” – కొండపొలం రెండవ ముద్రణకు ప్రచురణకర్తల ముందుమాట

మా నమ్మకం వమ్ము కాలేదు.

నవల, సినిమా రెండూ సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచనలే.
ఇది క్రిష్ సినిమా కూడా.

కొండపొలం గొప్ప తెలుగు నవల. కొండపొలం గొప్ప తెలుగు సినిమా. ఈ సినిమాలో చాలామంది హీరోలు. ఒక ముఖ్యమైన హీరో సంగీత దర్శకుడు కీరవాణి

కొండపొలం గొప్ప తెలుగు నవల.
కొండపొలం గొప్ప తెలుగు సినిమా.

ఒకదానికొకటి కాపీ కాదు; కాని రెండూ ఒకటే.
నవల నుంచి కూడికలూ, తీసివేతలూ ఉన్నా, సినిమా లెక్క చక్కగా సరిపోయింది.

ఈ సినిమాలో చాలామంది హీరోలు. ఒక ముఖ్యమైన హీరో సంగీత దర్శకుడు కీరవాణి (good songs; great background score). ఇంకొకరు కెమెరామన్ జ్ఞానశేఖర్ (great visuals in a difficult terrain). సినిమాని థియేటర్లో చూడండి. పెద్దతెర, మంచి సౌండ్ సిస్టం ఉంటేనే సరైన అందం, ఆనందం.

ఇంకా సాయిచంద్, రవిప్రకాష్ (best performance in his career), ఆంటోనీ, వైష్ణవ్ తేజ్, కోట శ్రీనివాసరావు, హేమ, అన్నపూర్ణ, మిగతా గొర్రెల కాపరుల పాత్రధారులు, గొర్రెలు, పెద్దనక్క, అందరూ పాత్ర నిడివితో సంబంధం లేకుండా బాగా నటించారు. రకుల్ ప్రీత్ సింగ్ నటించగలదు తెలుసా? ఆ అమ్మాయి అందంగా కనిపించడానికి అల్ట్రామోడర్న్ బట్టలు అవసరం లేదని, కొద్ది మేకప్ చాలని ఇవాళ తెలిసింది.

Thank you Sannapureddy Venkataramireddy and Krish!

కొండపొలం నవల మొదటిసారి చదివినప్పుడు కలిగిన ఉత్కంఠ, ఉద్వేగం సినిమా చూస్తున్నప్పుడు కూడా కలిగాయి (ఈసారి కథంతా తెలిసినా). నవలను తెరకెక్కించటంలో దర్శకుడు కృతకృత్యుడయ్యాడనడానికి ఇంకా వేరే ఋజువేం కావాలి?

Thank you Sannapureddy Venkataramireddy and Krish!
We wish you, and the film, the best of success and accolades at the highest level.
We expect even better things from you in future.

చౌదరి జంపాల తానా పూర్వ అధ్యక్షులు. తానా నవలల పోటీల్లో కొండపొలంను అత్యుత్తమ రచనగా ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులు. వారు వృత్తిరీత్యా సైకియాట్రిస్ట్. పుస్తకానికి ‘జీవనారణ్యంలో సాహసయాత్ర’ పేరిట వారు అద్భుతమైన ముందు మాట రాశారు. దాన్ని ఇక్కడ చూడండి. చిత్ర నిర్మాత, దర్శకులు వారి పేరు కూడా టైటిల్స్ లో వేయడం మంచి సంస్కారం.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article