నాటు మందులు
నా చిన్నప్పుడు జ్వరమొస్తే, మా అమ్మ తాటిబెల్లం కలిపిన వేడివేడి మిరియాల కషాయం అరగ్లాసుడు తాపిచ్చేది. అయిదు పదినిమిషాల్లో జ్వరం విడిచి చమటలు పోసేవి. ఇక పడక నుంచి లేసి తిరగటమే పని. దగ్గు, జ్వరం , జలుబులకి మా అమ్మ వాడిన ఈ దివ్యౌషధం నేటికీ మా అమెరికా డాక్టర్ అమ్మాయి తనూ వాడుతుంది.
మా నాయనమ్మ కి అంతకి మించిన వైద్యాలు తెలిసుండేవి. కళ్ళ కలక కి చనుబాలు చుక్కల వైద్యం, మోకాళ్ళ నెప్పులకి చింతపండు పట్టు వైద్యం, అజీర్ణానికి వాము కలిపి న వేడి నీళ్ళు, మధుమేహానికి నూరిన వేప చిగురు వుండలు. ఇలా ఎన్నో. ఆమె ఆరొగ్యంగా తొంభైయైదేళ్ళు సుఖంగా జీవించింది.
ఆమె ఇంగ్లీషు మందులెప్పుడూ తినలేదూ, ఇంజెక్షన్లు పొడిపించుకోనూ లేదు.
నేటి వైద్యం అంటేనే అవి నాటుమందులూ, చూర్ణాలూ, చేదు కషాయాలూ, అన్నిటికి మించి పత్యాలూ.. అంచేత జనం దానిని చిన్న చూపు చూసి ఇంగ్లీషు మందుల మోజులో పడిపోయారు.
ఇప్పుడు ప్రపంచ జనావళిని వైరసులు వేధిస్తున్నాయి. కొరోనా జనాలని చంపుతున్నది. వైరసులు కొత్తగా వచ్చినవి కావు. వేల సంవత్సరాల క్రితం మన వైద్యులు మూలికలతో విరుగుడు మందులు కనిపెట్టి మానవాళిని కాపాడారు. ఆ మందులు కొన్ని ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి. అందుకు నిదర్శనం క్రిష్నపట్నం వైద్యుడు ఆనందయ్య గారి ఔషధ ప్రక్రియే. కొరోన నయం చేస్తున్నాడని జనం చెబుతున్నారు.
మన ఆరోగ్యానికి కావలసిన అన్ని మందులూ వన మూలికల ద్వారా లభ్యం ఔతాయని ఆయుర్వేద వైద్య శాస్త్రం చెబుతున్నది. మనం నమ్మాలి.
నాటు మందులు అంశం పై జయదేవ్ బాబు గారు కార్టూన్ అద్భుతంగా వుంది. కందుకూరి రమేష్ బాబు గారి తెలుపు పత్రిక పాఠకులు మెచ్చేదిగా వుంటుందనడంలో సందేహంలేదు.
కళాసాగర్, editor
http://www.64kalalu.com