Editorial

Monday, December 23, 2024
వ్యాసాలుHuzurabad By-Election 2021 : కారు గుర్తుకు రొట్టెల పీటతో తలనొప్పి!

Huzurabad By-Election 2021 : కారు గుర్తుకు రొట్టెల పీటతో తలనొప్పి!

కారు గుర్తును పోలిన చపాతీ రోలర్ గుర్తు వలన తమకు నష్టం జరిగిందని టీఆరెస్ శ్రేణులు దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో వాపోయాయి. ఇప్పుడు ఆ విషయం మరోసారి వార్తల్లోకి వస్తోంది.

మంద భీంరెడ్డి

ఒక్కోసారి ఒక్క ఓటు కూడా ముఖ్యమే. అటువంటిది కారు గుర్తు, రొట్టెల పీట (చపాతీ రోలర్) గుర్తు చూడటానికి కాస్త ఒకే విధంగా ఉండటంతో హుజురాబాద్ నియోజకవర్గంలో (Huzurabad By-Election 2021) టీఆర్ఎస్ కి పిసరంత నష్టం జరిగే అవకాశమూ లేకపోలేదు.

ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నికలో ‘చపాతీ రోలర్’ గుర్తుపై ప్రజా ఏక్తా పార్టీ అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్ పోటీ చేస్తున్నారు. మరి ఈ అభ్యర్థి ఎన్ని ఓట్లు సాధిస్తాడో చూడాలి.

నిజానికి ఎన్నికల కమీషన్ ‘ఫ్రీ సింబల్స్’ జాబితాలో చేర్చిన ఎన్నికల గుర్తు ‘Rolling pin with board’ (రొట్టెల పీట, కర్ర) లేదా ‘చపాతీ రోలర్’ ను ఇండిపెండెంట్  లేదా రిజిస్టర్డ్ పార్టీ అభ్యర్థులు కోరుకోవచ్చు. ఆ విధంగా 2020 దుబ్బాక ఉప ఎన్నికలలో ‘చపాతీ రోలర్’ గుర్తు పొందిన బండారు నాగరాజు అన్న అభ్యర్థి 3,570 ఓట్లు సాధించి నాలుగవ స్థానంలో నిలవడం తెలిసిందే. నిజానికి బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు అంతకంటే తక్కువ అంటే 1,079 ఓట్ల మెజారిటీతో గెలిచిన విషయమూ మీకు గుర్తుండే ఉంటంది. ఈ ఫలితాల వల్ల కారు గుర్తును పోలిన చపాతీ రోలర్ గుర్తు వలన తమకు నష్టం జరిగిందని టీఆరెస్ శ్రేణులు అప్పట్లో వాపోయాయి కూడా. ఇప్పుడు ఆ విషయం మరోసారి వార్తల్లోకి వస్తోంది.

ఒక రకంగా ఐడెంటికల్ గుర్తులపై టీఆర్ఎస్ ఈసీతో పోరాడుతూనే ఉందని చెప్పాలి. కానీ ఎన్నికల సంఘం మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థనల్ని పట్టించుకోలేదు.

ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నికలో ‘చపాతీ రోలర్’ గుర్తుపై ప్రజా ఏక్తా పార్టీ అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్ పోటీ చేస్తున్నారు. విశేషం ఏమిటంటే, గడిచిన మూడేళ్ళలో ఆరు ఎన్నికల్లో పోటీ చేసిన అతడు ప్రచారం  చేయకుండానే ఓట్లు సాధిస్తున్నాడు. మరి ఈ అభ్యర్థి ఎన్ని ఓట్లు సాధిస్తాడో చూడాలి. ఇది టిఆర్ఎస్ విజయావకాశాలపై ఏమైనా ప్రభావం చూపుతుందా? అంటే నవంబర్ 2న ఫలితాల దాకా వేచి చూడవలసిందే.

నిజానికి కారును పోలిన గుర్తులనుస్వతంత్ర అభ్యర్థులకు కేటాయించరాదని, కారును పోలిన గుర్తుల్ని బ్యాన్ చేయాలని, ఒక రకంగా ఐడెంటికల్ గుర్తులపై టీఆర్ఎస్ ఈసీతో పోరాడుతూనే ఉందని చెప్పాలి. కానీ ఎన్నికల సంఘం మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థనల్ని పట్టించుకోలేదు.

  • మంద భీంరెడ్డి పూర్వ పాత్రికేయులు, ప్రవాసి సంక్షేమ వేదిక అధ్యక్షులు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article