బతుకమ్మ ఎంత చల్లని ఆశీర్వాదం. ‘నూరేండ్లు బతుకమ్మా’…. ‘నీ కడుపు సల్లగుండ’…ఎంత చక్కని దీవెనలు!
బి.కళాగోపాల్
బతుకమ్మ అంటేనే పిల్లా, పెద్దల సంబురం. బతుకు సంబురం.
తీరొక్క పూవోలె మెరిసిపోయే బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డల అస్తిత్వం.
ఒక్కో మహిళ సృజనాత్మకంగా తయారు చేసుకొనే విరిబాలల కన్నుల పండుగ మహోత్సవం- బతుకమ్మ.
రాశి పోసినట్లుండే పూల సౌందర్యమే మన బతుకమ్మ.
శరన్నవరాత్రుల్లో ఆడే బతుకమ్మలు స్త్రీత్వానికి, ప్రకృతి, పురుషుల జీవన సౌందర్యానికి, శివపార్వతుల ఆధ్యాత్మిక, పారమార్థిక చింతనకి ప్రతీకలు.
ఇక పాటల గురించి ఎంత చెప్పినా తక్కువే. సద్దుల బతుకమ్మ రోజు డప్పుల కోలాహలం, లయబద్దమైన చప్పట్లు, తేలికైన చిన్న పదాలు, అర్థవంతంగా ఇతివృత్తాన్ని వివరిస్తూ సాగే పాటలు, అందలి ద్విపద, అంత్యవూపాస, ముక్తపదక్షిగస్తాలు మనల్ని ఆనంద వివశుల్ని చేస్తయి.
బతుకమ్మని శ్రీమహాలక్షి, మహా సరస్వతి, మహాకాళి అవతారాలుగా భావించి పూజిస్తారు. ఈ తొమ్మిది రోజులు పార్వతీదేవి పుట్టింటికి వచ్చినట్లు భావిస్తారు.
తొమ్మిదో రోజు నిమజ్జనం కాగానే పార్వతీదేవి శివునిలో ఐక్యమయినట్లు భావిస్తారు.