Editorial

Monday, December 23, 2024
ఆధ్యాత్మికంబక్రీద్ ప్రాముఖ్యత తెలుపు - షేక్ అస్లాం షరీఫ్

బక్రీద్ ప్రాముఖ్యత తెలుపు – షేక్ అస్లాం షరీఫ్

ముస్లింలకు ఉన్నటువంటి ముఖ్యమైన పండుగలలో ఒకటి రంజాన్ కాగా, మరొకటి బక్రీద్. ఈ బక్రీద్ పండుగను త్యాగానికి ప్రతీకగా చెబుతారు. బక్రీద్ పండుగకు ప్రామాణికం ముస్లింల పవిత్ర గ్రంధమైన దివ్యఖురాన్. ఈ పండుగను ఈదుల్ అజహా, ఈదుల్ జుహా అని కూడా పిలుస్తారు.

షేక్ అస్లాం షరీఫ్

వివిధ ప్రపంచ దేశాలలో ఈ బక్రీద్ పండుగను వివిధ పేర్లతో పిలుస్తారు. ఇరాన్ ముస్లింలు దీనిని అతి ముఖ్యమైన పండుగగా జరుపుకుంటారు. ఈ బక్రీద్ పండుగను మూడు రోజుల వరకు జరుపుకుంటారు. రంజాన్ పండుగ అయిపోయిన 70 రోజుల తరువాత ఈ పండుగను జరుపుకుంటారు.

అల్లాహ్ ఇస్లాం గురించి ప్రజలకు తెలియజేయడానికి ఈ భూప్రపంచం పైకి చాలా మంది ప్రవక్తలను పంపినారు. అలా పంపిన ప్రవక్తలలో ఇబ్రహీం ప్రవక్త ఒక్కరు. ఈయన హిజ్రీ శకానికి 2510 సంవత్సరాల పూర్వం ఇరాక్ ప్రాంతంలో జన్మించారు. ఇబ్రహీం ప్రవక్తను అల్లాహ్ ఎన్నో విధాలుగా పరిక్షించాడు. అన్నింటిలో అమిత విశ్వాసంతో నెగ్గి ఆయన వినయవిధేయలతో అల్లాహ్ ను మెప్పించి గొప్ప ప్రవక్తగా పేరు పొందారు. అల్లాహ్ ఆదేశం ప్రకారం ఇబ్రహీం ప్రవక్త తన కుమారుడైన ఇస్మాయిల్ ని బలి యివ్వడానికి తీసుకెళ్ళే సాంప్రదాయాన్ని స్మరిస్తూ ప్రపంచంలోని ముస్లిం సోదరులు ఈ పండుగను జరుపుకుంటారు. ఈదుల్-ఫితర్ అంటే రంజాన్ పండుగ మాదిరి బక్రీద్ పండుగ యొక్క నమాజ్ “ఈద్-గా” లో జరుగుతుంది.

సమాజంలో పేరుకుపోతున్న రుగ్మతల నుంచి జనావళిని జాగృత పరుస్తూ సన్మార్గంలో నడిపెంచేందుకు అల్లాహ్ భూమండలానికి 80 వేల మంది ప్రవక్తల్ని పంపినట్లు ముస్లింల ఆరాధ్య గ్రంధం దివ్య ఖురాన్ చెబుతుంది. వారిలో ఒకరు ఇబ్రహీం ప్రవక్త. ఇతడు మక్కా పట్టణమును నిర్మించి ప్రజలు నివసించేలా చేసాడు. అల్లాహ్ ఆరాధన కొరకు కాబా అనే ఆలయము కూడా కట్టించిన దైవ ప్రవక్త.

ప్రవక్త తన ఏకైక పుత్రుడిని నేలపై పడుకోబెట్టి, భక్తితో బలి చెయ్యడానికి ఉపక్రమిస్తాడు. దాంతో దేవుడు అతని త్యాగభుద్ధికి, దైవ ప్రీతికి మెచ్చి జిబ్రాయిల్ ద్వారా దుంబను పంపి, ఖుర్భాని ప్రక్రియ భక్తులకు భోధిస్తుంది.

ఇబ్రహీం ప్రవక్తకు వివాహమైన కొన్ని సంవత్సరాల వరకు సంతానం కలగలేదు. సంతానం కొరకు కొంత కాలానికి ఇబ్రహీం ప్రవక్త హజీర అనే ఆమెను వివాహం చేసుకుంటాడు. ఆమె కొద్ది నెలలు గడిచిన తరువాత ఇస్మాయిల్ కు జన్మనిచ్చింది. ఇస్మాయిల్ తండ్రికి తగ్గ తనయుడు. ఇస్మాయిల్ కు తండ్రి మాటలపై, అల్లాహ్ పై పూర్తి విశ్వాసం ఉంటుంది. కొన్ని రోజులు గడిచిన తరువాత ఇస్మాయిల్ ను బలి ఇవ్వమని అల్లాహ్ ఇబ్రహీం ప్రవక్తని ఆజ్ఞాపించాడు. వెంటనే మారు మాట్లాడక ఇబ్రహీం ప్రవక్త తన కుమారుడైన ఇస్మాయిల్ ని బలి చేయడానికి సిద్ధపడి ఈ విషయాన్ని అతనికి తెలుపుతాడు. తక్షణం అల్లాహ్ ఆజ్ఞను శిరసావహించి, అంగీకరించి తండ్రి మాటలను నిజం చెయ్యడానికి సిద్ధం అవుతాడు. అప్పుడు ఇబ్రహీం ప్రవక్త తన ఏకైక పుత్రుడిని నేలపై పడుకోబెట్టి, భక్తితో బలి చెయ్యడానికి ఉపక్రమిస్తాడు. దాంతో దేవుడు అతని త్యాగభుద్ధికి, దైవ ప్రీతికి మెచ్చి జిబ్రాయిల్ ద్వారా దుంబను పంపి, ఖుర్భాని ప్రక్రియ భక్తులకు భోధిస్తుంది.

బక్రీద్ పండుగ నాడు మక్కాలో హాజ్ యాత్ర జరుగుతుంది. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవత్ర ఉన్నందువల్ల మనదేశం నుంచి హాజ్ యాత్రకు ఎవరు కూడా వెళ్ళడం లేదు.

బక్రీద్ పండుగ నాడు మక్కాలో హాజ్ యాత్ర జరుగుతుంది. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవత్ర ఉన్నందువల్ల మనదేశం నుంచి హాజ్ యాత్రకు ఎవరు కూడా వెళ్ళడం లేదు. మక్కాలో కేవలం స్థానికులకు మాత్రమే ఈ సారి హాజ్ యాత్రకు అనుమతి యిచ్చారు.

బక్రీద్ పండుగనాడు జరిపే ప్రత్యేక నమాజ్ సాధ్యమైనంత త్వరగా అంటే పది గంటలలోపే చదివేస్తారు. ప్రతి ముస్లిం పండుగ నాడు నమాజ్ చదవడానికి సాధ్యమైనంత వరకు ఏమి తినకుండా వెళ్లుతారు. పండుగ నమాజ్ అయిపోయే వరకు జింక సైతం బిడ్డకు పాలు యివ్వకుండా ఒంటి కాలుపై నిలబడి ఉంటుందని హదీసుల ద్వారా తెలుస్తుంది.

ప్రతి ముస్లిం బక్రీద్ పండుగకు తన స్థాయిని బట్టే ఖుర్భాని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. ఖుర్భాని ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరిలో దానగుణం పెరుగుతుందని మత గ్రంధాల ద్వారా తెలుస్తుంది.

ప్రతి ముస్లిం బక్రీద్ పండుగకు తన స్థాయిని బట్టే ఖుర్భాని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. ఖుర్భాని ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరిలో దానగుణం పెరుగుతుందని మత గ్రంధాల ద్వారా తెలుస్తుంది. ఆలాగే పేదలను ఈ ఖుర్భాని ద్వారా ఆదుకోవడానికి వీలవుతుందని గ్రంధాలు తెలుపుతున్నాయి.

కోడి కానీ, కోడి పుంజు కానీ ఖుర్భానిగా ఇవ్వకూడదు. ఖుర్భానిగా మేక, గొర్రె పొట్టేలు ఇంకా పెద్ద జంతువులు ఇవ్వవచ్చును. ఖుర్భానిగా ఇచ్చే జంతువు ఎలాంటి జబ్బుతో బాధ పడకుండా ఆరోగ్యవంతముగా ఉండాలి. ప్రపంచములోని లక్షలాది ముస్లింలు బక్రీద్ పండుగ నాడు ఖుర్భాని ఇస్తారు. బక్రీద్ పండుగ నాడు ప్రతి ముస్లిం తన శక్తి మేరకు ఖుర్భాని ఇవ్వాలని ఆశిద్దాం.

వ్యాసకర్త రచయిత, సంఘ సేవకులు. ప్రధానంగా హాస్య రచనలు చేస్తారు. నివాసం శాంతినగర్. మొబైల్ 9441167616

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article