Editorial

Wednesday, January 22, 2025
కథనాలుఆషాడమంతా అమ్మతల్లి జాతరలే..

ఆషాడమంతా అమ్మతల్లి జాతరలే..

బహుశా ప్రపంచంలో ఏ పండుగా నెలరోజుల పాటు జరుగదు. కాని తెలంగాణ బోనాలు మాత్రం ఆషాఢ మాసం నుంచి శ్రావణం చివరిదాక జరుపుకుంటారు.

మానవులు నాగరికత నేర్చి, గ్రంథాలు రచించిన కాలంలోనే, అత్యంత ప్రాచీన దశలో ఆదిమ మానవులు, దైవభావనకు అంతర్గత రూపమిచ్చారు. అది నిరాకార భావన. అందుకే గ్రామ దేవతలకు విగ్రహాలు ఉండవు. గుళ్లుండవు. ఆదిమానవులు వర్షం వచ్చినా, ఉరిమినా, మెరిసినా భయపడేవారు. భయం భక్తికి మూలం కాబట్టి భయంతో ప్రారంభమైన ఆరాధన భక్తిగా నిలిచింది. అందువల్ల ‘‘అమ్మలా’ ఆపదల నుండి గట్టెక్కించేది ఎవరని ఆలోచించారు. తమను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడే ‘అమ్మ’నే తొలి దైవం చేశారు. అందువల్లే గ్రామదేవతలంతా తల్లిదేవతలే.

అయితే, అమ్మకు మాత్రం ఆకలి దప్పులుండవా! అందువల్ల ఆమెను కన్న కొడుకుల్లా, కడుపులో పుట్టిన సంతానం కనిపెట్టుకొని, కడుపు నిండా పెట్టాలి కదా, కాబట్టి ‘బోనాలు’ పండుగ పేర ప్రతి ఆషాఢంలో అమ్మతల్లికి జాతరలు జరుపుతుంటారు.

తెలంగాణ పండుగలు రెండూ గ్రామీణ జీవన నేపథ్యం కావడం విశేషం. ఒకటి బోనాలు (ఆషాడం) రెండు బతుకమ్మ (ఆశ్వీయుజ మాసం).

మరి ఆషాఢ మాసమే ఎందుకంటే, వర్షాలు కురిసి వ్యాధులు విజృంభిస్తాయి. మరోవైపు గ్రామీణులు ఎవుసం మొదలు పెట్టేది ఇప్పుడే. అందుకే, ‘తమ పిల్లా పాపా గోడు గోదా, పాడి పంటా, చల్లగా కాపాడుతల్లీ’ అంటూ మొక్కులు తీర్చుకుంటారు.

బహుశా ప్రపంచంలో ఏ పండుగా నెలరోజుల పాటు జరుగదు. కాని తెలంగాణ బోనాలు మాత్రం ఆషాఢ మాసం నుంచి శ్రావణం చివరిదాక జరుపుకుంటారు.

తెలంగాణ పండుగలు రెండూ గ్రామీణ జీవన నేపథ్యం కావడం విశేషం. ఒకటి బోనాలు (ఆషాడం) రెండు బతుకమ్మ (ఆశ్వీయుజ మాసం).

బోనం అంటే భోజనం. అమ్మతల్లికి పెట్టే నైవేధ్యం (భోజనం). బువ్వబీ. ఇది అత్యంత భక్తి శ్రద్ధలతో, ఊరేగింపుగా ఊరుమ్మడిగా కలసి వెళ్లి ఊరి బయట గల గ్రామ దేవతలకు సమర్పించేది.

తెలంగాణ ఆత్మ. అంతరాత్మ ఎంత చల్లనిదో, ఎంత ఆత్మీయత కలదో, ఈ పండుగ నిరూపిస్తుంది.

తెలంగాణ ఆత్మ. అంతరాత్మ ఎంత చల్లనిదో, ఎంత ఆత్మీయత కలదో, ఈ పండుగ నిరూపిస్తుంది. ఎక్కడ ఉన్నా, కుటుంబమంతా ఈ పండుగ వేళ ఒక్కటవుతారు. కలసి మురిసి పండుగ చేసుకుంటారు. ఊరంతా ఉమ్మడిగా ఊరేగింపుగా సాగుతారు. పల్లెంతా పండుగ వాతావరణం నెలకొంటుంది.

మరో విధంగా చెప్పాలంటే, పట్నం మరువని పండుగ ఇదే. నేటికీ జరుగుతున్న ‘లష్కర్ బోనాలే’. ఇందుకు మంచి ఉదాహరణ, పెద్దమ్మ తల్లి దేవాలయాలే అందుకు ప్రత్యక్ష నిదర్శనాలు, పల్లె జీవులు ఎంత నిబద్ధత కలిగిన వాలో దీనివల్ల తెలుస్తుంది. బడుగుజీవుల కాలనీల్లో తప్పక ‘అమ్మతల్లుల దేవాలయాలు కనిపిస్తాయి. ఇది ఆధునిక చింతనలో ఒక భాగం అని చెప్పాలి.

జానపద దేవతలైన గ్రామ దేవతలకు గుళ్లు-గోపురాలు ఉండవు. తమకు నీడనిచ్చే చెట్టే అమ్మకు నీడనిస్తుంది. ఆమెను ఆమే కాపాడుకుంటుంది. ‘రక్షణ! ఎందుకు ?’ అనుకుంటారు. ‘వేయిగండ్ల తల్లి పోచవ్వ తల్లి’ అని భావిస్తారు.

జానపద దేవతలైన గ్రామ దేవతలకు గుళ్లు-గోపురాలు ఉండవు. తమకు నీడనిచ్చే చెట్టే అమ్మకు నీడనిస్తుంది. ఆమెను ఆమే కాపాడుకుంటుంది. ‘రక్షణ! ఎందుకు ?’ అనుకుంటారు. ‘వేయిగండ్ల తల్లి పోచవ్వ తల్లి’ అని భావిస్తారు.

గ్రామదేవతలు, ఏడుగురుబీ స్త్రీ మూర్తులు. ప్రపంచమంతా స్త్రీ మూర్తుల ఆరాధన ఉంది. మెక్సికోలో ధాన్యదేవత, బొంగా దీవులలో ‘ఆలో అలో’ దేవి, గ్రీసులో ‘డెమిటర్’, రోమనులు ‘పెరిన్’ అనే పంట దేవతను పూజిస్తారు.

స్త్రీ సంతాన సంరక్షకురాలు మాత్రమే కాదు, మానవుల అతి ముఖ్యావసరం ‘అన్నం’ (ఆహారం) కనిపెట్టింది కూడా స్త్రీ. ఆదిమ మానవుల కాలంలో మగవారు వేటకు వెళ్లగా ఆడవాళ్లు ఇంటిపట్టున ఉండి వర్షానికి మొలకెత్తిన ధాన్యాన్ని చూశారు. తాము అదే విధంగా విత్తనాన్ని వేస్తే ఫలిస్తుందని భావించిన సృజనాత్మకత వారిది. అందువల్ల తొలుత వ్యవసాయం కనిపెట్టింది స్త్రీలే అనాలి. మగవాళ్లలో స్త్రీ మూర్తి ఆరాధనాభావానికి ఇదో కారణం. రెండోది, సంతానాన్ని అందించి, సంరక్షించేది స్త్రీలే కాబట్టి వారు పూజ్యనీయులయ్యారు.

‘ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలుంటారు’అంటాడు మనువు, కానీ, జానపదులు స్త్రీలను దేవతలుగా తలచి, కొలచి ఆరాధించారు. వాళ్ల దృష్టిలో వారే దేవతలు.

‘ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలుంటారు’అంటాడు మనువు, కానీ, జానపదులు స్త్రీలను దేవతలుగా తలచి, కొలచి ఆరాధించారు. వాళ్ల దృష్టిలో వారే దేవతలు. ఒక్కొక్క ఆపదకు, ఒక్కో దేవత, ఒక్కొక్క విషయానికి ఒక్కో దేవతను ఆరాధించారు. ఈ విధంగా తెలుగునాట లెక్కకు మిక్కిలి గ్రామ దేవతలున్నారు. తెలంగాణలో చాలా చోట్ల పోచమ్మ, మైసమ్మ, బాలమ్మ, ఎల్లమ్మ దేవతల ఆరాధన చాలాచోట్ల కనిపిస్తుంది. వీరు ఏడుగురు అక్కచెల్లెండ్లుగా, వీరికి తోడు పోతురాజు తమ్ముడని గాథ.

పోచమ్మ, మైసమ్మ, బాలమ్మ, ఎల్లమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మ. తరువాత వైదిక కాలంలో వీరే ‘సప్త మాతృక రూపాలకు మూలమయ్యారని భావించాలి.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article