Editorial

Wednesday, January 22, 2025
సామాన్యశాస్త్రంమానవుడిని తెలుపే గురజాడ

మానవుడిని తెలుపే గురజాడ

దేశం అంటే మట్టి కాదు, మనుషులు అన్న మహాకవి మాదిరి ఇతడు భూమి కాదు, అంతరిక్షం కాదు, మానవుడి అంతరంగం వినాలని బయలుదేరిన గురజాడ.

కందుకూరి రమేష్ బాబు

ఒక సందేహం వచ్చేదాకా అతడు మామూలు మనిషి. తర్వాత అతడు మహారుషి. నిజమే మరి. ఈ దర్శకుడు, ఫోటోగ్రాఫర్ నాలుగు దశాబ్దాలుగా ఈ భూమండలాన్ని చుట్టి చిత్రాలుగా, వీడియోలుగా దృశ్యీకరించి పెట్టాడు. Aerial photography ద్వారా మనం ఎన్నడూ చూడని రీతిలో భూమి, అందులో మనిషిని ఎంతో చక్కగా చూపించాడు. Earth from above అన్నది అయన రూపొందించిన ఒక గొప్ప సినిమా. చిరస్మరణీయ ప్రయత్నం.

ఇంత తిరిగి, అంతా చూసి వారు తెలుసుకున్నది ఏమిటీ అంటే ‘ఈ ధరణిపై మనిషి పురోగమిస్తున్నాడంటే నమ్మలేను’ అని!

ఇంత తిరిగి, అంతా చూసి వారు తెలుసుకున్నది ఏమిటీ అంటే ‘ఈ ధరణిపై మనిషి పురోగమిస్తున్నాడంటే నమ్మలేను’ అని! “ఈ నవీన మానవుడి ప్రగతి అందరం కలిసికట్టుగా జీవించడానికి దోహదపడటం లేదూ” అని! అంతేనా? కాదు, మానవత్వం రోజురోజుకూ పరిమళిస్తున్నదీ అంటే సందేహమే’ అని!

కుండ బద్దలు కొట్టినట్టు చెప్పెసాడాయన.

“I have the feeling that humanity is not making any progress” అని ఎంతో ఆవేదనతో చెప్పిన అయన ‘ఎందుకిలా?’ అని అడిగి ఊరుకోలేదు.

ఈ సందేహం అతడిని నిలువనీయలేదు. ఒక్కసారిగా అప్పటిదాకా తాను చేస్తున్న పనిని ఆపేలా చేసింది. అతడ్ని ఎన్నడూ లేనట్టు మౌలోకమైన ఆలోచనల్లో పడేసింది. ఆ ఆలోచన అతడిని EARTH పై పనిచేయడం ఆపి ‘మనిషి’పై పని చేయడం మొదలెట్టేలా చేసింది. ఆదే HUMAN ప్రాజెక్టు.

“I have the feeling that humanity is not making any progress” అని ఎంతో ఆవేదనతో చెప్పిన అయన ‘ఎందుకిలా?’ అని అడిగి ఊరుకోలేదు. జవాబు వెతికేందుకు గొప్ప మేధావిలా లెక్కలు, గణాంకాలవైపు పోకుండా మనిషి పై ఆధారపడ్డాడు.

నిజమే. మనిషి తనకు ఒక సూచీ. కొలమానం. అందుకే ఒక్కో మనిషిని ముఖాముఖి చేస్తూ, మానవత్వం పై మనకున్న విశ్వాసాన్ని తొలగించే ప్రయత్నం చేయడం మొదలెట్టాడు. అదే సమయంలో మనవీయతపై అపారమైన విశ్వాసాన్ని ప్రోదిచేశాడు.

ఈ అసాధారణ ప్రయత్నం, దాని పుట్టుక పుట్టుక గురించి ఇక్కడ వినండి. https://www.youtube.com/watch?v=qUWrdnbOEOQ&t=23s

మానవుడిని వినడం అన్నది కదా అసలు యానం అని అర్థం చేసుకున్నాడు. అదే ధరణి, ప్రపంచం, అంతరిక్షం అనుకున్నాడు.

మానవుడిని వినడం అన్నది కదా అసలు యానం అని అర్థం చేసుకున్నాడు. అదే ధరణి, ప్రపంచం, అంతరిక్షం అనుకున్నాడు. ఇందుకోసం అయన ఒక సరళమూ సాధారణమూ అయిన విధానాన్ని అవలంభించాడు. నలుపు బ్యాక్ గ్రౌండ్ లో ఒక మనిషి సూటిగా మన కళ్ళలోకి చూస్తూ తన గాథ చెప్పడాన్ని అయన రికార్డ్ చేయడం మొదలెట్టాడు. ఇదొక బృహత్తర ప్రయత్నం. ఇందుకోసం 17 మంది కెమెరామెన్లు, నలుగురు ఎడిటర్లు, మరికొంత మంది సిబ్బందితో అయన ఈ పనిలోకి దిగి, కనీసం రెండువేలకు పైగా వ్యక్తుల గాథలను పరిచయం చేశాడు.

అవి ఎంత అద్బుతంగా ఉంటాయి అంటే మనిషిని మనం ఎప్పుడైనా విన్నామా అనిపించేలా చేస్తాయి.
మనిషి ముఖాముఖిల వద్దే అయన ఆగిపోలేదు. మనిష ప్రధానంగా సాగే పనులే ఇక అతడి జీవితం కావడం ఎంత విచిత్రం. విచిత్రం అనడం కన్నా ఎంత సహజం అనాలి.

ఇవి చూడటం అంటే ఈ అవనీతలంలో ఎంత వైవిధ్యమైన జీవితం ఉన్నదో, అందులో మానవులు తమ మానాన తాము ఎన్ని విధాలుగా బతుకులు సాగిస్తున్నారో అర్థం అవుతుంది.

‘తన పనిలో అయన విస్తృతి మొదలెట్టాడు. రకరకాలుగా మనిషిని ఆవిష్కరించాడు. మొత్తం 11 చిత్రాలు తీశాడు. సంగీతంతో మిళితం చేసి మరికొన్ని సిరీస్ లను విడుదల చేశాడు. ఇవి చూడటం అంటే ఈ అవనీతలంలో ఎంత వైవిధ్యమైన జీవితం ఉన్నదో, అందులో మానవులు తమ మానాన తాము ఎన్ని విధాలుగా బతుకులు సాగిస్తున్నారో అర్థం అవుతుంది.

ఈ ప్రయత్నం ఎంతో విలువైనది. ఒక పుస్తకం చదవడం వల్ల కలిగే అనుభవం వంటిదే ఒక మనిషి స్వయంగా తన కథ చెప్పడాన్ని వింటుంటే కలుగుతుంది. అంతేకాదు, వీడియో మాధ్యమం కనుక ఆ మనిషి ముక్కు మొహం రంగు హావభావాలు అన్నీ మనకు హత్తుకోవడం తన ప్రయత్నం గొప్ప తనం.https://www.youtube.com/watch?v=JCEKzeGI6m4

అన్నట్టు, తాను వినిపించే ఆ మనుషులు సామాన్యులు కావచ్చు. దేశాధ్యక్షులు కావొచ్చు, కానీ ఎవరైనా ఒక మనిషిగా వ్యక్తం కావడం ఈ హ్యూమన్ ప్రాజెక్టు విశేషం. మానవుడిని తెలుపడమే అతడి కర్తవ్యం. https://www.youtube.com/watch?v=4GX6a2WEA1Q

ఇతడోక హంతకుడు. ప్రేమ గురించి అతడు చెబితే దిమ్మ తిరుగుతుంది. https://www.youtube.com/watch?v=4GX6a2WEA1Q

అన్నట్టు, ‘మనిషి’ గురించి ఆలోచించిన ఆ మనిషి పేరు Yann Arthus-Bertrand.

డెబ్బై ఐదేళ్ళ ఈ ఫ్రెంచ్ ఫోటోగ్రాఫర్, డైరెక్టర్ మానవత్వానికి నిండు నిదర్శనం. అతడు earth నుంచి human కి రావడమే కాదు, ప్రస్తుతం మనిషి తాలూకు విశిస్తమైన మావనత్వాన్ని స్నేహంగా ఆవిష్కరిస్తున్నారు.

మరిన్ని వివరాలకు: http://www.yannarthusbertrand.org/

 

More articles

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article