Editorial

Thursday, January 23, 2025
ARTSసదా స్ఫూర్తినిచ్చే చిత్రకారులు : దివంగత పెండెం గౌరీశంకర్‌

సదా స్ఫూర్తినిచ్చే చిత్రకారులు : దివంగత పెండెం గౌరీశంకర్‌

తమ ప్రతిభను ప్రదర్శనకు పెట్టుకోకుండా, కళను గొప్పగా సాధన చేసి అతి మామూలుగా జీవించిన మన ముందు తరం పెద్ద మనుషులకు, సృజనాత్మక కళాకారులకు ప్రతీక దివంగత చిత్రకారులు శ్రీ పి. గౌరీశంకర్. వారు లాండ్‌స్కేప్ పెయింటర్‌గా మంచి గుర్తింపునూ సంపాదించుకున్నరు. ఫిగరెటివ్ నుంచి నైరూప్య చిత్రకళ వరకూ సాగిన వారి కళా ప్రస్థానంలో తాంత్రిక చిత్రకళ తోడవడంతో వారు పరిపూర్ణంగా వికసించారనే అనాలి.

కందుకూరి రమేష్ బాబు

Art is an activity of the human mind under the designed principles అని పేర్కొనే పి. గౌరీశంకర్ గారు సంగీతానికి సప్తస్వరాలు ఎట్లా ఆధారభూతమో, చిత్రకళకీ అటువంటి లక్షణాలే ఉన్నాయని చెప్పేవారు. “లైన్, ఫాం, కలర్, టోన్, రిథం, బ్యాలెన్స్, టెక్చర్” అంటూ “ఆ ఏడు అంశాల సమ్మేళనమే కంపోజిషన్ ” అని బోధపరిచేవారు. వీటన్నిటి లోగుట్టు తెలియడమే కాదు, వాటిని అవిశ్రాంతంగా సాధన చేసిన అనుభవం వారి సొంతం.

తెలంగాణ చిత్రకారుల్లో తనకంటూ ఓ ప్రత్యేక శైలిని సొంతం చేసుకున్న వారిలో శ్రీ పి. గౌరీశంకర్ ఒకరు. వారు ప్రతిష్టాత్మక విద్యా సంస్థ జె.జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్, ముంబైలో డిప్లొమా చదవి, బరోడాలోని ఎంఎస్ విశ్వవిద్యాలయంలో గ్రాఫిక్ ఆర్ట్‌లో ఆయన స్పెషలైజేషన్ చేశారు. ఒక్క మాటలో వారి సాధన చేసిన సుమారు ఆరున్నర దశాబ్దాల సుదీర్గ చిత్రకళా జీవితం నేటి చిత్రకళా విద్యార్థులకు ఒక స్ఫూర్తివంతమైన పాఠ్యాంశం.

పెండెం గౌరీశంకర్‌ గారిది పద్మశాలీ కుటుంబం. తెలంగాణలోని ఘట్‌కేసర్ గ్రామం నుంచి తమ తల్లిదండ్రులు తన చిన్నతనంలోనే హైదరాబాద్ నగరానికి వచ్చారు. కులపరంగా తోడైన నిపుణతను ఆయన అమితశ్రద్ధతో సానబెట్టుకున్నరు.

‘కళకు ఒక పద్ధతి ఉండటం, కళాకారుడికి స్వీయ శైలి తోడవటం -ఈ రెంటి మహత్యం వల్లే ఎవరి కళ అయినా ఉన్నతస్థాయికి చెందుతుంది’ అని వారు చెప్పేవారు. ఆయన సైతం నిజంగా ఆ రెండింటి నమ్మకానికి ఒక అందమైన వ్యక్తీకరణ. అంతేకాదు, వారు రెండు విధాలా ప్రముఖులు. ఇటు సృజనాత్మక చిత్రకారులుగా లబ్దప్రతిష్టులు. అటు బోధనా పరంగానూ అనుభవజ్ఞులు.

ఎట్లంటే-నీటి వర్ణాలు, ఆయిల్ కలర్స్‌లో ఆయన చిత్రలేఖనం చేశారు. అలాగే, గ్రాఫిక్ ఆర్ట్‌లో భాగమైన వుడ్ కటింగ్, లిథోగ్రఫీ, ఎచ్చింగ్‌లూ చేశారు. మరోవైపు హైదరాబాద్‌లోని జెఎఎన్‌టియు కళా విభాగంలో ఫ్రొఫెసర్‌గా వేలాది విద్యార్థులకు చిత్రకళలో తర్ఫీదు ఇచ్చారు. రెండు దశాబ్దాల క్రితం పదవీ విరమణ చేసినప్పటికీ మరణించే వరకూ ఆయన కళను అంటిపెట్టుకునే ఉండటం విశేషం. ఎనిమిది పదులకు పైగా జీవించిన అయన కోఠీ మహిళా కళాశాల సమీపంలోని స్వగృహంలో ఆయన గత ఏడు మల్ని వీడి వెళ్లారు. 

లాండ్‌స్కేప్ పెయింటర్‌గా మంచి గుర్తింపునూ సంపాదించుకున్నరు. ఫిగరెటివ్ నుంచి నైరూప్య చిత్రకళ వరకూ సాగిన వారి కళా ప్రస్థానంలో తాంత్రిక చిత్రకళ తోడవడంతో వారు పరిపూర్ణంగా వికసించారనే అనాలి.

పెండెం గౌరీశంకర్‌ గారిది పద్మశాలీ కుటుంబం. తెలంగాణలోని ఘట్‌కేసర్ గ్రామం నుంచి తమ తల్లిదండ్రులు తన చిన్నతనంలోనే హైదరాబాద్ నగరానికి వచ్చారు. కులపరంగా తోడైన నిపుణతను ఆయన అమితశ్రద్ధతో సానబెట్టుకున్నరు. లాండ్‌స్కేప్ పెయింటర్‌గా మంచి గుర్తింపునూ సంపాదించుకున్నరు. ఫిగరెటివ్ నుంచి నైరూప్య చిత్రకళ వరకూ సాగిన వారి కళా ప్రస్థానంలో తాంత్రిక చిత్రకళ తోడవడంతో వారు పరిపూర్ణంగా వికసించారనే అనాలి.

దాదాపు అన్ని మాధ్యమాలనూ వారు చిత్రకళలో సాధన చేశారు. ముఖ్యంగా, భూమి- నీళ్లు, కొండలు- కోనలు, వివిధ భవనాలు, నైరూప్య ప్రాకృతిక దృశ్యాలు, ఇవన్నీ ఆయన వివిధ మాధ్యమాల్లో చిత్రిక పట్టేవారు.

దాదాపు అన్ని మాధ్యమాలనూ వారు చిత్రకళలో సాధన చేశారు. ముఖ్యంగా, భూమి- నీళ్లు, కొండలు- కోనలు, వివిధ భవనాలు, నైరూప్య ప్రాకృతిక దృశ్యాలు, ఇవన్నీ ఆయన వివిధ మాధ్యమాల్లో చిత్రిక పట్టేవారు. వాటిల్లో అనితర సాధ్యమైన పనితనం కానవస్తుంది. ఆయన లేయర్స్‌ను రూపొందించే తీరు, రంగులను వాడుకునే విధానం, చిత్రణం అంతాకూడా వివిధ అంశాలు ఒకదాంట్లో ఇంకొకటి సమ్మిళితమై ప్రేక్షకుడిని తన స్వీయ అనుభవంలోకి తెచ్చి గొప్ప అనుభూతిని కలిగిస్తయి. అదే వారి శైలి. ఆ విషయం గురించి చెబుతూ, “ఎవరైనా కూడా చిత్రకళలో తమకంటూ ఒక శైలిని సంతరించుకోవడం అన్నది కేవలం అభ్యాసం వల్ల వచ్చేది కాదు. నిరంతర కృషి వల్ల, మధ్యలో గ్యాప్ తీసుకోకుండా కొనసాగించగలగే పట్టుదలతో సాధించేదే” అని చెప్పారు.

‘ప్రకృతి నుంచి ఇన్‌స్పైర్ అవుతూ, వాస్తవికంగా గ్రహించిన దృశ్యాలను డిస్టార్ట్ చేస్తూ, అనుభవంతో కంపోజ్ చేస్తూ అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతూ ఆలోచనలు రేకెత్తించే చిత్రం గీయడం ఒక ఆనందం. బాధ్యత’ అని ఉల్లాసంగా చెప్పేవారు ఆయన.

‘ప్రకృతి నుంచి ఇన్‌స్పైర్ అవుతూ, వాస్తవికంగా గ్రహించిన దృశ్యాలను డిస్టార్ట్ చేస్తూ, అనుభవంతో కంపోజ్ చేస్తూ అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతూ, వివిధ మాధ్యమాల్లో ఆలోచనలు రేకెత్తించే చిత్రం గీయడం ఒక ఆనందం. బాధ్యత’ అని ఉల్లాసంగా చెప్పేవారు ఆయన. “ఆ దిశగా నా కళా ప్రస్థానంలో నేను సంపూర్ణంగా జీవించాను. ఆనందించాను. అదే నాకు తృప్తి” అన్నారు నాలుగేళ్ల క్రితం ఈ వ్యాసకర్తతో.

ఏమైనా, తమ ప్రతిభను ప్రదర్శనకు పెట్టుకోకుండా, మామూలుగా జీవించిన మన ముందు తరం పెద్ద మనుషులకు, సృజనాత్మక కళాకారులకు ప్రతీక శ్రీ గౌరీశంకర్. నేటి తరానికి వారి పనితనం, అనుభవ సారం రెండూ ఆదర్శాలే. వాటిని ఆచరణలోకి తెచ్చుకోవడమే ఇప్పటి కర్తవ్యం.

ఆర్ట్ హిస్టారియన్ బాలమణి గారు గతంలో వారిపై రాసిన వ్యాసం దీన్ని క్లిక్ చేసి చదవచ్చు.

More articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article