Editorial

Monday, December 23, 2024
ఆరోగ్యంఈ 'పంది'రికం చదవండి : Pig heart into human patient

ఈ ‘పంది’రికం చదవండి : Pig heart into human patient

ఇప్పుడీ ‘పంది పురాణం’ ఎందుకని కదా మీ డౌటు.. మంచి సందర్భమే ఉంది. అమెరికాలో ఓ వ్యక్తికి పంది గుండెను అమర్చారు. అదీ బుద్దిగా అతని శరీరంలో ఒదిగిపోయింది. ఇలా జరగడం వైద్య చరిత్రలో, ప్రపంచంలోనే మొదటి సారి.

సుమ

జనగాంలోని మా కుర్మవాడ పందులకు ఫేమస్.. ఎటు చూసినా పందులు గుంపులు, గుంపులుగా కనిపించేవి. మా చిన్నతనంలో అయితే పిల్లల్ని గుంపులుగా వేసుకుని గుర్రు.. గుర్రు.. మంటూ తిరిగే వాటిని చూస్తే భయమేసేది. మా ఇంటికి రావాలంటే.. పోలీస్ స్టేషన్ పక్క గల్లీలోనుంచి.. చాకలివాడ దాటి రావాలి.. ఆ వాడకు మా వాడకు మధ్య ఓ మలుపు ఉండేది.. అమ్మ బాబోయ్.. అది తలుచుకుంటే ఇప్పటికీ అన్నం సహించదు..

ఆ మలుపులో ఎందుకో గానీ ఎక్కువగా పందులు ఉండేవి.. అది వాటి సామ్రాజ్యం.. అక్కడంతా నానా కంగాళీ చేసి పెట్టేవి. ఇక వాటి పెంట..(అదేనండీ షిట్టూ) అది చూస్తూ, ఆ కంపు పీలుస్తూ రావాల్సిందే.. దీంతో చాలాసార్లు ఇంటికొచ్చాక అన్నం కూడా తినబుద్దేసేది కాదు..ఇప్పుడంటే పందిపెంటకున్న డిమాండ్ ఎలాంటిదో తెలుస్తుంది కానీ.. ఆ వయసులో అది చూస్తేనే అసహ్యం వేసేది.

ఇక ఒక్కో రోజు గల్లీలో ఫుల్లు సందడి ఉండేది.. ఎందుకూ అంటే పందులు పట్టుకుపోయేటోళ్లు వచ్చేవాళ్లు. పొడవాటి కర్రకు చివర గుండ్రంగా ముడివేసి తాడులాంటి వాటితో వాళ్లు పందుల వెంట పడేది. అవి ప్రాణభయంతో భీకరంగా, కీచుగా అరుస్తూ బీభత్సంగా పరుగులు పెట్టేవి. ఆ సమయంలో వాటి కాళ్ల కింద పడ్డామో అంతే సంగతులు.. అందుకే పెద్దర్వాజ లోపల ఉండో.. బయట అరుగులు ఎక్కో ఇదంతా గమనించేది.

ఇంట్లో నాన్న వాళ్లు అప్పుడప్పుడు పంది కూర కూడా తెచ్చుకునేవాళ్లు.. అవి ఈ పందులు కాదులే.. ఫామ్ పందులని..ఎక్కడ్నుండో కొనుక్కొచ్చుకునేవాళ్లు. ఆ రోజు మనం ఇంట్లో నుండి మాయం.. అదన్నమాట పందికి నాకు ఉన్న అనుంబంధం…

ఇక పెళ్లై మా అమ్మాయి పుట్టాక కూడా.. ఆ పందిగోల వదలలేదు. మా అమ్మాయికీ ఆ పందులంటే ఇష్టమే.. అవి కనిపించాలి. ఎంతగా అంటే జనగాం అంటే పందులు.. పందులంటే జనగాం… ఒకవేళ ఏదైనా కారణంతో జనగాం పోయినప్పుడు దానికి పందులు కనిపించకపోతే..అది జనగామే కాదు.. ఇదీ చిన్నతనంలో దాని అభిప్రాయం అది.. ఇప్పటికీ అప్పుడప్పుడూ గుర్తు చేస్తుంటుంది. ఆ జ్ఞాపకాలు మర్చిపోలేక ఓ పెయింటింగ్ కూడా పందులు, వాటి పిల్లల మీద వేసి పెట్టిందనుకోండీ.. అది వేరే విషయం..

ఇప్పటికే పంది హార్ట్ వాల్వ్స్ మనుషులకు అమరుస్తున్నారు. ఇప్పుడు గుండె కూడా సక్సెస్ అయ్యింది. దీంతో ఇక అవయవ మార్పిడి కోసం క్యూల్లో నిల్చోవాల్సిన అవసరం భవిష్యత్తులో ఉండబోదని వైద్యులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఇంతకీ ఇప్పుడీ ‘పంది పురాణం’ ఎందుకని కదా మీ డౌటు.. అక్కడికే వస్తున్నా.. అమెరికాలో ఓ వ్యక్తికి పంది గుండెను అమర్చారు. అదీ బుద్దిగా అతని శరీరంలో ఒదిగిపోయింది. ఇలా జరగడం వైద్య చరిత్రలో, ప్రపంచంలోనే మొదటి సారి. అంటే ఆ పందికి జెనటిక్ ఆల్ట్రేషన్ చేశారనుకోండీ… అదేంటీ అంటే.. యాజిటీజ్ మనిషి గుండెను మనిషికి పెడితేనే ఒక్కోసారి శరీరం ఒప్పుకోదు. ఫారిన్ బాడీ అంటూ రిజెక్ట్ చేస్తుంది. అలాంటిది పంది గుండె పెడితే.. ఒప్పుకుంటుందా.. ‘తగ్గేదేల్యా’.. అంటుంది.

అందుకే.. పందుల మీద ప్రయోగాలు చేస్తూ… వాటి అవయవాలు మనుషుల శరీరాలకు సరిపోయేలా ఏవేవో చేస్తున్నారు. అలా చేసిన గుండెనే అతనికి అమర్చారు. పోయిన శుక్రవారం ఆపరేషన్ చేస్తే.. నాలుగు రోజులకు అది మెల్లిగా మనిషి గుండెలాగే స్పందించడం మొదలెట్టిందట. ఇక నేడో, రేపో అతనికి పెట్టిన బైపాస్ మెషీన్‌ తీసేసి.. పూర్తిగా గుండె మీదే భారం వదిలేస్తారట. వివరాలకు ఈ న్యూస్ క్లిక్ చేయండి.

ఏతా వాతా చెప్పొచ్చేదేంటంటే… పందులు మన జీవితాల్లోనే కాదు శరీరాల్లోనూ కలిసిపోయి… వాటితోనూ..(ఐమీన్ వాటి అవయవాలతో) సహజీవనం చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్న మాట…

ఇప్పటికే పంది హార్ట్ వాల్వ్స్ మనుషులకు అమరుస్తున్నారు. ఇప్పుడు గుండె కూడా సక్సెస్ అయ్యింది. దీనికి కొద్ది నెలల ముందే న్యూయార్క్‌లోని సర్జన్లు బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి జన్యుపరంగా ఇంజనీరింగ్ చేయబడిన పంది కిడ్నీని అమర్చి విజయవంతం అయ్యారు. దీంతో ఇక అవయవ మార్పిడి కోసం క్యూల్లో నిల్చోవాల్సిన అవసరం భవిష్యత్తులో ఉండబోదని వైద్యులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఏతా వాతా చెప్పొచ్చేదేంటంటే… పందులు మన జీవితాల్లోనే కాదు శరీరాల్లోనూ కలిసిపోయి… వాటితోనూ..(ఐమీన్ వాటి అవయవాలతో) సహజీవనం చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్న మాట…

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article