తెలంగాణా జర్నలిస్టుల ఫోరం (TJF) తెచ్చిన పుస్తకంలో సంగిశెట్టి శ్రీనివాస్ గారు రచించిన ఈ వ్యాసం తొమ్మిదవది. తెలంగాణకు జరిగిన అన్యాయాలు, జీవన సంక్షోభానికి గల మూలాలను కోస్తాంధ్ర పత్రికలు నిర్లక్ష్యం చేయడానికి గల కారణాలను మిగతా వ్యాసకర్తలు చర్చిస్తూ ఉండగా సంగిశెట్టి గారు పత్రికా స్వేచ్ఛ విషయంలో తెలంగాణా ప్రాంతం నిజాం కాలం నుంచి ఎట్లా ఎదురీది తన స్వాతంత్ర్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసిందో విశదీకరించారు.
ఉద్యోగ రీత్యా లైబ్రేరియన్ ఐన సంగిశెట్టి శ్రీనివాస్ గారు సాహిత్య, చరిత్ర అంశాల్లో గొప్ప పరిశోధకులుగానే పలువురికి తెలుసు. వారు ఉదయం పత్రికతో పాత్రికేయ ప్రస్థానం ప్రారంభించిన సంగతి కూడా నేటి తరానికి పెద్దగా తెలియదు. జర్నలిజంలో మాస్టర్స్ చేసిన వారు లైబ్రరీ సైన్స్ కూడా చదివినప్పటికీ అసలైన చదువు దేశీయ విజ్ఞానాన్ని వెలికి తీయడంలో ఉంటుందని రుజువు చేసిన మనతరం మార్గదర్శి. పరిశోధనే ప్రధాన ధ్యేయంగా మసిలే వారి వ్యక్తిత్వం, అపార కృషి ఒక్క తెలంగాణకే కాదు, మొత్తం తెలుగు సమాజానికి ఎంతో విలువైన చేర్పు. వారి నిశితమైన రాజకీయ దృక్పథంతో కూడిన వ్యాసాలు, గ్రంధస్తం చేసిన పుస్తకాలు వెనుకబడిన తరగతుల వికాసానికి, తెలంగాణ చరిత్రకు గొప్ప బలిమి, అమూల్య సంపద.
సురవరం ప్రతాపరెడ్డి గారికి ఎదురైన – తెలంగాణాలో కవులే లేరా అన్న ప్రశ్న ఎంతటి విప్లవానికి దోహద పడిందో ఆంధ్ర పత్రికల ఆధిపత్య పోకడలో అసలు తెలంగాణాలో పత్రికలే లేవా? అంటూ తనను తాను ప్రశ్నించుకోవడమూ గొప్ప పరిశోధనకు మార్గం చూపింది. అదే తన చేత తెలంగాణ పత్రికా రంగ చరిత్రను ‘షబ్నవీస్’గా రచింపజేయడం గొప్ప వరం. ఇదొక్కటే కాదు, వారి కృషికి దాఖలాగా నిలిచే ‘దస్త్రమ్‘ నిజంగానే వారి పనితీరుకు ప్రతీక. ఇందులో విస్మరణకు గురయిన తొలినాటి వెయ్యి కథల్ని వారు లెక్కగట్టి చెప్పడం మరో విశేషం. ఇట్లా సాహిత్య చరిత్ర విషయంలోనే కాదు, స్వచ్ఛంద కార్యాచరణలో గానీ తెలంగాణా హిస్టరీ సొసైటీ తదితర సంస్థల ఏర్పాటులో గానీ, మలి తెలంగాణ ఉద్యమం ముందునుంచే వారి చురుకైన కార్యశీలత కారణంగా గానీ ఒక్క మాటలో వారిది మెలుకువ గల కన్ను, కలం. గళం. అది విస్మృత అంశాలను తెలుపు సంకలనం. మీరు చదివే ఈ వ్యాసం వారి పరిశోధనకు ఒక సంక్షిప్త రుజువు.
పత్రికలకు స్వేచ్ఛ అనేది ప్రాణవాయువు వంటిది. ఆంక్షలు, అడ్డంకులు, నిర్బంధాలవల్ల పత్రికలు నిజాల్ని నిర్భయంగా వెల్లడించలేవనేది అందరికీ తెలిసిందే. పత్రికలు స్వేచ్చగా నిజాయితిగా వార్తలు ప్రకటించినట్లయితే తమ మనుగడకు ముప్పు ఏర్పడుతుందని ఆది నుంచీ పాలకులు పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్న వారే. అసత్యాల్ని, అర్ధ సత్యాల్ని మాత్రమే ప్రచారం చేయాలనుకునే ప్రభుత్వాలకు పత్రికా స్వేచ్ఛ అనేది గిట్టని అంశం.
హైదరాబాద్ సంస్థానంలో కూడా పత్రికా స్వేచ్ఛకు ఆది నుంచి అడ్డంకులే ఎదురయ్యాయి. అయినా ఆ ఇబ్బందుల్ని పత్రికలు ధైర్యంగా ఎదుర్కొన్నాయి. 1891లో హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఆస్మాన్ జా హయాంలో పత్రికా స్వేచ్ఛకు మొదటిసారిగా తీవ్ర విఘాతం కలిగింది. అదే సంవత్సరం హోమ్ సెక్రటరీగా ఉన్న పతే నవాబ్ జంగ్ బహద్దూర్ ఒక నోటీసు జారీ చేస్తూ పత్రిక స్థాపనకు అనుమతి తప్పని సరి అని పేర్కొంది. అలాగే పత్రికాధిపతులు ఏడు షరతులతో కూడిన ఒక ‘ఎకరార్ నామా’ (ఒప్పంద పత్రం) పై సంతకం చేయాలని కూడా నిర్దేశించింది. దీనికి మాతృక బ్రిటీషిండియా గవర్నర్ జనరల్ జారీ చేసిన ఉత్తర్వే.
‘తెలంగాణ, మే 31, 2001’ పుస్తకంలోని వ్యాసాలను ‘తెలుపు’ ధారావాహికంగా ప్రచురిస్తోందని మీకు తెలుసు. ఇప్పటిదాకా అచ్చైన వ్యాసాలను ఆయా శీర్షికలను క్లిక్ చేసి చదువుకోగలరు. తెలంగాణ, మే 31, 2001 – చారిత్రాత్మక సంపాదకీయం . మన ప్రతాపరెడ్డికి వందనాలు- కె. శ్రీనివాస్ వ్యాసం. ‘తెలంగాణ’ కార్టునిస్టుల ఖజానా –టి. ఏడుకొండలు. ఒక ఆత్మ హత్య /ఒక హత్య/ ఒక సామూహిక ఖననం – అంబటి సురేంద్రరాజు. తెలంగాణ ఒక నిషిద్ధ ఆలోచన – ఎస్.రామకృష్ణ. పత్రికలు- వ్యాపారం- తెలంగాణ ఉద్యమం : దుర్గం రవీందర్. పత్రికారంగం – ఆధిపత్య ప్రాంతం – కాసుల ప్రతాపరెడ్డి. ‘కల్లోలిత విలేకరులు’ -ఎస్.కె. జకీర్.
‘ప్రభుత్వం విధించిన ఈ నిబంధనలను వ్యతిరేకించి పత్రికా స్వేచ్ఛకోసం పోరాడిన పత్రికలు ‘దక్కన్ టైమ్స్, షౌకతుల్ ఇస్లామ్’ కూడా ఈఈ షరుతులను ఖండిస్తూ బహిరంగ లేఖలను తమ పత్రికలో ప్రకటించింది. ప్రభుత్వాన్ని తీవ్ర పదజాలంతో విమర్శించినందుకు పత్రిక ప్రచురణను నిషేధించారు. దీంతో పత్రిక మూత పడింది. పత్రికా స్వేచ్ఛ కోసం చివరి వరకు పోరాడిన సంపాదకులు ఎంతైనా స్మరణీయులు.
గస్తీ నిషాన్ – 53 అనే ప్రభుత్వ ఆర్డర్ ప్రకారం సభలు, ఏర్పాటు చేసుకోవడానికి కూడా అనుమతి తప్పని సరిగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే పత్రికల్లో ప్రభుత్వానికి, ప్రభుత్వాధికారులకు వ్యతిరేకంగా ఎలాంటి వార్తలు రాయకూడదని కూడా అందులో పేర్కొన్నారు. ఈ నిబంధన వల్ల పత్రికా స్వేచ్ఛకు తీరని విఘాతం కలిగింది. దీనిపై ప్రఖ్యాత జర్నలిస్టు నార్ల వెంకటేశ్వరరావు తన ‘స్వదేశ సంస్థానాలు’ అనే పుస్తకంలో ఇలా రాశారు. ”ఈ సంవత్సరం (1938?) ఆగస్టు 15 సెప్టెంబరు 15 తేదీల మధ్య హైదరాబాద్ సంస్థానములోకి రావీలు లేదని మొత్తం 23 పత్రికలను కాబోలు బహిష్కరించిరి. పత్రికల బహిష్కారము విషయములో ఈ సంస్థానము గూర్చి ఒక కథ చెప్పుచుందురు. ఇది నిజమో, కాదో నిర్ధారణగా చెప్పలేము కాని, ఉన్న పరిస్థితులను బట్టి దీనిలో విపరీత మేమియు లేదు. హైదరాబాద్ లో ఎప్పుడైనా సరే మొత్తం నూరు పత్రికల మీద బహిష్కారముండునట, నూట ఒకటవ పత్రికను బహిష్కరించినంతనే వరసలో మొదటి పత్రిక మీద ఆంక్ష తొలగిపోవునట. ఈ విధముగా ఎప్పటికప్పుడు నూరు సంఖ్యకు భిన్నము రాకుండునట”. ఇది ఆనాటి నిజాం పత్రికా స్వేచ్ఛ పాలసీని తెలియజేస్తోంది.
నిజాం ప్రభుత్వం ‘కరపత్రాల పై’ కూడా తమ నిషేధపు కొరడాను ఝలిపించింది.
భాషా బేధం లేకుండా అన్ని భాషల పత్రికలపై నిజాం ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ ఉండేది. రయ్యత్ అనే ఉర్దూ దిన పత్రిక సంపాదకులు మందుముల నరసింగరావు ప్రభుత్వ పాలసీలను విమర్శించినందుకు పత్రికను మూసేసుకోవాల్సి వచ్చింది. ఈ పత్రికల చందాదారులుగా ఉన్న వారి పేర్లు పోలీసు రిజిస్టర్లలో నమోదు చేయబడేవి. అలాగే డక్కన్ క్రానికల్, గోలకొండ పత్రికలు కూడా ఈ చేదు అనుభవాన్ని చవి చూడాల్సి వచ్చింది. లక్నో నుంచి నియాజ్ ఫతేపురి అనే అతని సంపాదకత్వంలో 1930వ దశకంలో వెలువడ్డ నైగర్ అనే పత్రిక నిజాం ప్రభుత్వ చాంధసత్వానికి మత మౌడ్యానికి, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడింది. స్వాతంత్ర్యం కోసం సామ్రాజ్యవాద వ్యతిరేక లక్ష్యాన్ని ప్రచారం చేసున్నందుకు పత్రికను నిషేధించారు. పండిత నరేంద్రజ్ ‘వైదికాదర్శనం’ అనే పత్రిక ద్వారా హిందువులను రెచ్చగొట్టేలా రచనలు చేస్తున్నారని పత్రికను నిషేధించడమే గాకుండా ఆయనపై 30-04-1938 నుంచి ఒక సంవత్సరం పాటు ఎలాంటి రచనలు చేయకుండా నిషేధం విధించారు. అలాగే నవాబ్ యారల్ జంగ్ పై కూడా ఇలాంటి నిషేధమే విధించారు. ఇది ఆనాటి వ్యక్తిగత స్వేచ్చ ఎంత దారుణంగా ఉండేదో చెప్పే సంఘటనల్లో ఒక్కటి మాత్రమే.
అలాగే కన్నడ పత్రిక ప్రజా సంపాదకుడు తన ప్రాణాలకు ముప్పు ఏర్పడడంతో యూనియన్ ప్రాంతాలకు వెళ్ళాల్సి వచ్చింది. నిజాం ప్రభుత్వం ‘కరపత్రాల పై’ కూడా తమ నిషేధపు కొరడాను ఝలిపించింది. హైదరాబాద్ లోని కామ్రేడ్స్ అసోసియేషన్ ఆహారం సమస్య పై ‘ఆహారం రేషన్ ప్రజల ప్రజాతంత్ర హక్కు’ అనే కరపత్రాన్ని ప్రచురించింది. ఈ కరపత్రంలో అక్రమనిల్వలు, ప్రభుత్వ ఉదాసీన వైఖరిని ఖండించడంతో ప్రభుత్వాధికారులు దీన్ని అభ్యంతరకరమైనదిగా ప్రకటించారు.
హైదరాబాద్ రాజ్యంలో పత్రికా స్వేచ్ఛ కోసం తన ప్రాణాలిచ్చిన అమరుడు షోయెబుల్లాఖాన్, రజాకార్ల దుశ్చర్యలను ఖండిస్తూ తన సంపాదకత్వంలో నిర్వహిస్తున్న ‘ఇమ్రాజ్’ (ఈనాడు) లో వార్తలు, సంపాదకీయాలు రాయడంతో రజాకార్లు కక్ష కట్టి అతన్ని హతమార్చారు.
కేవలం పత్రికల పైనే గాకుండా పాఠశాలల ఏర్పాటు, గ్రంథాలయాల ఏర్పాటు, భజనమండలుల పై, ఊరేగింపుల పై, గ్రంథమాలల నిర్వహణ పై, కూడా ఈ నిర్బంధ కాండ కొనసాగేది.
హైదరాబాద్ రాజ్యంలో పత్రికా స్వేచ్ఛ కోసం తన ప్రాణాలిచ్చిన అమరుడు షోయెబుల్లాఖాన్, రజాకార్ల దుశ్చర్యలను ఖండిస్తూ తన సంపాదకత్వంలో నిర్వహిస్తున్న ‘ఇమ్రాజ్’ (ఈనాడు) లో వార్తలు, సంపాదకీయాలు రాయడంతో రజాకార్లు కక్ష కట్టి అతన్ని హతమార్చారు.
ప్రఖ్యాత జర్నలిస్టు కందూరి ఈశ్వరదత్తు సలహాల పైనే పత్రికా పాలసీ రూపొందేది. ఏ పత్రికను నిషేధించాలన్నా, ఏ జర్నలిస్టులనైనా నిర్బంధంలోకి తీసుకోవాలన్నా అన్ని నిర్ణయాలు ఆయన అనుమతితోనే తీసుకోబడేవి.
తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ప్రభుత్వానికి మింగుడు పడని వార్తలు పంపిస్తున్నారని అసోసియేటెడ్ ప్రెస్ ఆఫ్ ఇండియా (హైదరాబాద్ శాఖ) సహాయ సంపాదకుడిగా ఉన్న గోపాలకృష్ణన్ ని, హిందుస్థాన్ టైమ్స్ పత్రికా విలేఖరులైన యల్. డి. నటరాజన్ గారిని ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది.
అయితే ఇక్కడొక విషయం చెప్పాల్సి ఉంది. హైదరాబాద్ రాజ్యంలో ప్రజా ఉద్యమాలు తీవ్ర స్థాయిలో ఉన్న చివరి సంవత్సరాలలో ప్రభుత్వ సమాచార శాఖ ఉన్నతాధికారిగా ప్రఖ్యాత జర్నలిస్టు కందూరి ఈశ్వరదత్తు ఉండేవారు. ఈయన సలహాల పైనే పత్రికా పాలసీ రూపొందేది. ఏ పత్రికను నిషేధించాలన్నా, ఏ జర్నలిస్టులనైనా నిర్బంధంలోకి తీసుకోవాలన్నా అన్ని నిర్ణయాలు ఆయన అనుమతితోనే తీసుకోబడేవి.