Editorial

Monday, December 23, 2024
విశ్వ భాష‌జీవితం తెలుపు : Die Empty

జీవితం తెలుపు : Die Empty

డైరెక్టర్ చెప్పిన ఆ మాటలు టాడ్ హెన్రీ ‘మనస్సులో ఎంత గట్టిగా నాటుకుని పోయాయీ అంటే అది తనలోని రచయితకు సైతం స్ఫూర్తి నిచ్చింది. ఆ ప్రేరణతోనే టాడ్ హెన్రీ “Die empty” అనే పుస్తకం రాశాడు.

రమేష్ చెప్పాల

మీరు బయలుదేరే ముందు ప్రేమను ప్రపంచానికి పంచి తనువు చాలించండి.

మీలో ఒక ఆలోచన ఉంటే, దాన్ని అమలు చేసి వెళ్ళండి.

మీకున్న సృజాత్మకతను, మీలో ఒక విషయం ఉంటే పంచి పొండి.
మీకోలక్ష్యం ఉంటే, దాన్ని సాధించి సెలవు తీసుకోండి.

ప్రేమించండి, పంచండి, పరివ్యాప్తం చేయండి. దాన్ని దాచుకోవద్దు.

ఒక్క మాటలో మీలోని ప్రతి మంచి అణువును పరివ్యాప్తి చేసి ఖా……ళీగా చావండి.
Die Empty – Todd Henry.

తప్పక చదవాల్సిన, అద్భుతమైన, ఆలోచింపచేసే పుస్తకం ఇది.

టాడ్ హెన్రీ రాసిన ఈ పుస్తకానికి ఉప శీర్షిక Unleash Your Best Work Every Day. ఈ పుస్తకం ఇంగ్లీష్ వెర్షన్ Amazon.inలో అందుబాటులో ఉంది. తెప్పించుకోండి. ఇంతకీ ఈ పుస్తకం చెబుతున్నదేమిటి? అసలు రచయితకు ఈ స్పృహ ఎలా వచ్చింది?

 

టాడ్ హెన్రీ ఒక వ్యాపార సమావేశంలో పాల్గొన్నప్పుడు కంపెనీ డైరెక్టర్ ఒక ప్రశ్నవేసాడంట. ‘ఈ ప్రపంచం మొత్తంలో అత్యంత ఖరీదైన భూమి ఎక్కడ వుంది?’ అనీ!

“గల్ఫ్ దేశాలు” అని ఒకరన్నారు.

“ఆస్ట్రేలియా బంగారు గనులు”అని మరొకరు చెప్పారు.

“ఆఫ్రికా వజ్రాల గనులు” ఇంకొకరన్నారు.

రకరకాల జవాబు చెప్పారు. అన్ని విన్న ఆ డైరెక్టర్ ఇవేవీ కావంటూ అందర్నీ ఆశ్చర్యచకితులను చేసే ఇలా చెప్పాడు. ‘ఈ లోకంలో అతి ఖరీదైన స్థలం స్మశానం’ అన్నాడు. అందరు నిశ్శబ్దంగా ఉన్నారు. ఆశ్చర్యపోయారు. ఏమి అర్థం కానట్టు మొఖం పెట్టారు.

“పుట్టిన వారిలో చాలా కొద్దిమంది మాత్రమే తమలోని తెలివితేటలను ప్రపంచానికి పంచారు. కానీ అధికసంఖ్యాకులు మాత్రం తమలో నిగూఢoగా వున్న మేధస్సును, అనేక ఆలోచనలను, అద్భుతమైన ఐడియాలను తమలోనే దాచుకుని ఈ లోకాన్ని దాటిపోయారు. అవేవీ వెలుగు చూడలేదు.”

అప్పుడాయన వివరిస్తూ ‘ఈ ప్రపంచంలో అనాదిగా కోటానుకోట్లమంది పుట్టారు, మరణించారు. ఇంకా పుడుతూనే ఉంటారు, చనిపోతూనే ఉంటారు. పుట్టిన వారిలో చాలా కొద్దిమంది మాత్రమే తమలోని తెలివితేటలను ప్రపంచానికి పంచారు. కానీ అధికసంఖ్యాకులు మాత్రం తమలో నిగూఢoగా వున్న మేధస్సును, అనేక ఆలోచనలను, అద్భుతమైన ఐడియాలను తమలోనే దాచుకుని ఈ లోకాన్ని దాటిపోయారు. అవేవీ వెలుగు చూడలేదు. వాటివల్ల ఈ ప్రపంచానికి దక్కాల్సిన ప్రయోజనమూ దక్కకుండా పోయింది. అవన్నీ సమాధుల్లోనే నిక్షిప్తం అయిపోయాయి. అంతటి విలువైన సంపదను దాచుకున్న స్మశానం కంటే విలువైన భూమి ఇంకెక్కడ వుంటుంది చెప్పండి.” అని ఆగాడు ఆ డైరెక్టర్. ఇక కరతాళ ధ్వనులు.

డైరెక్టర్ చెప్పిన ఆ మాటలు ‘టాడ్ హెన్రీ మనస్సులో ఎంత గట్టిగా నాటుకుని పోయాయీ అంటే అది తనలోని రచయితకు సైతం స్ఫూర్తి నిచ్చింది. ఆ ప్రేరణతోనే టాడ్ హెన్రీ “Die empty” అనే పుస్తకం రాశాడు.

ఆయన ఈ పుస్తకంలో ఒకచోట “ఉద్దేశం, సిద్ధాంతం మన ప్రపంచాన్ని మార్చవు. నిర్ణయాత్మక చర్య మారుతుంది.” అంటారు. ఇదీ సత్యం.

“స్మశానంలో వ్రాయబడని నవలలు, ఎన్నటికీ ప్రారంభించని వ్యాపారాలు, రాజీలేని సంబంధాలు, ప్రజలు ఆలోచించే ఇతర విషయాలన్నీ సమాధి చేయబడ్డాయి, పోయినవారితో పాటు… నేను రేపు ఆ సమాధి చుట్టూ తిరుగుతాను.

“వాళ్లు పోయి ఒక రోజు అయితే, వారికి రేపు అయిపోతుంది… కానీ వారి కలలు కళలు సజీవంగా అక్కడే ఉంటాయి. అందుకే… ‘మీరు మీలోని సృజనాత్మకతను, శక్తిని మీలోనే దాచుకుని సమాధుల్లో శాశ్వతంగా నిద్రించడానికి వెళ్ళకండి. అవేవో ఈ ప్రపంచానికి పంచేసి వెళ్ళండి’

“భగవంతుడు మీకు సృజనాత్మకతని బహుమతిగా ఇచ్చాడు. దాన్ని మీరు పూర్తిగా వినియోగించడమే తిరిగి ఆయనకు ఇచ్చే బహుమానం.” ఈ పని చేస్తే జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు.

నిజానికి టాడ్ హెన్రీ చెప్పదలచుకున్నది ఏమిటంటే…ఖాళీగా చావండి… ప్లీజ్…

నిజానికి టాడ్ హెన్రీ చెప్పదలచుకున్నది ఏమిటంటే…

‘మీలోని మంచిని మీరు ఈ లోకాన్ని వీడేలోగా ప్రపంచానికి పంచేసి వెళ్ళండి.’
‘మీ దగ్గర మంచి ఆలోచన వుంటే చనిపోయేలోగా దాన్ని ఆచరణలో పెట్టండి.’
‘మీలోని జ్ఞానాన్ని నలుగురికీ పంచండి.’
‘మీకేదైనా లక్ష్యం వుంటే చనిపోయేలోగా దాన్ని సాధించండి’
‘ప్రేమను పంచండి, మీలోనే దాచుకుని వృధా చేయకండి’

వున్నది నలుగురికీ పంచడం ఈనాటి నుండే మొదలు పెడదాం. మన మంచితనంలో ఉన్న ప్రతి అణువునూ అందరికీ ఇచ్చేద్దాం!

‘అప్పుడు హాయిగా …ప్రశాంతంగా….
హృదయపూర్వకంగా…. కృతజ్ఞతతో….
“Let us Die Empty”
ఖాళీగా చావండి.

ప్లేన్ పేపర్ లా ఉండండి. స్వచ్ఛంగా బతకండి…All ways choose Die Empty.

మీరు సంపూర్ణంగా జీవించండి! ఎందుకంటే చాలా మంది ప్రజలు జీవించకుండానే చనిపోయారు.

ఐన్స్టీన్ నుంచి అరిస్టాటిల్ వరకు ఎందరో మహానుభావులు వారి ఆలోచనల్ని, భావాలని, ఆవిష్కరణలను, నాలెడ్జ్ ను ప్రపంచానికి పంచి ఖాళీగా పోయారు. మీరు ప్రతీ రోజు ఉత్తమైన పనిని చేయండి. ఉత్తమ ప్రయత్నం కోసం మాత్రమే మిమ్మల్ని మీరు ఖర్చు చేసుకోండి.

మీరూ అనుకున్నది చేసే చావండి.

ప్రశాంతంగా చావండి. భాద్యతలు పూర్తి చేసి చావండి. సంతోషంగా చావండి.

జీవితంలో, గొప్ప విషాదం మరణం కాదు, లక్ష్యం చేరకపోవడం.

మీరు సంపూర్ణంగా జీవించండి! ఎందుకంటే చాలా మంది ప్రజలు జీవించకుండానే చనిపోయారు.

“భూమిపై అత్యంత ధనిక ప్రదేశాలు స్మశానాలు. ఆ స్మశానాలు ఎన్నడూ కనుగొనబడని వ్యాధులకు, ఎన్నడూ ప్రచురించని పుస్తకాలకు & ఎన్నడూ ఉత్పత్తి చేయని ఆవిష్కరణలకు నివారణలు కలిగి ఉన్నాయి. మీతోపాటు సమాధికి ఏమీ తీసుకెళ్లకుండా చూసుకోండి. ఖాళీగా చావండి… ప్లీజ్.

వ్యాసకర్త రమేశ్ చెప్పాల రచయిత, సినీ దర్శకులు. ఇటీవల వారు ‘మా కనపర్తి ముషాయిరా’ అన్న కథల సంపుటి, ‘బాంబే డాల్’ అన్న నవలను వెలువరించారు. తన ప్రతి రచనల్లో జీవన వికాసం ఒక మెలకువగా ఆవిష్కారం కావడం వీరి ప్రత్యేకత.
ఇ మెయిల్ : rameshcheppala@Gmail.com

More articles

8 COMMENTS

  1. వ్యాసం..చాలా బాగుంది సార్.జీవితంలో ప్రతి మనిషికి కలలు ఉంటాయి.. అవి తీరాకుండానే తనువు చాలించడం చాలా బాధాకరం కొన్ని ఎంత ప్రయత్నించినా తీరవు పరిస్తితుల ప్రభావమో ఆర్థిక భారం వల్లో బంధాల వల్లో ఉద్యోగంలో ఉండే ఆంక్షల వల్లో కొన్ని కొన్ని సృజనాత్మక ఆలోచనల్ని ఆచరణలో పెట్టలేని వారికి మీ వ్యాసం స్ఫూర్తి నింపుతుంది

  2. సూపర్ sir… చావును కూడా సంపూర్ణం చేసే ఈ ఆలోచన అందరికీ అర్థం అవ్వాలి.
    హైలైట్ : జీవితానికి విషాదం మరణం కాదు, లక్ష్యం చేరుకొకపోవడం.

    • Chala bagundhi sir, smashanam ane padham tho jeevithanni gurthu chesthunnaru, ur writings are alwas inspirational.

      Me writings lo Edho teliyani emotion, chadhuvuthunna koddee maro prapancham loki thiskelthayi sir

  3. ఒక్క మాటలో మనిషి తనలో ఉన్న అద్భుత మేధా శక్తి నీ ఎలా ఉపయోగించాలో….ఉపయోగిస్తే కలిగే అద్భుతాల పలితం ఎలా ఉంటుందో…మనిషిగా…ఒక గొప్ప రచయితగా మా బాధ్యతను మీరు తీసుకుని వెన్ను తట్టి మాలో ఉన్న శక్తిని మాకు చూపించే ప్రయత్నం అద్బుతం…మీరు మరెన్నో రచనలు చేయాలని కోరుకుంటున్నాం సార్

  4. చాలా బాగా చెప్పారు సార్ చదివి నా నిర్ణయం మార్చుకున్న

  5. TODD HENRY రాసిన “ఖాళీ గా చావండి- DIE EMPTY” పుస్తకం పై మీ సమీక్ష బాగుంది సర్. మనలో మంచిని పంచి పెడదాం. ఉన్నది నలుగురికీ పంచడం ఈనాటి నుండే మొదలు పెడదాం. మన మంచితనంలో ఉన్న ప్రతి అణువునూ అందరికీ ఇచ్చేద్దాం! అనే మీ సూచన చాల బాగుంది సర్.

  6. Ramesh You brought forward TODD HENRY ‘S message via his book, DIE EMPTY is really laudable. Thank you and congrats on your effort. God bless you abundantly.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article