Editorial

Monday, December 23, 2024
కథనాలు‘కల్లోలిత విలేకరులు' -ఎస్.కె. జకీర్

‘కల్లోలిత విలేకరులు’ -ఎస్.కె. జకీర్

తెలంగాణా జర్నలిస్టుల ఫోరం (TJF) తెచ్చిన పుస్తకంలో ఎస్.కె.జకీర్ గారు రాసిన ఈ వ్యాసం ఎనిమిదవది. ‘కల్లోలిత విలేకరులు’ అన్నది శీర్షిక మాత్రమే కాదు, అందులో తానూ ఒక భాగం.
దాదాపు మూడున్నర దశాబ్దాలుగా తెలంగాణ సమాజాన్ని సన్నిహితంగా చూసి, ప్రజల మధ్య నుంచి తాను గాయపడుతూ అక్షరం జారిపోకుండా ఆత్మవిశ్వాసం వీగిపోకుండా రిపోర్టు చేసిన కలం యోధుల్లో ముఖ్యులు ఎస్.కె.జకీర్ గారు. క్షేత్ర స్థాయి విలేకరిత్వం గురించి, వివిధ దశల్లో సంపాదకత్వం పోకడల గురించి, యాజమాన్యాల ఆధిపత్యాల గురించి సాధికారికంగా విడమర్చి చెప్పగల కలం వీరుడు తాను. ఇన్నేళ్ళలో నిర్భంధం, రాజ్య హింస, నక్సలైట్ల ఇబ్బందుల నుంచి నడిచి వచ్చి నేడు భౌగోళిక తెలంగాణగా రాష్ట్రం ఏర్పాటయ్యాక కూడా అది విలేకరులకు బంగారు తెలంగాణా కాని విషయం కూడా తన వంటి సీనియర్ జర్నలిస్టులకు తెలుసు. మొన్న మొన్నటి దాకా వారు తెలంగాణా కమాండ్ గా  వినిపించారు. నేడు సామాజిక మాధ్యమాల యుగంలో ‘బంకర్ న్యూస్’ గా ఉంటూ తన గొంతు బలంగా వినిపిస్తున్నారు. వారి ప్రస్థానంలో అన్నీ ఉన్నాయి. పెన్ను నుంచి గన్ మైక్ దాకా, ఓబి వ్యాన్ల నుంచి టీవీ స్టూడియాల్లో చర్చల నిర్వహణ దాకా అయన పనిచేయని రంగం లేదు. ప్రజల తరఫున వార్తలే ఎట్లా వ్యాఖ్యానం చేయగలవో అయన రాసి చూపిన కథనాలే, వారు వెలువరించిన గ్రంధం ‘మర్లబడ్డ మొగిలిచెర్ల’ మంచి నిదర్శనం.
ఇరవై ఏళ్ల కిందరి తెలంగాణలో ప్రజా పోరాటాల ఫలితంగా ఎదురైన నిర్బంధంలో, విలేకరులు ఎన్ని విధాలుగా ఇబ్బందుల పాలయ్యారో వివరిస్తూ, చివరకు ప్రాణాలు కోల్పోవడం దాకా అయన ఇందులో పేరుపేరునా వివరించారు. ఒక్క మాటలో తెలంగాణ చరిత్రకు ‘యుద్దభూమి’ అని పేరు పెడితే అందులో పాత్రికేయుల కోణంలో వారు రాసిన ఈ వ్యాసం ఒక నిశితమైన అధ్యాయంగా, కల్లోల కాలానికి దాఖలాగా నిలిచే ఉంటుంది.

మన చుట్టూ ఉన్న సమాజం అనేక సమస్యలతో తగలబడుతుంటే ఆ సెగలు మనల్ని తాకక మానవు. మనల్ని ప్రభావితం చేయక మానవు. మీరు డాక్టర్ కావచ్చు. టీచర్ కావచ్చు. జర్నలిస్టు కావచ్చు. ఏ రంగంలో పనిచేస్తున్నా సరే ఆ సమస్యల మంచి చెడులతో సంబంధం లేకపోయినా మనం తప్పించుకొని పారిపోవడానికి వీలు ఉండదు. సంక్షుభిత తెలంగాణాలో, కల్లోలిత తెలంగాణాలో పత్రికా విలేకరులు విధి నిర్వహణలో కల్లోల భరితమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

‘తెలంగాణ, మే 31, 2001’ పుస్తకంలోని వ్యాసాలను ‘తెలుపు’ ధారావాహికంగా  ప్రచురిస్తోందని మీకు తెలుసు. ఇప్పటిదాకా అచ్చైన వ్యాసాలను ఆయా శీర్షికలను క్లిక్ చేసి చదువుకోగలరు. తెలంగాణ, మే 31, 2001 – చారిత్రాత్మక సంపాద‌కీయం . మన ప్రతాపరెడ్డికి వందనాలు- కె. శ్రీనివాస్ వ్యాసం. ‘తెలంగాణ’ కార్టునిస్టుల ఖజానా –టి. ఏడుకొండలు.  ఒక ఆత్మ హత్య /ఒక హత్య/ ఒక సామూహిక ఖననం – అంబటి సురేంద్రరాజు. తెలంగాణ ఒక నిషిద్ధ ఆలోచన – ఎస్.రామకృష్ణ.  పత్రికలు- వ్యాపారం- తెలంగాణ ఉద్యమం : దుర్గం రవీందర్. పత్రికారంగం – ఆధిపత్య ప్రాంతం – కాసుల ప్రతాపరెడ్డి.

‘యుద్ధ భూమి’లో వార్తలు సేకరించడానికి, తెలంగాణాలోని కొన్ని ప్రాంతాలలో వార్తలు సేకరించడానికి పెద్ద తేడా లేదనే చెప్పాలి. సూటిగా చెప్పాలంటే ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో పోల్చి చూస్తే తెలంగాణాలో విలేకరులకు భద్రత లేదు. ఉత్తర తెలంగాణా, దక్షిణ తెలంగాణా అనే సరిహద్దులు లేవు. తెలంగాణా విస్తరించిన ప్రాంతమంతా ఇదే పరిస్థితి. జిల్లా కేంద్రాలలో పరిస్థితి కొంత వేరు. మండల కేంద్రాలలో, మారుమూల గ్రామీణ ప్రాంతాలలో ఉండే విలేకరులు, నెలకు నాలుగయిదు వందలు కూడా ‘రెమ్యునరేషన్’ దక్కని పరిస్థితిని చర్చించాలి.

అయితే ఈవాళ ఇరువైపులా మోహరించిన పోలీసులు, నక్సలైట్లు ఎవరినైనా, ఎక్కడనైనా పట్ట పగలే చంపి వెళ్ళిపోయే దశ వచ్చేసింది. పదేళ్ళ క్రితమే ఇందుకు అవసరమైన పునాదులు పడ్డాయి. 1991 డిసెంబర్ 28న ‘ఉదయం’ స్టాఫ్ రిపోర్టర్ గులాం రసూల్ ఆయన మిత్రుడు విజయ ప్రసాద్రావులను రంగారెడ్డి జిల్లా మసీదు గూడా గ్రామ శివారులో కాల్చిచంపి ఎన్కౌంటర్ కథ అల్లారు. ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్, పౌరహక్కుల సంఘాలు తీవ్ర ఆందోళనలు చేశారు. వక్సలైట్లతో ‘సంబంధాలున్నాయనే ఆరోపణలతో విలేకరుల పై తప్పుడు కేసులు పెట్టడం, జైల్లో వేయడం, చిత్ర హింసలు పెట్టడం తదితర ఘటనలు అంతకు ముందునుంచే వున్నాయి. కానీ ఈ ఎన్కౌంటర్ చేసి పారేయడం రసూల్ తోనే. ఈ బూటకపు ఎన్కౌంటర్ పై నియమించిన టి ఎల్ ఎన్ రెడ్డి కమీషన్ గులాం రసూల్ను నక్సలైటేనని నిరూపించే ప్రయత్నం చేసింది. పోలీసులు చేసిన హత్యను కమిషన్ సమర్థించింది. ఏ చర్చా లేకుండానే 1994లో కమీషన్ నివేదికను ప్రభుత్వం అమోదించింది. టి ఎల్ ఎన్ రెడ్డి కమీషన్ వాస్తవాలను పరిగణలోకి తీసుకో లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలని జర్నలిస్టు సంఘం, పౌరహక్కుల సంఘాల డిమాండ్కు మోక్షం దొరకలేదు.

కల్లోల తెలంగాణాలో విలేకరి రసూల్ ఎన్కౌంటర్ ఒక కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించింది. నిజామాబాద్ లో మల్లెపూల నరేందర్ ఒక కారణంగా, నల్లగొండలో చాడా శ్రీధర్ రెడ్డి ఇంకో రకంగా నక్సలైట్లకు మధ్య జరిగిన ‘ఎన్కౌంటర్’లో మరణించాడు. అతడు పోలీసులు ప్రయాణించిన వాహనంలో ఉన్నాడు.

కల్లోల తెలంగాణాలో విలేకరి రసూల్ ఎన్కౌంటర్ ఒక కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించింది. నిజామాబాద్ లో మల్లెపూల నరేందర్ ఒక కారణంగా, నల్లగొండలో చాడా శ్రీధర్ రెడ్డి ఇంకో రకంగా నక్సలైట్లకు మధ్య జరిగిన ‘ఎన్కౌంటర్’లో మరణించాడు. అతడు పోలీసులు ప్రయాణించిన వాహనంలో ఉన్నాడు.

కల్లోల తెలంగాణాలో విలేకరి రసూల్ ఎన్కౌంటర్ ఒక కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించింది. నిజామాబాద్ లో మల్లెపూల నరేందర్ ఒక కారణంగా, నల్లగొండలో చాడా శ్రీధర్ రెడ్డి ఇంకో రకంగా నక్సలైట్లకు మధ్య జరిగిన ‘ఎన్కౌంటర్’లో మరణించాడు. అతడు పోలీసులు ప్రయాణించిన వాహనంలో ఉన్నాడు. నక్సలైట్లు చుట్టుముట్టి కాల్పులు జరిపినపుడు నరేందర్ అందులో చిక్కుకుపోయాడు. నక్సలైట్ల ప్రభావిత గ్రామాలకు వెళ్ళేటపుడు ఏ వాహనాల్లో వెళ్ళాలో, ఎవరితో ప్రయాణిస్తే ప్రమాదమో ఈ సంఘటన తేటతెల్లం చేసింది. అదొక పాఠం. నల్లగొండ జిల్లా ఆత్మకూరు (ఎం) మండలంలో పోలీసు ఇన్ఫార్మర్ పేరిట శ్రీధర్ రెడ్డిని నక్సలైట్లు హత్య చేశారు. ఆ ప్రాంతంలో అంతకు ముందు జరిగిన ఎన్కౌంటర్లో దళ సభ్యుడొకరు మరణించాడు. ఆ ఎన్కౌంటర్కు శ్రీధర్ రెడ్డి సమాచారం అందించాడన్నది నక్సలైట్ల అభియోగం. ఇదంతా పూర్తిగా నిరాధారమని సంఘటన పై విచారణ జరిపిన పౌరహక్కుల సంఘం నిర్ధారించింది. గ్రామీణ ప్రాంతాల్లో వృత్తిలో భాగంగా పోలీసులతో చనువుగా వున్నా సమస్యలు తలెత్తక తప్పవు. గ్రామాలలో ఎవరు పోలీసు ఇన్ఫార్మరో, ఎవరు మిలిటెంటో, ఎవరు నక్సలైట్ల గూఢచారులో గుర్తించడం కష్టం.

ఇక తెలంగాణా జర్నలిస్టులపై అక్రమ కేసుల పరంపర చాలా కాలంగా కొనసాగుతున్నది. మెదక్ జిల్లా దుబ్బాకలో రామలింగా రెడ్డిపై టాడా కేసులు పెట్టిన చరిత్ర వుంది. అంతకు ముందు కరీంనగర్ జిల్లాలో మహాముత్తారం మండలంలో చాట్ల మురళీకృష్ణపై బాంబులు దాచాడని కేసులు పెట్టడం చిత్ర హింసలు పాల్జేసిన సంఘటనలున్నాయి.

1999 జూలైలో నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం ఆంధ్రజ్యోతి విలేకరి కలిమెల నాగయ్య, ఆంధ్ర భూమి విలేకరి వెంకటేశ్వర్లతో సహా మరో పదకొండు మందిపై నక్సలైట్లతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో ఎక్స్ప్లోజివ్ యాక్ట్లో సెక్షన్ 3, 5 పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్లోని సెక్షన్ 8 (2) కింద అరెస్టు చేశారు. “అర్ధ నగ్న నృత్యం చేస్తున్న డాన్సర్లు – తిలకిస్తున్న ప్రజలు, పోలీసులు శీర్షికన 1999 మార్చి 16న “ఆంధ్రజ్యోతి’ లో వార్త రాసినందుకు అక్కడి సబ్ ఇన్ స్పెక్టర్ బదిలీ అయ్యాడు. “అదనపు కట్నం కోసం మరో పెళ్ళి ప్రయత్నం – పోలీసుల నిర్లక్ష్యం” శీర్షికన ఆంధ్రభూమిలో ఒక వార్త వచ్చింది. ఈ వార్తలు చాలు పోలీసులకు కోపం తెప్పించడానికి, పోలీసు వ్యవస్థలో అవకతవకలను సరిదిద్దవలసింది పోయి కక్ష సాధింపుగా విలేకరులపై నేరుగా నక్సలైట్ కేసులే నమోదు చేశారు.

పోలీసులు ఎన్ని తప్పులైనా చేయవచ్చు. చట్టాల్ని చేతుల్లో తీసుకోవచ్చు చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించవచ్చు. కానీ ఈ సంగతి పత్రికల్లో రాయకూడదు. పోలీసులకు వ్యతిరేకంగా వార్తలు రాయడం ‘రాజద్రోహం’ అవుతుంది

మెదక్ జిల్లా పాపన్న పేట పోలీసు స్టేషన్ పై నక్సలైట్లు దాడి చేయడం విలేకరుల ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ సంఘటన తర్వాత నెల రోజులకు మెదక్ రూరల్ ‘వార్త’ విలేకరి, పార్ట్ టైమ్ లెక్చరర్ కూడా అయిన వెంకటేశం గౌడ్ పై రాజద్రోహం కేసులు పెట్టారు. 1999 సెప్టెంబర్ 13న ఆరెస్టు చేసి చిత్ర హింసలు పెట్టారు. ఎపియుడబ్యూజే నాయకులు డిజిపిని కలిస్తే కేసులు పెట్టకుండా విడిచి పెడతామని హామీ ఇచ్చాడు. కానీ ఉల్లంఘించారు. మూడవ రోజున వెంకటేశం గౌడ్ చేతులకు బేడీలు వేసి మెదక్ పట్టణంలో తిప్పారు. ‘విలేకరులు పీపుల్స్ వార్ మిలిటెంట్లు’ అని గతంలో అక్కడ ఎస్పీగా పనిచేసిన వినయ్ కుమార్ సింగ్ కు గట్టి నమ్మకం ఉండేది. పోలీసులు ఎన్ని తప్పులైనా చేయవచ్చు. చట్టాల్ని చేతుల్లో తీసుకోవచ్చు చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించవచ్చు. కానీ ఈ సంగతి పత్రికల్లో రాయకూడదు. పోలీసులకు వ్యతిరేకంగా వార్తలు రాయడం ‘రాజద్రోహం’ అవుతుంది. సంఘ వ్యతిరేక శక్తులు, టెర్రరిస్టులతో కుమ్ముక్కు అయినట్టు అవుతుంది. మెదక్లో, నల్లగొండలో, కరీంనగర్ లో ఇంకా ఇతర ప్రాంతాలలో విలేకరుల పై కేసులు పెట్టిన వైనం, వేధిస్తున్న వైనం దీనికి అద్దం పడుతుంది.

1998 అక్టోబర్ 15న కరీంనగర్ జిల్లా జగిత్యాల పోలీసు స్టేషన్లో కొడిమ్యాల ఆంధ్రజ్యోతి విలేకరి లక్ష్మీపతి ప్రాణాలు కోల్పోయాడు. ఒక పిటీ కేసుకు సంబంధించి ఆయనను పట్టుకుపోయి మరణించేలా కొట్టారు. లేదా ఆయన మరణానికి కారకులయినారు. రాష్ట్రంలో పోలీసు కస్టడీలో మృతిచెందిన మొట్టమొదటి విలేకరి లక్ష్మీపతి.

అదే కరీంనగర్ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగ సభ కవర్ చేసేందుకు వెళ్ళిన ఈనాడు స్టాప్ ఫోటోగ్రాఫర్ వై. రాధాకృష్ణను పోలీసులు చితగ్గొట్టారు. ఎంత తీవ్రంగా పగబట్టినట్టు కొట్టారంటే ఆయన ఆరు నెలల వరకు ఆస్పత్రిలోంచి లేవలేదు. తెలంగాణాలో నక్సలైట్ల కార్యకలాపాల అణచివేత సాకుతో పోలీసులు మితిమీరిన అధికారాలలో, తామెవరికీ జవాబుదారీ కాదన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారు. నక్సలైట్ల కార్యకలాపాలు పెరిగిన కొద్ది, ఉద్రిక్తలు పెరిగిన కొద్దీ సామాజిక జీవితం ఎంత సంక్లిష్టంగా మారుతున్నదో విలేకరులకు ‘రిపోర్టింగ్’ కూడా అంతే క్లిష్టంగా మారుతున్నది. నక్సలైట్లు పంపించిన పత్రికా ప్రకటనలు అచ్చు కాకపోతే నక్సలైట్లకు కోపం, అచ్చయితే పోలీసులకు కోపం. విలేకరి ఆ ప్రకటన రాసి పంపిన తరువాత కూడా అచ్చులో వచ్చేంత వరకు అనేక దశలున్న సంగతి నక్సలైట్లకు తెలియదని అనుకోవడానికి వీలు లేదు. కానీ తాము ఇచ్చిన ప్రకటన అచ్చయి తీరాలన్న అభిమత నక్సలైట్లది. నక్సలైట్ల ఇంటర్వ్యూలకు, ప్రెస్ మీట్లకు వెళ్ళి వచ్చింతరువాత పోలీసుల ‘ఆరా’లు సరేసరి.

కత్తుల సమ్మయ్య తొలి ‘కొవర్ట్’ ఆపరేషన్ జరిపిన తీరు సుమన్ అనే మాజీ మిలిటెంట్తో విలేకరులకు నక్సలైట్లు చెప్పించిన ఘటన అది. ఈ ఇంటర్య్వూ పత్రికల్లో వచ్చిన తరువాత ఇంటర్య్వూ జరిగిన ప్రదేశం గురించి యస్పీ నన్ను అడిగారు. నేను చెప్పనన్నాను. వృత్తి ధర్మం కాదన్నాను.

కరీంనగర్లో ఒకసారిలాగే జరిగింది. నక్సలైట్లు ప్రెస్మీట్కు రమ్మని జిల్లా కేంద్రంలో స్టాపర్లకు ఆహ్వానం వచ్చింది. తెల్లవారు ఝామున 4 గంటలకే ప్రయాణం. స్టాపర్లందరినీ సమన్వయం చేయవలసిన బాధ్యత నా మీద వేశారు. అది కీలకమైన ప్రెస్ మీట్.

కత్తుల సమ్మయ్య తొలి ‘కొవర్ట్’ ఆపరేషన్ జరిపిన తీరు సుమన్ అనే మాజీ మిలిటెంట్తో విలేకరులకు నక్సలైట్లు చెప్పించిన ఘటన అది. ఈ ఇంటర్య్వూ పత్రికల్లో వచ్చిన తరువాత ఇంటర్య్వూ జరిగిన ప్రదేశం గురించి యస్పీ నన్ను అడిగారు. నేను చెప్పనన్నాను. వృత్తి ధర్మం కాదన్నాను. అయితే విలేకరులందర్నీ నేను ఆర్గనైజ్ చేసినట్లు తనకు తెలుసున్నారాయన. విలేకరిగా అటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కో-ఆర్డినేట్ చేయడం నేరం కాదని వాదించాను. ఆ విషయం అక్కడితో ముగిసింది. పత్రికా ప్రకటన ఒకే కాపీ ఎవరికో ఒక స్టాపర్ కు వస్తుండేది. దానిని జిరాక్స్ తీయించి మిగతా పత్రికలకు పంపవలసిందిగా నక్సలైట్లు విజ్ఞప్తి చేస్తూ నోట్ పెట్టేవారు. ఈ విషయాన్ని కూడా పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీసిన సంధర్భాలున్నాయి. కానీ విలేకరులలో కూడా పోలీసు ఇన్ఫార్మర్లు, కోవర్ట్ వ్యక్తులు ఉంటారన్న సంగతే నేను చెప్పదలచుకున్నాను.

నల్లగొండ, వరంగల్లో పనిచేస్తున్నపుడు ఫలానా వార్తలు పోలీసుల ఆత్మ సైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని నా మీద ఆయా పత్రికల ఎడిటర్లకు ఎస్పీలు ఫిర్యాదు చేశారు. వరంగల్ లో ఒక ఉదయాన్నే డాక్టర్ ఆమెడ నారాయణను “గుర్తు తెలియని వ్యక్తులు” కాల్చి చంపినపుడు కవరేజకి నేనూ, మరోఫోటోగ్రాపర్ వెళ్ళాం. నారాయణ ప్రజల డాక్టర్. 13 గ్రామాల ప్రజలు ఆయన మృతదేహాన్ని చూడడానికి వచ్చినపుడు పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని పోటోలు తీశాం. అప్పటి కింకా ఇతర పేపర్ల వారెవరూ అక్కడికి రాలేరు. పోలీసులు మా కెమరా లాక్కొని పగులగొట్టారు. ఫోటోగ్రాఫర్ పై దాడికి ప్రయత్నించారు. “మర్లబడ్డ మొగిలిచర్ల”గా ఆ వార్తను కళ్ళకు కట్టినట్టు రాసినందుకు ‘వార్త’ ఆఫీసువద్ద నిఘా పెట్టారు.

‘నీకు నక్సలైట్లతో సంబంధాలున్నాయట- అని ఒక పత్రిక ఎం.డి. నన్నడిగారు. ఆట, ఎందుకు. వున్నాయి. నిజమే అన్నాను. ‘సంబంధాలు’ లేకపోతే ఎలా? అసలు విలేకరి అన్నవాడికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ప్రజా సంబంధాలు. ప్రజలెవరైనా కావచ్చు.

ఎన్కౌంటర్ సంఘటనలు జరిగినపుడు మందుపాతరలు పేల్చినపుడు కవర్ చేయడానికి వెళ్ళిన సందర్భంలో పోలీసులు విలేకర్లను, ఫోటోగ్రాఫర్లను అడ్డగించడం, విధులు నిర్వర్తించకుండా నిలువరించడం, కెమరాలు లాక్కోవడం, దురుసుగా ప్రవర్తించడం, దౌర్జన్యాలు చేయడం వంటి ఉదంతాలెన్నో మన తెలంగాణా ప్రాంతపు విలేకర్లకు అనుభవంలో ఉన్నాయి. ఇక వి.వి.ఐ.పిల పర్యాటక సందర్భంగా కల్లోలిత ప్రాంతాలలో ‘కవరేజి’ సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఇన్ని సమస్యలను, ఒత్తిడిలను ఎదుర్కొంటూ వార్తలు రాసే స్ట్రింగర్లకు ఉద్యోగ భద్రత లేదు. పత్రికల మేనేజ్మెంట్ల నుంచి ప్రోత్సాహం లేదు. చాలా సందర్భాలలో పోలీసులు, నక్సలైట్ల ధోరణి కూడా విలేకరుల పట్ల ఒకే విధంగా వుంది.

విలేకరులను శాసించాలని ఉభయులూ ప్రయత్నిస్తున్నారు. తమకనుకూలంగా మాత్రమే వార్తలు రాయాలని, తాము చెప్పిందే వేదమని అంటున్నారు. ఇరువర్గాల మద్య విలేకరులు నలిగిపోతున్నారని అనలేం కానీ ఇరు వర్గాల నుంచి సమస్యలు మాత్రం ఎదురవుతున్నాయి. ‘నీకు నక్సలైట్లతో సంబంధాలున్నాయట- అని ఒక పత్రిక ఎం.డి. నన్నడిగారు. ఆట, ఎందుకు. వున్నాయి. నిజమే అన్నాను. ‘సంబంధాలు’ లేకపోతే ఎలా? అసలు విలేకరి అన్నవాడికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ప్రజా సంబంధాలు. ప్రజలెవరైనా కావచ్చు. అయితే ఎటువంటి సంబంధాలుండాలన్న విషయం చర్చించదగినదే. సమాచారం కోసం, వార్తలకోసమే సంబంధాలు నడిపితే ఆక్షేపణలేదు. ఇది నిజంగా సున్నితంగా వుండే సమస్యే! కొన్ని సార్లు సంఘవిద్రోహశక్తులని ప్రభుత్వం ముద్ర వేసే వ్యక్తులను కూడా ఇంటర్వూ చేయవలసి రావచ్చు. అక్కడి దాకా వెళ్ళడానికి చానల్ ఏమిటి? ప్రజా సంబంధాలే. అవి ఎంత విస్తృతంగా ఉంటే వార్తలు కూడా లోతుగా తెలుస్తాయి. నక్సలైట్లతోనైనా ఈ సంబంధాల విషయంలో కొందరు విలేకరులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం, అవసరానికి మించి వారితో సన్నిహితంగా మెలగడం వంటి సంఘటనలున్నాయి. ‘ఇట్లా ఉండాలి’ అంటూ మనం ఎవరినీ ఆదేశించలేం. ప్రాక్టికల్ గా ఎవరికీ వారే ఈ వ్యవహారంలో జాగ్రత్తగా, ఒక దృక్పథంతో ప్రవర్తించవలసి వుంది. మొత్తం మీద తెలంగాణా ప్రాంతంలో జర్నలిజం పైన, గ్రామీణ విలేకరులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యల పైన సంక్షోభాల పైన విస్తృత స్థాయిలో అధ్యయనం జరగవలసివుంది. చర్చించవలసి ఉన్నది.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article