నాలుగు దశాబ్దాలుగా అనువాద రంగంలో విశేష కృషి చేస్తున్న శ్రీ రంగనాధ రామచంద్రరావుకి ఆలస్యంగానైనా సముచిత గౌరవం లభించింది. వారికి ఇటీవల ‘కేంద్ర సాహిత్య అకాడెమీ’ 2021గాను అనువాద పురస్కారాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా అభినందనలు తెలుపు, ఈ సంక్షిప్త వ్యాసం.
‘ఛాయా’ మోహన్
కేంద్ర సాహిత్య అకాడెమీ ఈ ఏటి అనువాద సాహిత్య పురస్కారాన్ని శ్రీ రంగనాధ రామచంద్రరావు గారికి ప్రకటించింది. ‘ఓం ణమో’ అన్న వారి అనువాద నవలకు గాను ఆ పురస్కారం లభించింది. ఈ నవలను కన్నడంలో శాంతినాథ్ దేసాయి రాసారు.
1974 నుంచి అంటే దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా వారు అనువాద సాహిత్య రంగంలో విశేష కృషి చేస్తున్న శ్రీ రంగనాధ రామచంద్రరావు గారికి ఆలస్యంగానైనా సముచిత గౌరవం లభించడం సాహిత్య అభిమానులకు ఎంతో సంతోషదాయకం. వారి అనువాదాల్లో ప్రపంచ భాషల్లోని ప్రసిద్ద కథలను తీసుకుని అనువదించిన ‘సిగ్నల్’ కథా సంపుటి చాలా మందికి గుర్తే.
కర్నూలు జిల్లా వాస్తవ్యులైన రంగనాధ రామచంద్రరావు గారు ఇప్పటి దాకా మొత్తం 15 కథల సంకలనాలు, 11 నవలలు , 5 ఆత్మ కథలు అనువదించి తెలుగు సాహిత్యానికి గొప్ప మేలు చేశారు.
కర్నూలు జిల్లా వాస్తవ్యులైన రంగనాధ రామచంద్రరావు గారు ఇప్పటి దాకా మొత్తం 15 కథల సంకలనాలు, 11 నవలలు , 5 ఆత్మ కథలు అనువదించి తెలుగు సాహిత్యానికి గొప్ప మేలు చేశారు. సాహిత్య అకాడమీకి సైతం వారు గత 20 ఏళ్ళుగా ఏడు అనువాదాలు చేస్తుండటం విశేషం. మరో రెండు పుస్తకాలు అచ్చులో ఉన్నాయని తెలిసింది. అన్నట్టు, వారు అనువాదకులే కాదు, స్వతంత్ర రచయిత కూడా. తన రచనలు ఆరు సంపుటాలుగా వెలువరించారు.
మరో విశేషం, రామచంద్రరావు గారు ఛాయా’ ప్రచురణ సంస్థ కోసం ‘మా అమ్మంటే నాకిష్టం’, ‘తారాబాయి లేఖ’, ‘సంచారి బుర్రకథ ఈరమ్మ’, ‘ఒక వైపు సముద్రం’ అన్న పుస్తకాలను అనువదించారని చెప్పడానికి ఎంతో ఆనందంగా ఉంది.
మరో విశేషం, రామచంద్రరావు గారు ‘ఛాయా’ ప్రచురణ సంస్థ కోసం ‘మా అమ్మంటే నాకిష్టం’, ‘తారాబాయి లేఖ’, ‘సంచారి బుర్రకథ ఈరమ్మ’, ‘ఒక వైపు సముద్రం’ అన్న పుస్తకాలను అనువదించారని చెప్పడానికి ఎంతో ఆనందంగా ఉంది. ప్రసిద్ద రచయిత UR అనంత మూర్తి ట్రయాలజీలో చివరి రచన ‘అవస్థ’ పేరుతో వారు అనువదించారు. అది త్వరలో మీ ముందుకు తెస్తున్నాం.
దురదృష్టవశాత్తు రోజు రోజుకూ అనువాద సాహిత్యం బాగా తగ్గిపోతోంది. అటువంటి తరుణంలో స్వతంత్ర రచనల మాదిరిగా అనువాద రచనలపై దృష్టి పెట్టె మంచి రచయితలను అభినందించాలి. ఘనంగా సత్కరించుకోవాలి.
ఏ భాషా సాహిత్యం అయినా అనువాద సాహిత్యం ద్వారా మరింత బలపడుతుంది. ఒకప్పుడు తెలుగులోకి బెంగాలీ, మలయాళీ, కన్నడ, హిందీ భాషల నుంచి విస్తృతంగా అనువాదాలు వచ్చేవి. వాటి ప్రభావం మన సాహిత్యం మీద ఇతర కళల మీదా స్పష్టంగా కనిపించేది. దురదృష్టవశాత్తు రోజు రోజుకూ అనువాద సాహిత్యం బాగా తగ్గిపోతోంది. అటువంటి తరుణంలో ఎంతో శ్రద్ధతో స్వతంత్ర రచనల మాదిరిగా అనువాద రచనలపై దృష్టి పెట్టె మంచి రచయితలను అభినందించాలి. ఘనంగా సత్కరించుకోవాలి.
ఆ కోవలో ముందు వరసలో ఉన్న రామచంద్రరావు గారికి ఆలస్యంగా నైనా తగిన గుర్తింపు లభించడం శుభ పరిణామం. ఈ సందర్భంగా తెలుగు పాఠకుల తరపున ‘ఛాయా’ వారికి హార్దిక శుభాభినందనలు తెలుపుతోంది. మరిన్ని రచనలతో వారు సాహిత్యాన్ని పరిపుష్టం చేయాలని అభిలషిస్తోంది.
https://www.facebook.com/chaayaresourcescenter
CONGRATS to every one